For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత క్రికెట్‌ చరిత్రలోనే మరిచి పోలేని రోజు..!!

On this day Sachin Tendulkars last ODI, Virat Kohli Super Century and Dinesh Karthiks last-ball six

హైదరాబాద్: కరోనా.. కరోనా ఎక్కడా చూసిన అదే.! దీని దెబ్బకు ప్రపంచమే ఆగిపోతే.. క్రీడారంగం మూగబోయింది. టోర్నీలన్నీ రద్దయ్యాయి..! ఆటల్లేవ్.. వాటి గురించి మాట్లాడుకోడాల్లేవ్..! కేవలం కరోనానే లోకమైపోయింది. ఈ మహమ్మారి దెబ్బకు ఈ టోర్నీ ఆగింది.. ఆ టోర్నీ వాయిదా పడింది.. మరి ఈ పోటీలు జరుగుతాయో లేదో..! అని గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా.. ఇదే గోల.! ఆటగాళ్లు సైతం ఈ జాగ్రత్తలు పాటించండి.. ధైర్యంగా ఉండండని ఈ ప్రాణాంతక వైరస్ గురించే మాట్లాడుతున్నారు.!

ఒకే రోజు మూడు అద్భుతాలు

ఒకే రోజు మూడు అద్భుతాలు

ఈ పరిస్థితుల్లో ఒకసారి చరిత్రను నెమరువేసుకుంటే మనస్సు తేలికకావచ్చు. ఒకప్పటి మధుర క్షణాలు కళ్ల ముందు ప్రత్యక్షమవ్వచ్చు. ఇక మార్చి 18 భారత క్రికెట్ చరిత్రలోనే మరిచిపోలేని దినం. అవును ఈ రోజు ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు అద్భుతాలు భారత్ క్రికెట్‌లో చోటుచేసుకున్నాయి. ఒకటి బాధించే విషయమే అయినా.. ఇంకోటి తేలిక పరిచేది. మరొకటి ఉద్విగ్న క్షణాలను మిగిల్చిన సందర్భం.!

సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే రోజు ఓ క్రికెట్ శిఖరం తన ఆట‌కు వీడ్కోలు పలకగా.. అదే మ్యాచ్‌లో ఓ యువ ఆటగాడు మెరుపులు మెరిపించాడు. రెండేళ్ల క్రితం మళ్లీ ఇదే రోజు భారత అభిమానులకు మరిచిపోలేని అద్భుత క్షణాలను మిగిల్చింది. ఆ క్రికెట్ శిఖరం సచిన్ టెండూల్కర్ అయితే.. ఆ యువ కెరటం విరాట్ కోహ్లీ.! ఇక మధురానుభూతిని మిగిల్చింది దినేష్ కార్తీక్.!

మైదానంలో కోహ్లీ అతి చూశాక నేనో పంచింగ్ బ్యాగ్‌లా అనిపించింది!!

సచిన్ ఆఖరి వన్డే ఒకటే కాదు..

సచిన్ ఆఖరి వన్డే ఒకటే కాదు..

అది 2012 మార్చి 18. ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. పాక్ నిర్ధేశించిన 330 పరుగుల లక్ష్యాన్ని 13 బంతులు మిగిలుండగానే చేధించింది. తన ఆఖరి వన్డేలో సచిన్(52) హాఫ్ సెంచరీతో రాణించగా.. యువ కెరటం విరాట్ కోహ్లీ (183) పరుగులతో విధ్వంసమే సృష్టించాడు. ఫలితంగా భారత్ సునాయస విజయాన్నందుకుంది. ఇక ఈ టోర్నీలోనే సచిన్ బంగ్లాదేశ్‌పై శతకం చేసి 100 సెంచరీలను పూర్తి చేసుకున్నాడు.

చివరి బంతికి సిక్స్ కొట్టి..

చివరి బంతికి సిక్స్ కొట్టి..

ఇక 2018 మార్చి 18.. బంగ్లాదేశ్‌తో నిదహాస్ ట్రోఫీ ఫైనల్. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు గెలవాలంటే ఆఖరి బంతికి 5 పరుగులు చేయాలి. క్రీజులో దినేశ్ కార్తీక్.. బౌలర్‌గా సౌమ్యా సర్కార్. ఉత్కంఠకే ఊపిరందని క్షణం. విజయం ఎవరినో వరిస్తుందో తెలియని సందర్భం. ఈ క్లిష్ట స్థితిలో తన అనుభవాన్నంత రంగరించిన దినేశ్ కార్తీక్ అద్భుత సిక్సర్ కొట్టాడు.

ఒక్కసారిగా భారత శిభిరంలో ఆనందం.. ఆ క్షణం యావత్ భారతానికి దినేశ్ కార్తీక్‌ హీరో అయ్యాడు. ఈ ఒక్క సిక్స్ తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో(అప్పటికి) రాని గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ మ్యాచ్‌లో కార్తీక్ 8 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ పెర్ఫామెన్స్ అతన్ని 2019 వన్డే వరల్డ్‌కప్ టీమ్‌లో ఉండేలా చేసింది.

Story first published: Wednesday, March 18, 2020, 17:48 [IST]
Other articles published on Mar 18, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+