భారత్ నుంచి వెళ్లిన దక్షిణాఫ్రికా టీమ్‌కు కరోనా.. 14 రోజులు ఐసోలేషన్‌లో

న్యూఢిల్లీ: మూడు వన్డేల సిరీస్ కోసం భారతకు వచ్చి వెళ్లిన సౌతాఫ్రికా జట్టుకు ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో ఆ జట్టు కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది.
భారత్ నుంచి బుధవారం స్వదేశానికి వెళ్లిన సఫారీ ఆటగాళ్లు రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు.

సిరీస్ రద్దు.. స్వదేశానికి పయనం..
మార్చి 12 నుంచి 18 వరకూ ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉండగా.. ధర్మశాల వేదికగా జరగాల్సిన ఫస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అనంతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మిగతా రెండు వన్డేలను ప్రేక్షకుల్లేకుండా నిర్వహించాలని తొలుత భావించినా.. ఆటగాళ్లు, ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యంగా బీసీసీఐ సిరీస్‌ను రద్దు చేసింది. దీంతో.. సఫారీ టీమ్ స్వదేశానికి వెళ్లిపోయింది.
రెండో వన్డే కోసం లక్నోకు చేరుకున్న సఫారీ టీమ్.. మూడు రోజులు అక్కడే ఉండిపోయింది. మంగళవారం కోల్‌కతాకి చేరుకుని అక్కడి నుంచి దుబాయ్‌కి వెళ్లి కనెక్టింగ్ ప్లైట్‌లో దక్షిణాఫ్రికాకి చేరుకుంది.
భారత క్రికెట్ చరిత్రలోనే మరిచి పోలేని రోజు..!!

కోల్‌కతాలో కరోనా..
దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కోల్‌కతాను వీడే వరకూ పశ్చిమ బెంగాల్‌లో ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఈ కారణంగానే వారు కోల్‌కతా నుంచి దుబాయ్‌కి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ.. సఫారీ టీమ్ వెళ్లిన గంటల వ్యవధిలోనే కోల్‌కతాలో కరోనా వైరస్ కేసు నమోదైంది. దీంతో.. ముందస్తు చర్యల్లో భాగంగా ఆటగాళ్లని 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండమని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆదేశించింది.

ఇతరులకు రాకుండా..
ఈ విషయాన్ని ఆ జట్టు డాక్టర్ షుయబ్ మంజ్రా క్రిక్‌ఇన్‌ఫోకు తెలిపాడు. ‘భారత పర్యటనకు ముందు కరోనా ప్రభావం తక్కువగా ఉంది. కానీ సౌతాఫ్రికా జట్టు అక్కడికి చేరగానే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. ఈ వైరస్ గురించి మేం మా ఆటగాళ్లకు అవగాహన కల్పించాం. సౌతాఫ్రికాలో ఇతరులకు ఈ వైరస్ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరాం. ఇందులో భాగంగానే 14 రోజుల పాటు స్వియ నిర్భంధంలో ఉండమని ఆదేశించాం.' షుయబ్ మంజ్రా తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications