హ్యాపీ బర్త్ డే దాదా.. విషెస్‌తో ట్విటర్‌ను ఊపేస్తున్న ఫ్యాన్స్, క్రికెటర్స్

హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ నేటితో 48వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా యావత్ క్రికెట్ ప్రపంచం దాదాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది. భారత క్రికెట్ గతిని మార్చిన గంగూలీ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లను గుర్తుచేసుకుంది. ఇక మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానుల విషెస్‌తో సోషల్ మీడియా హోరెత్తింది. మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, మహ్మద్ కైఫ్‌లతో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్ తదితర ఆటగాళ్లు బీసీసీఐ బాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

ఆ దేవుడి ఆశీస్సులు మీకుండాలి..
‘జన్మదిన శుభాకాంక్షలు దాదా. మన బంధం మైదానంలో మన పరుగుల భాగస్వామ్యంలా కొనసాగాలి. నీవు మరిన్ని విజయాలందుకోవాలి'-సచిన్
‘హ్యాపీ బర్త్ డే దాదా.. ఆ దేవుడి ఆశీస్సులు మీకుండాలి'-విరాట్ కోహ్లీ
‘దాదాకు జన్మదిన శుభాకాంక్షలు. స్పిన్నర్ల బౌలింగ్‌లో సిక్స్ కొట్టి చిందేసినప్పుడే అతని కనురెప్పలు కొట్టుకునేవి. కెరీర్ ప్రారంభంలో అతను ఇచ్చిన మద్దతు చాలా గొప్పది'-సెహ్వాగ్
‘హ్యాపీ బర్త్ డే దాదా.. మీ భవిష్యత్తు ఇంకా బాగుండాలి'-హర్భజన్ సింగ్

తిరుగులేని దాదాకు..
‘భారత క్రికెట్‌లో తిరుగలేని దాదాకు జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పుడూ ముందుండి నిజమైన నాయకుడంటే ఎంటో చూపించారు. మీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. నాలానే ఇతరులు కూడా మిమ్మల్ని ఇష్టపడాలనుకుంటున్నా. మీరే మా శాశ్వత కెప్టెన్'- యువరాజ్ సింగ్
‘గంగూలీ మీరు ఇలాంటి రోజులు మరిన్ని జరుపుకోవాలి. మరిన్ని విజయాలతో మరింత మంది ప్రేమను గెలుచుకోవాలని, ఈ ఏడాదంత మంచే జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.'-వీవీఎస్ లక్ష్మణ్
మంచి బ్యాట్స్‌మన్ నుంచి అద్బుత కెప్టెన్ వరకు.. ఇప్పుడు భారత క్రికెట్‌నే శాసిస్తున్న నా ఫేవరేట్ కెప్టెన్, మెంటార్ సౌరవ్ గంగూలీకి జన్మదిన శుభాకాంక్షలు-మహ్మద్ కైఫ్

విప్లవం తెచ్చిన వీరుడు..
‘భారత క్రికెట్‌లోనే ఓ విప్లవం తెచ్చిన వీరుడు దాదాకు జన్మదిన శుభాకాంక్షలు. ఆటగాడిగా, కెప్టెన్‌గా క్రికెట్‌కు దాదా అందించిన రాబోయే తరాల వారు మెచ్చుకోకుండా ఉండలేరు. జీవితంలో మరిన్ని విజయాలందుకోవాలి'-సురేశ్ రైనా
‘భయంలేని ఆటగాడు.. భారత క్రికెట్‌ను మరో స్థాయికి చేర్చిన దాదాకు హ్యాపీ బర్త్‌డే'-కేఎల్ రాహుల్
హ్యాపీ బర్త్‌డే సౌరవ్ సర్.. ఆయురారోగ్యాలతో పాటు సంతోషంగా ఉండాలి-చహల్
‘భారత దిగ్గజ క్రికెటర్ దాదాకు జన్మదిన శుభాకాంక్షలు. నీ సారథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లను భయం లేకుండా దూకుడగా ఆడేలా తీర్చిదిద్దావ్'-కుల్దీప్
భారత్ తెగింపుని క్రికెట్ ప్రపంచానికి చాటిన కెప్టెన్.. హ్యాపీ బర్త్‌డే దాదా!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications