సౌరాష్ట్రకు ఎదురుదెబ్బ.. రవీంద్ర జడేజా రంజీ ఆడటానికి వీల్లేదన్న గంగూలీ.!

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ-2020 సీజన్ తుది దశకు చేరుకుంది. సౌరాష్ట్ర-బెంగాల్ జట్ల మధ్య ఈ సోమవారం(మార్చి 9) నుంచి మార్చి 13 వరకు టైటిల్ ఫైట్ జరగనుంది. సౌరాష్ట్ర తరఫున టీమిండియా టెస్ట్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా, బెంగాల్ తరఫున వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా ఫైనల్ మ్యాచ్ ఆడనున్నారు. ఇక సౌరాష్ట్రకే చెందిన రవీంద్ర జడేజాను కూడా ఫైనల్ మ్యాచ్ ఆడించాలని భావించిన సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు గంగూలీ షాకిచ్చాడు.

కంట్రీ ఫస్ట్..
జడేజా రంజీ ఫైనల్ ఆడటానికి వీల్లేదని స్పష్టం చేశాడు. సౌతాఫ్రికా వన్డే సిరీస్ నేపథ్యంలో జడేజాను రంజీలు ఆడించేందుకు కుదరదని స్పష్టం చేశాడు. మార్చి 13 వరకు రంజీ ఫైనల్ కొనసాగనుండటం.. మార్చి 12న సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జడేజాకు అనుమతివ్వడానికి గంగూలీ నిరాకరించాడు. జడేజాను ఫైనల్ ఆడించుకునేలా అనుమతివ్వాలని కోరితే గంగూలీ తిరస్కరించాడని, దేశం తరఫున ఆడటమే ప్రథమ ప్రాధాన్యతని చెప్పాడని సౌరాష్ట క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయదేవ్ షా తెలిపాడు.
‘జడేజాను ఫైనల్లో ఆడించడానికి బీసీసీఐ అనుమతి కోరా. కానీ గంగూలీ తిరస్కరించాడు. ‘కంట్రీ ఫస్ట్ పాలసీ' కింద జడేజా ఆడటానికి అనమతి ఇవ్వలేదు.'అని జయదేవ్ షా తెలిపాడు.
ఆడకుండా ఫైనల్ చేరడం కంటే.. ఓడిపోవడమే మంచిది: సౌతాఫ్రికా కెప్టెన్

ఐపీఎల్‌కు డబ్బులు.. రంజీలకు రావనే..
ఐపీఎలకు డబ్బులు వస్తాయనే ఆ సమయంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించడం లేదని జయదేవ్ షా అసహనం వ్యక్తం చేశాడు. ‘రంజీ ట్రోఫీ ఫైనల్ జరిగేటప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు అనేవి ఉండకూడదు. దేశవాళీ క్రికెట్‌కు బీసీసీఐ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావించినప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉండకూడదు. రంజీ ట్రోఫీ ఫైనల్ జరిగే సమయంలో అంతర్జాతీయ మ్యాచ్ ఉంది. నేను బీసీసీఐని ఒకటే అడగదల్చుకున్నా. ఐపీఎల్ జరిగేటప్పుడు ఏమైనా అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారా.? అది డబ్బును తెచ్చిపెడుతుంది కాబట్టి అప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు పెట్టడం లేదు. స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పుడే రంజీ ట్రోఫీకి మరింత ఆదరణ లభిస్తోంది. కనీసం ఫైనల్స్‌లోనైనా స్టార్ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వండి. రంజీ ఫైనల్స్ జరిగేటప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు షెడ్యూల్‌లో ఉండకూడదు' అని షా సూచించారు. తమ జట్టు తరఫున ఆడటానికి జడేజాని కోరుతున్నామని, అదే సమయంలో మహ్మద్ షమీ బెంగాల్ తరఫున ఆడాలని కూడా తాము కోరుకుంటున్నామన్నారు.

పుజారా రాకతో మా బలం పెరిగింది..
పుజారా రాకతో తమ జట్టు బలం మరింత పెరిగిందని సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనాద్కాట్ తెలిపాడు. ‘న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నా.. చింటు (పూజారా)తో నేను నిరంతరం టచ్‌లో ఉన్నా. సెమీస్‌లో మేం విజయం సాధించినప్పుడు అతను ఫ్లైట్‌లో ఉన్నాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో మా టాపార్డర్ విఫలమైంది. అతని రాకతో ఇప్పుడు ఆ సమస్య తిరినట్టే. మా విశ్వాసం మరింత పెరిగింది'అని ఉనాద్కాట్ చెప్పుకొచ్చాడు.
ఇక రంజీట్రోఫీలో ఫైనల్ చేరడం సౌరాష్ట్రకు ఇది వరుసగా రెండోసారి. గుజరాత్‌తో బుధవారం ముగిసిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ జయదేవ్ ఉనాద్కాట్ ఏడు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించి అద్భుత విజయాన్నందించాడు. ఇక గత 8 ఏళ్లలో సౌరాష్ట్రకు ఇది నాలుగో ఫైనల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications