Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: కోహ్లీపై వేటు.. ఇంగ్లండ్‌తో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. కార్డిఫ్ వేదికగా గురువారం జరిగే రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇది కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. తద్వారా బెంచ్ బలాన్ని పరీక్షించాలనుకుంటుంది.

IND vs ENG: ఆ ఘోర తప్పిదమే మా ఓటమిని శాసించింది: హ్యారీ బ్రూక్

IND vs ENG: ఆ ఘోర తప్పిదమే మా ఓటమిని శాసించింది: హ్యారీ బ్రూక్

రెండో వన్డేలో భారత్ విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ మైదానం పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ స్పిన్నర్ల ప్రభావం చాలా తక్కువ. అయితే తొలి వన్డే తరహాలోనే టీమిండియా ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు నలుగురు పేసర్లతో బరిలోకి దిగనుంది.

India Playing XI For 2nd ODI vs England Will Ishan Kishan Replace Virat Kohli

కోహ్లీపై వేటు..?

తొలి వన్డే విజయానంతరం ప్రయోగాలు చేస్తామని శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ మైదానాలు ప్రపంచకప్ జరిగే సౌతాఫ్రికాకు దగ్గరగా ఉంటాయని, జట్టు బెంచ్‌ను పరీక్షిస్తామని చెప్పాడు. ఈ క్రమంలో ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించాలనుకుంటే బౌలింగ్ విభాగంలో మార్పులు జరగవచ్చు. అలాగే బ్యాటింగ్ విభాగంలో ఇషాన్ కిషన్ ఆడించాలనుకుంటే ఒక బ్యాటర్‌ను పక్కనపెట్టాల్సి ఉంటుంది. విరాట్ కోహ్లీని తప్పించే సాహసం టీమిండియా చేయకపోవచ్చు.

IND vs ENG: బూమ్ బూమ్ బుమ్రా.. 969 రోజుల తర్వాత రికార్డుల మోత!

IND vs ENG: బూమ్ బూమ్ బుమ్రా.. 969 రోజుల తర్వాత రికార్డుల మోత!

మరోసారి ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆడనుండగా.. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. తొలి వన్డేలో రోహిత్, కోహ్లీ, రాహుల్ తీవ్రంగా నిరాశపర్చారు. ఈ ముగ్గురు రెండో వన్డేలో సత్తా చాటాల్సి ఉంది. సుందర్, అక్షర్ పటేల్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. శివమ్ దూబేకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా బౌలింగ్‌తో మెప్పించాడు. గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ బుమ్రాలు ఆకట్టుకున్నారు. రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగిస్తే భారత్ ఈజీగా విజయం సాధిస్తుంది.

ఇంగ్లండ్‌తో రెండో వన్డేకు భారత తుది జట్టు(అంచనా):

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్(కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, గుర్నూర్ బ్రార్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్(కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, గుర్నూర్ బ్రార్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, ఇషాన్ కిషన్, రవిబిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్

Story first published: Wednesday, July 15, 2026, 13:05 [IST]
Other articles published on Jul 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+