Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్మృతి మంధాన సరికొత్త రికార్డు!

అంతర్జాతీయ క్రికెట్ మండలి మహిళల విభాగంలో తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన నంబర్ వన్ స్థానాన్ని విజయవంతంగా నిలబెట్టుకుని ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. స్మృతి మంధానతో పాటు ఇతర భారత క్రికెటర్లు దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో మెరుగైన స్థానాల్లో నిలిచారు.

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి: టీమిండియా మాజీ కోచ్

790 పాయింట్లతో అగ్రస్థానంలో స్మృతి మంధాన
ఐసీసీ వన్డే బ్యాటింగ్ విభాగంలో భారత కెప్టెన్ స్మృతి మంధాన 790 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ 782 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. వెస్టిండీస్ ఆల్ రౌండర్ హేలీ మాథ్యూస్, ఆస్ట్రేలియా ప్లేయర్ బెత్ మూనీ చెరో 731 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. భారత సీనియర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ 652 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచి టాప్ 10లో చోటు సంపాదించుకుంది.

Smriti Mandhana Retains Top Spot in ICC Womens ODI Rankings Deepti Sharma and Harmanpreet Kaur Shine

ఆల్‌రౌండర్, బౌలింగ్ విభాగాల్లో దీప్తి శర్మ ప్రదర్శన
భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం తగ్గి 9వ స్థానానికి పడిపోయినప్పటికీ.. టీ20 ఆల్ రౌండర్ల జాబితాలో 4వ స్థానంలో, వన్డే ఆల్‌రౌండర్లలో 6వ స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది. టీ20 బౌలింగ్ విభాగంలో శ్రీచరణి, దీప్తి శర్మ మొదటి రెండు స్థానాల్లో భారత్ ఆధిపత్యాన్ని నిలబెట్టారు.

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

Also Read

IND vs WI: పోలీస్ నిఘాలో ఉప్పల్ మ్యాచ్.. మఫ్టీలో షీ టీమ్స్: సీపీ సుమతి

టీ20 ర్యాంకింగ్స్‌లోనూ భారత్ హవా
మహిళల టీ20 బ్యాటింగ్ టాప్ 10 జాబితాలో ముగ్గురు భారత క్రీడాకారిణులు చోటు దక్కించుకున్నారు. షఫాలీ వర్మ 759 పాయింట్లతో 4వ స్థానంలో, స్మృతి మంధాన 754 పాయింట్లతో 5వ స్థానంలో, హర్మన్‌ప్రీత్ కౌర్ 10వ స్థానంలో ఉన్నారు. మొత్తంగా ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత మహిళల జట్టు వన్డే, టీ20 ఫార్మాట్లు రెండింటిలోనూ 3వ స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Tuesday, October 13, 2026, 18:38 [IST]
Other articles published on Oct 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+