ప్రమాదకర పిచ్‌పై టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం: దాదా

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ విచారం వ్యక్తం చేశాడు. కొవిడ్-19తో దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే ప్రమాదకరమైన పిచ్‌పై టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నట్టుగా ఉందన్నాడు. తాజాగా ఫీవర్ నెటవర్క్ 100 అవర్స్..100 స్టార్స్ అనే కార్యక్రమంలో దాదా మాట్లాడాడు.

బంతులు వేగంగా దూసుకొస్తున్నాయి..
‘ప్రస్తుత పరిస్థితులను చూస్తే డేంజరస్ వికెట్‌పై టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నట్లు ఉంది. బంతులు వేగంగా వస్తున్నాయి. అలాగే స్పిన్ కూడా బాగా తిరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న తప్పులు కూడా చేయకుండా వికెట్ కాపాడుకుంటూ టెస్ట్ మ్యాచ్ గెలవాలి. ఇది చాలా కష్టమన్న విషయం నాకు తెలుసు. కానీ, అందరం కలిసి ఆడితే ఈ మ్యాచ్ తప్పకుండా గెలుస్తాం'' అని గంగూలీ తెలిపాడు.

చాలా బాధగా ఉంది..
కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారి పట్ల గంగూలీ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఈ పరిస్థితులను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. బయట చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కరోనాకు ఎలా అడ్డుకట్టవేయాలో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ప్రపంచం మొత్తం ఇలాగే ఉండటం నిజంగా దురదృష్టకరం. ఎటు నుంచి, ఎప్పుడు, ఎలా ఇది వచ్చిందో చెప్పడం కష్టంగా ఉంది. ఇలాంటిది ఒకటి వస్తుందని మనం ఎప్పుడూ ఊహించలేదు'అని గంగూలీ విచారం వ్యక్తం చేశాడు.

బాధే కాదు.. భయంగా ఉంది..
‘ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ పరిస్థితులను నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయి. అలాగే భయాన్ని కూడా కలిగిస్తున్నాయి. మా ఇంటికి నిత్యావసరాలు, ఆహారం తీసుకొస్తుంటే నాకు భయం వేస్తోంది. ఇదొక భిన్నమైన అనుభూతి. ఈ పరిస్థితి ఎంత తర్వగా మారితే అంత బాగుంటుంది. క్రికెట్ నా జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పింది. ఆడేటప్పుడు ఒక్క తప్పటడుగు వేసినా మరో ఛాన్స్ ఉండదు. అలాంటి పరిస్థితులు నేను నిజ జీవితంలో ఎలా ఉండాలో నాకు నేర్పాయి'అని గంగూలీ తెలిపాడు.
రాయుడు, ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్‌పై కనికరం చూపలేకపోయాం: ఎమ్మెస్కే ప్రసాద్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications