India vs England రెండో వన్డే టైమింగ్స్‌లో మార్పు.. ఎందుకంటే..?
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. కార్డిఫ్ వేదికగా గురువారం జరిగే రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇది కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. తద్వారా ఆఖరి మ్యాచ్‌లో బెంచ్ బలాన్ని పరీక్షించాలనుకుంటుంది.
రెండో వన్డేలో భారత్ విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ మైదానం పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ స్పిన్నర్ల ప్రభావం చాలా తక్కువ. అయితే తొలి వన్డే తరహాలోనే టీమిండియా ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు నలుగురు పేసర్లతో బరిలోకి దిగనుంది.
మ్యాచ్ టైమింగ్స్‌లో మార్పు..
అయితే ఎడ్స్‌బాస్టన్ వేదికగా జరిగే తొలి వన్డేకు ఈ మ్యాచ్ టైమింగ్స్‌లో తేడా ఉంది. భారత కాలమానం ప్రకారం తొలి వన్డే సాయంత్రం 3.30 గంటలకు ప్రారంభం కాగా.. రెండో వన్డే రెండు గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానుంది. దాంతో ఈ మ్యాచ్ ఫలితం శుక్రవారం అర్దరాత్రి తేలనుంది.
మ్యాచ్ మొత్తం చూడాలంటే అభిమానులు జాగారం చేయాల్సిందే. వన్డే మ్యాచ్ పూర్తవ్వడానికి దాదాపు 9-10 గంటల సమయం పడుతుంది. నిబంధనల ప్రకారం గంటకు 12 ఓవర్ల చొప్పున వేయాలి. ఈ లెక్కన అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ మ్యాచ్ జరగనుంది.

ఈ మార్పు ఎందుకంటే..?
రెండో వన్డే డేనైట్ ఫార్మాట్‌లో జరుగుతుండటంతో మ్యాచ్ టైమింగ్స్‌లో మార్పు వచ్చింది. ఇంగ్లండ్ టైమింగ్ ప్రకారం తొలి వన్డే డే ఫార్మాట్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం 3.30 గంటలకు మొదలైంది. రెండో వన్డే మాత్రం ఇంగ్లండ్ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలవుతుంది.
దాంతో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఇంగ్లండ్‌లో జూలై నెలలో వేసవి కాలం కారణంగా రాత్రి 9:00 - 9:30 గంటల వరకు కూడా సహజమైన సూర్యకాంతి ఉంటుంది. అందుకే డే మ్యాచ్‌లను త్వరగా ముగించడానికి ఉదయమే ప్రారంభిస్తారు.
ఎలా చూడాలంటే..?
ఈ మూడు వన్డేల సిరీస్‌కు సోనీ నెట్ వర్క్, జియో హాట్‌స్టార్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్నాయి. టీవీలో సోనీ నెట్ వర్క్‌కు చెందిన ఛానెల్స్‌లో నచ్చిన భాషలో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించవచ్చు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్‌ను ఎంచుకోవాలి. జియో హాట్‌స్టార్‌లో కూడా నచ్చిన భాషలో మ్యాచ్‌లను చూడవచ్చు. అయితే ఈ రెండు వేదికల్లో మ్యాచ్‌లు చూడాలంటే రుసుము చెల్లించుకోవాల్సిందే. ప్రత్యేక రిఛార్జ్ ప్లాన్స్‌తో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ అయితే ఫ్రీగా పొందవచ్చు.
ఇరు జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్(కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, గుర్నూర్ బ్రార్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, ఇషాన్ కిషన్, రవిబిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్
ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, జాకోబ్ బెతెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, సామ్ కరణ్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సకీబ్ మహ్మూద్, ఆదిల్ రషీద్, రెహాన్ అహ్మద్, జోరూట్, జోష్ టంగ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

