గంగూలీకి నగ్మా బర్త్‌డే విషెస్.. సంగతేంటని ఆటపట్టిస్తున్న నెటిజన్లు!

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ బుధవారం 48 పడిలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. భారత క్రికెట్‌లో ఓ విప్లవాన్ని తీసుకొచ్చిన దాదాకు యావత్ భారతం జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. అతని చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు.. అద్భుత విజయాలను స్మరించుకుంది. ఆటగాడి నుంచి కెప్టెన్‌గా.. ఇప్పుడు భారత క్రికెట్‌నే నడిపించే స్థాయికి ఎదిగిన దాదా.. మరింత అత్యున్నత పదవులను అందుకోవాలని ఆకాంక్షించింది. సహచరులు, ప్రస్తుత ఆటగాళ్లు, సినీ,రాజకీయ రంగాల ప్రముఖులు ఈ బీసీసీఐ బాస్‌కు బర్త్‌డే విషెస్ చెప్పడానికి సోషల్ మీడియా వేదికగా పోటీపడ్డారు.
దాదా.. మీ వైఫ్ చిత్కక్కొడుతది..
అయితే వీరంతా విషెస్ చెప్పడం ఒక ఎత్తైతే ప్రముఖ సినీ నటి అయిన నగ్మా.. దాదాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె సింపుల్‌గా హ్యాపీ బర్త్ డే గంగూలీ అని ట్వీట్ చేసినా.. నెటిజన్లు మాత్రం వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ దాదాను ఆటపట్టిస్తున్నారు.
తమ ఎడిటింగ్ నైపుణ్యానికి పనిచెబుతూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ‘మీ వైఫ్‌కు తెలిస్తే చితక్కొడుతది.. దాదా జాగ్రత్త'అని ఒకరంటే.. దాదా, నగ్మా ల మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని మరొకరు కామెంట్ చేశారు. ఇలా దాదాను ఓ ఆట ఆడుకుంటున్నారు.
నగ్మాతో ఎఫైర్..
యుక్త వయసులో బాలీవుడ్ హీరోను తలిపించే శరీర సౌష్టవం కలిగిన దాదాను అమ్మాయిలు తెగ ఇష్టపడేవారు. అప్పట్లో ఈ స్టార్ క్రికెటర్-నగ్మాల మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందనే పుకార్లు షికార్లు చేశాయి. అప్పుడు సోషల్ మీడియా, టీవీ చానెళ్లు ఇంతగా లేకపోవడంతో వీరీ ప్రేమాయాణంపై స్పష్టత రాలేదు. కానీ నగ్మాతో దాదా చాలా కాలం ఎఫైర్ సాగించడనేది అతని అభిమానుల నమ్మకం. ఇక ఈ ఇద్దరూ కొన్ని ఇంటర్వ్యూల్లో వీరీ ప్రేమాయణం గురించి పరోక్షంగా ప్రస్తావించారు.
తెలుగు ప్రేక్షకులకు సపరిచితమే..
ఇక నగ్మా పలు హిందీ చిత్రాలతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా నటించింది. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో బిజీగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ప్రజల తరఫున పోరాడుతోంది. ఇక గంగూలీ 1997 ఫ్రిబవరి 21న దోనా గంగూలీని వివాహం చేసుకున్నాడు. ఈ జంట సనా అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఇక 2008లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన గంగూలీ ప్రస్తుతం బీసీసీఐ బాస్‌గా కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications