Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నో ఛేంజ్.. షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్: గంగూలీ

Sourav Ganguly confirms IPL 2020 is on despite growing coronavirus threat

ముంబై: కరోనా వైరస్(కోవిడ్-19) వేగంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో భారత క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరడంతో ఐపీఎల్ ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు జంకుతున్నారు. ఇప్పటికే న్యూజిలాండ్ ఆటగాళ్లు పునరాలోచనలు పడ్డట్టు ప్రచారం జరుగుతుంది.

పరిస్థితి ఇలానే ఉంటే మైదనాలకు రావడానికి ప్రేక్షకులు కూడా భయపడతారు. ఐపీఎల్ మ్యాచ్‌ల వల్ల ఈ వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఈ క్యాష్ రిచ్ లీగ్ రద్దవ్వడానికే ఎక్కువ ఆస్కారం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నారు. ఇప్పటికే ఈ మహమ్మారి దెబ్బకు పెద్ద పెద్ద టోర్నీలు రద్దయ్యాయి. టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై కూడా అనుమానాలు నెలకొన్నాయి.

కరోనాను ఎదుర్కొంటాం..

కరోనాను ఎదుర్కొంటాం..

అయితే మరోవైపు ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, ఈ క్యాష్‌రిచ్‌లీగ్‌కు కరోనాతో వచ్చే ముప్పే లేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్‌కు రంగం సిద్ధమైందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే స్వయంగా ప్రకటించాడు. కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా తీసుకోవాల్సిన అన్ని రక్షణ చర్యలను బీసీసీఐ తీసుకుంటుందని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోకు తెలిపాడు.

‘ఐపీఎల్ 2020 సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా బీసీసీఐ తీసుకోవాల్సిన అన్ని రక్షణ చర్యలు తీసుకుంటుంది.'అని ఈ మహమ్మారిని బోర్డు ఎలా ఎదుర్కోబోతుందనే ప్రశ్నకు దాదా సమాధానంగా చెప్పుకొచ్చాడు.

ఆడకుండా ఫైనల్ చేరడం కంటే.. ఓడిపోవడమే మంచిది: సౌతాఫ్రికా కెప్టెన్

 నో షేక్ హ్యాండ్.. నో సెల్ఫీస్..

నో షేక్ హ్యాండ్.. నో సెల్ఫీస్..

ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా బీసీసీఐ.. ‘నో షేక్ హ్యాండ్.. నో సెల్ఫీస్'అనే పద్దతిని కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం.. అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడం వాటిని రద్దు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. అలాగే మ్యాచ్‌లు సందర్భంగా ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు ఎలా మెదులుకోవాలనే విషయంలో ఓ గైడ్‌లైన్స్ రూపొందించనుందని తెలుస్తోంది. ఇక డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నైసూపర్ కింగ్స్ మధ్య వాంఖడే మైదానం వేదికగా మార్చి 29న జరిగే తొలి మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది.

ఐసీసీ లీగ్ మ్యాచ్‌లు వాయిదా

ఐసీసీ లీగ్ మ్యాచ్‌లు వాయిదా

కోవిడ్ వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మలేషియా వేదికగా జరగాల్సిన సీడబ్ల్యూసి ఛాలెంజ్ లీగ్ మ్యాచ్‌లను వాయిదా వేసింది. కెనడా, డెన్‌మార్క్, మలేషియా, కటార్, సింగపూర్, వనౌటు పాల్గొనల్సిన ఈ 11 రోజుల ఈవెంట్‌ని ఈ ఏడాదిలో కొన్ని నెలల తర్వాత నిర్వహిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. దీంతో పాటు థాయ్‌లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే మధ్య జరగాల్సిన టీ-20 సిరీస్‌ను కూడా రద్దు చేశారు. అంతేకాక.. నేపాల్ ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్‌ని కూడా రద్దు అయింది.

Story first published: Friday, March 6, 2020, 12:07 [IST]
Other articles published on Mar 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+