హర్మన్‌ప్రీత్ కౌర్‌కు చెక్? భారత కెప్టెన్సీపై స్మృతి మంధాన ఓపెన్ టాక్!
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన టీమ్ సారథ్య బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించి తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్థానంలో భవిష్యత్తులో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్మృతి మంధాన స్పష్టం చేశారు. ప్రస్తుతం జట్టు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్మృతి మంధాన.. గత కొన్నేళ్లుగా హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో జట్టు కోసం కీలక పాత్ర పోషిస్తున్నారు. అనేక సందర్భాల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక కెప్టెన్ గా భారత జట్టును విజయ పథంలో నడిపించిన అనుభవం స్మృతి మంధానకు ఉంది.
భారత మహిళా జట్టు కెప్టెన్సీ మార్పునకు సంబంధించి వస్తున్న ఊహాగానాలపై స్మృతి మంధానకు ఓ ప్రశ్న ఎదురైంది. ఒకవేళ భవిష్యత్తులో భారత జట్టు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా అని అడగగా.. అవును.. తప్పకుండా నేను దానికి సిద్ధంగా ఉన్నానని స్మృతి మంధాన ఎంతో నమ్మకంతో సమాధానమిచ్చింది. ఎంతో ఒత్తిడికో కూడిన మ్యాచుల్లో కూడా కూల్ గా నిర్ణయాలు తీసుకుని జట్టును నడిపించిన అనుభవం కూడా స్మృతి మంధానకు ఉంది. ఆ టాలెంటే స్మృతి మంధానను కెప్టెన్ రేసులో నిలబెట్టింది.

స్మృతి మంధాన కెప్టెన్సీ రికార్డు
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి స్మృతి మంధాన బలమైన పోటీదారుగా నిలిచింది. ఆమె 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు, నాలుగు వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించి, మొత్తం 15 మ్యాచ్‌లలో జట్టును విజయపథంలో నడిపించింది. ఆమె నాయకత్వంలో ఆడిన నాలుగు వన్డేలలోనూ భారత జట్టు అజేయంగా నిలిచింది.
క్రికెట్ మక్కాగా పిలువబడే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం స్మృతి మంధాన ఈ ప్రకటన చేశారు. లార్డ్స్‌లో జరిగిన చారిత్రాత్మక మహిళల టెస్ట్ మ్యాచ్‌లో, భారత జట్టు ఇంగ్లాండ్‌పై 270 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 341 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత భారత బౌలర్లు ఇంగ్లండ్‌ను రెండు ఇన్నింగ్స్‌లలోనూ వరుసగా 170, 186 పరుగులకే ఆలౌట్ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన కీలక పాత్ర పోషించింది, తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగులు చేసి, ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన అర్ధశతకం సాధించింది. స్మృతి మంధాన మాట్లాడుతూ, "లార్డ్స్‌లో జరిగిన తొలి మహిళల టెస్ట్ మ్యాచ్‌లో భాగం కావడం, అంతకంటే ముఖ్యంగా దానిని గెలవడం ఒక అద్భుతమైన అనుభవం. భారత చారిత్రాత్మక విజయానికి దోహదపడటం చాలా ప్రత్యేకమైనది. చిన్నప్పుడు మేమందరం టెస్ట్ క్రికెట్ ఆడాలని కలలు కనేవాళ్ళం, కాబట్టి లార్డ్స్‌లో దానిని సాధించడం ఈ క్షణాన్ని మరింత చిరస్మరణీయం చేసింది." అని స్మృతి పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

