For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీకి దొరికితే స్టోక్స్ కెరీర్ ముగిసినట్టే: శ్రీశాంత్

https://telugu.mykhel.com/cricket/ms-dhoni-master-mind-ian-bell-s-controversial-run-out-028510.html

తిరవనంతపురం: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ దొరికితే అతని కెరీర్‌ను ముగిస్తాడని భారత సీనియర్ పేసర్ శ్రీశాంత్ అన్నాడు. భవిష్యత్తులో ధోనీకి స్టోక్స్ తారసపడవద్దని ప్రార్ధిస్తున్నానని, అదే జరిగితే మాత్రం ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ చిత్తు కావడం ఖాయమని ఈ కేరళ పేసర్ జోస్యం చెప్పాడు. 2019 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌‌లో ధోనీలో గెలవాలనే కసి కనిపించలేదని స్టోక్స్ తన బుక్‌లో రాసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు, మాజీ క్రికెటర్లు స్టోక్స్‌పై దుమ్మెత్తి పోసారు. తాజాగా హాలో యాప్ లైవ్ సెషన్‌లో మాట్లాడిన శ్రీశాంత్ ముందు స్టోక్స్ కామెంట్ ప్రస్తావించగా అతనిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. స్టోక్స్‌కు బౌలింగ్ చేసే అవకాశం తనకు వస్తే ఆ వ్యాఖ్యలకు బంతితోనే సమాధానమిస్తానని తెలిపాడు.

ధోనీ చేతిలో బలికాక తప్పదు..

ధోనీ చేతిలో బలికాక తప్పదు..

‘భవిష్యత్తులో ధోనీకి స్టోక్స్ తారసపడవద్దని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అతనిపై స్టోక్స్ చేసిన కామెంట్స్‌ను ధోనీ మరిచిపోడు. అంతకంతకు బదులు తీర్చుకుంటాడు. ఐపీఎల్‌లో కానీ.. లేక భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌లో ధోనీ చేతిలో స్టోక్స్ బలవ్వకుండా ఉండాలని, మహీని ఎదుర్కునే ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. అతను భారీ మూల్యం చెల్లించుకుంటాడు. అతని బౌలింగ్‌ను ధోనీ చీల్చి చెండాడుతాడు. స్టోక్స్ బెస్ట్ ఆల్‌రౌండర్ కావచ్చు. కానీ ధోనీని మాత్రం అతను ఔట్ చేయలేడు.'అని శ్రీశాంత్ తెలిపాడు.

బ్రదర్.. బదులివ్వాలనుకుంటున్నా..

బ్రదర్.. బదులివ్వాలనుకుంటున్నా..

ఇక స్టోక్స్‌కు తాను చెప్పేది ఒక్కటేనని.. ‘నువ్వు గత 4-5 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నావ్. నేను మాత్రం ఆడటం లేదు. కానీ నీకు బౌలింగ్ చేసేందుకు నేను ఊత్సాహంగా ఉన్నా బ్రదర్. ధోనీ గురించి నీవు చేసిన వ్యాఖ్యలకు బదులివ్వాలనుకుంటున్నా.'అని స్టోక్స్‌కు శ్రీశాంత్ వార్నింగ్ ఇచ్చాడు.

అరే.. మీకు సిగ్గు, శరం ఉందా?.. #VirushkaDivorce ట్యాగ్ ట్రెండింగ్‌పై నెటిజన్ల ఫైర్!

టెస్ట్ ఫార్మాట్ అంటే ఇష్టం..

టెస్ట్ ఫార్మాట్ అంటే ఇష్టం..

క్రికెట్‌లో తనకు టెస్ట్ ఫార్మాట్ అంటే ఇష్టమని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో క్రికెట్ అకాడమీ పెట్టి పేద పిల్లలను అంతర్జాతీయ క్రికెటర్లుగా తీర్చదిద్దాలనేదే తన కలని మనసులోని మాట బయటపెట్టాడు. ఈ లైవ్ సెషన్ సందర్భంగా నాగినీ డ్యాన్స్‌తో పాటు బుట్టబొమ్మా సాంగ్‌కు చిందేశాడు. తన తండ్రి తన ఫేవరేట్ అని చెప్పుకొచ్చిన శ్రీశాంత్.. బౌలింగ్‌లో డెనిస్ లిల్లీ, అలన్ డొనాల్డ్ ఇన్సిపిరేషన్ అని తెలిపాడు. టీ20ల్లో డబుల్ సెంచరీ చేసే సత్తా రోహిత్, విరాట్‌లకు ఉందని చెప్పుకొచ్చాడు.

 నీ సిక్స‌ర్ల మాదిరిగా సినిమా ఉంటుంది..

నీ సిక్స‌ర్ల మాదిరిగా సినిమా ఉంటుంది..

మైదానంలో తన స్పిన్‌తో అలరించిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న విషయం తెలిసిందే. తమిళ చిత్రం ‘ఫ్రెండ్‌షిప్‌' ద్వారా ఆయన హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. తమిళ బిగ్‌బాస్‌ ఫేమ్‌ లోస్లియా మరియ నేసన్‌ కథానాయిక. జాన్‌పాల్‌రాజ్‌, శ్యామ్‌ సూర్య దర్శకులు. తెలుగు, హిందీ, తమిళ్‌, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో యాక్షన్‌కింగ్‌ అర్జున్‌, తమిళ నటుడు సతీష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌పోస్టర్‌ను రీసెంట్‌గా విడుద‌ల చేశారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్ పై శ్రీశాంత్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ఆల్ ది వెరీ బెస్ట్ భ‌జ్జీపా.. మూవీ పోస్ట‌ర్ అద్భుతంగా ఉంది. నీ సిక్స‌ర్ల మాదిరిగా ఈ సినిమా త‌ప్ప‌క భారీ విజ‌యం సాధిస్తుంద‌ని నేను న‌మ్ముతున్నాను. చిత్ర బృందానికి నా శుభాకాంక్ష‌లు' అని శ్రీశాంత్ ట్వీట్ చేశాడు.

ధోనీ మాస్టర్ మైండ్.. వివాదాస్పద రీతిలో ఇయాన్ బెల్ రనౌట్! మహీని కొనియాడిన బ్రిటీష్ మీడియా!

Story first published: Monday, June 8, 2020, 16:25 [IST]
Other articles published on Jun 8, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+