For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీజేపీలోకి సౌరవ్ గంగూలీ.? అందుకేనా అలా చేసింది?

Is BCCI President Sourav Ganguly Joining BJP?
IPL 2020 Sponsor Dream 11 Have Chinese Connections - CAIT

కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ బీజేపీలో చేరబోతున్నాడా? పశ్చిమబెంగాల్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గంగూలీ ఆధ్వర్యంలో బీజేపీ బరిలోకి దిగనుందా? అంటే అవుననే సమాధానమినిపిస్తోంది. తాజాగా దాదా తీసుకున్న ఓ నిర్ణయం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.. ఇంతకీ విషయమేమిటంటే.. సౌరవ్ గంగూలీ సారథ్యంలోని ట్రస్ట్‌ కోల్‌కతాలో ఓ పాఠశాల నెలకొల్పాలనుకుంది. అందుకు ఈశాన్య కోల్‌కతాలోని అతి ఖరీదైన న్యూటౌన్‌ ప్రాంతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సర్కారు రెండెకరాలు కేటాయించింది.

స్థలం వాపస్..

స్థలం వాపస్..

అయితే ఆ స్థలం న్యాయవివాదంలో చిక్కుకోవడంతో గంగూలీ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో ఇటీవల సీఎం మమతా బెనర్జీని కలుసుకున్న గంగూలీ ఆ రెండెకరాల స్థలాన్ని వాపస్‌ ఇస్తున్నట్టు ఆమెకు చెప్పాడట. ‘స్థలం వివాదంలో ఉండడంతో దాదా అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ఎడ్యుకేషనల్‌, వెల్ఫేర్‌ సొసైటీ దానిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చివేస్తున్నట్టు లేఖ రాసింది. ఆ లేఖకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది'అని పశ్చిమ బెంగాల్‌ గృహ మౌలిక సదుపాయల కల్పన అభివృద్ధి సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు.

బీజేపీ సీఎం అభ్యర్థిగా..

బీజేపీ సీఎం అభ్యర్థిగా..

ఇక వ‌చ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అక్క‌డ అనేక రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు చోటు చేసుకుంటున్నాయి. బ‌లంగా ఉన్న తృణ‌మూల్ అధినేత్రి, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి ధీటుగా ప్ర‌జ‌ల్లో ఛ‌రిష్మా ఉన్న నేత కోసం బీజేపీ తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే గంగూలీ బీజేపీలో చేరుతున్నాడనే ప్రచారం ఇప్పుడు ప‌శ్చిమ బెంగాల్ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. అతనే బీజేపీ సీఎం అభ్యర్థి అన్న ప్రచారం ఊపందుకుంది.

బీజేపీ మద్దతుతోనే బీసీసీఐ పదవి..

బీజేపీ మద్దతుతోనే బీసీసీఐ పదవి..

గంగూలీ ముందు నుంచి కూడా బీజేపీతో స‌న్నిహితంగానే ఉంటూ వ‌స్తున్నారు. 2019లో ఆయ‌న బీసీసీఐ అధ్య‌క్షుడు అయ్యేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు మ‌రో ఇద్ద‌రు కేంద్ర మంత్రులు సాయం చేశార‌నే వార్తలు వినిపించాయి. ఇక కొద్ది నెల‌ల నుంచే వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున ప్ర‌చారానికి గంగూలీ వ‌స్తాడ‌న్న ఊహాగానాలు వ‌స్తున్నాయి. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని గంగూలీ గతంలో ఖండిచాడు. తాను మంచి క్రికెట‌ర్‌గా ఆద‌ర‌ణ పొందాన‌ని.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌న లేద‌ని స్పష్టం చేశాడు. కానీ తాజా ప‌రిణామాల‌తో గంగూలీ పేరు బెంగాల్ రాజ‌కీయాల్లో బాగా వినిపిస్తోంది.

ముగిసిన బీసీసీఐ పదవి కాలం..

ముగిసిన బీసీసీఐ పదవి కాలం..

బీసీసీఐ నూతన రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా పదవీ కాలం ఇప్పటికే పూర్తయింది. దీంతో లోధా కమిటీ సూచించిన మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్‌పై సవరణ కోరుతూ బోర్డు.. కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీం నుంచి తీర్పు వచ్చే దాకా గంగూలీ, జైషా బోర్డు పదవుల్లో కొనసాగనున్నారు. బీసీసీఐ పదవి విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తామని సౌరవ్ గంగూలీ అన్నాడు. పదవి నుంచి తప్పుకోమని ధర్మాసనం ఆదేశిస్తే.. తనతో పాటు సెక్రటరీ జైషా కూడా బోర్డుకు దూరంగా ఉంటాడని దాదా స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలు కూడా అతని రాజకీయ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి.

CPL 2020: సిక్సర్లతో చెలరేగిన పోలార్డ్, బ్రేవో.. నైట్‌రైడర్స్ తీన్మార్!

Story first published: Monday, August 24, 2020, 11:04 [IST]
Other articles published on Aug 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+