Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే సచిన్ ఎప్పుడూ స్ట్రైక్ తీసుకునేవాడు కాదు: గంగూలీ

Sourav Ganguly reveals why Sachin Tendulkar never wanted to take strike while opening for India

న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓపెనర్‌గా ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకోకపోవడానికి గల కారణాన్ని మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు.

'దాదా ఓపెన్స్ విత్ మయాంక్'పేరిట యంగ్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ ట్విటర్ వేదికగా ఓ కార్యక్రమం నిర్వహించాడు. ఈ సందర్భంగా సచిన్ పాజీ తొలి బంతిని ఎక్కువ ఎదుర్కోకపోవడానికి, స్ట్రైకింగ్ తీసుకోమని సహచరుడిని బలవంతం చేయడగానికి గల కారణం ఏంటని మయాంక్ ప్రశ్నించగా.. దాదా సమాధానమిచ్చాడు.

 రెండు కారణాలు..

రెండు కారణాలు..

‘సచిన్ ఎప్పుడూ స్ట్రైకింగ్ తీసుకోవడానికి ఆసక్తి చూపేవాడు కాదు. తొలి బంతిని ఫేస్ చేయమని నేనూ తరుచూ చెప్పేవాడిని. ఎందుకంటే ఎప్పుడూ నేనే స్ట్రైక్ తీసుకునేవాడిని. దానికి సచిన్ రెండు సమాధానాలు చెప్పేవాడు. అతను ఫామ్‌లో ఉంటే నాన్‌స్ట్రైక్‌లో ఉంటాననేవాడు. ఫామ్‌లో లేకున్నా నన్నే స్ట్రైకింగ్ తీసుకోమనేవాడు. తన మీద ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని చెప్పేవాడు. మొత్తంగా.. ఫామ్‌లో ఉన్నా లేకపోయినా అతని వద్ద సమాధానం మాత్రం ఉండేది.

 పరుగెత్తి నిలబడాలి..

పరుగెత్తి నిలబడాలి..

ఇక సచిన్ కంటే ముందు మైదానంలోకి వేగంగా నడిస్తే తప్పా నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉండలేం. ఎందుకంటే అప్పటికే సచిన్ టీవీ కెమెరాల్లో కనిపించి.. తప్పకుండా ఆడే పరిస్థితి ఏర్పడేది. అలా ఒకటి రెండు సార్లు కూడా జరిగింది. అతని కన్నా ముందే వెళ్లి నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో నేను నిలబడ్డా' అని గంగూలీ గుర్తుచేసుకున్నాడు.

సూపర్ జోడీ..

సూపర్ జోడీ..

సచిన్-గంగూలీ ఓపెనింగ్ ధ్వయం భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలందించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే 9వ విజయవంతమైన జోడీగా గుర్తింపుపొంది. 71 మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ ప్రారంభించిన సచిన్-దాదా జోడీ..61.36 సగటుతో 4173 పరుగులు చేసింది. ఇందులో 12 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక ఈ జోడీ ఎంతటి భీకర బౌలర్లనైనా చీల్చిచిండాడింది.

311 వన్డేలు, 113 టెస్టులు..

311 వన్డేలు, 113 టెస్టులు..

ప్రస్తుతం బీసీసీఐ బాస్‌గా భారత క్రికెట్‌ను నడిపిస్తున్న సౌరవ్ గంగూలీ.. తన కెరీర్‌లో మొత్తం 311 వన్డేలు ఆడి 11,363 పరుగులు చేయగా.. 113 టెస్టుల్లో 7,212 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్‌గా భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కుని సమస్యల్లో ఉన్న జట్టుని తన అద్భుత నాయకత్వంతో మళ్లీ గాడిలో పెట్టాడు.

అవకాశం వస్తే ఆ ముగ్గురితో సహా ధోనీని తీసుకుంటా: సౌరవ్ గంగూలీ

Story first published: Monday, July 6, 2020, 15:00 [IST]
Other articles published on Jul 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+