For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టిమ్ పైన్ ఔట్‌పై దుమారం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆసీస్ ఆటగాళ్ల అసహనం.. క్లారిటీ ఇచ్చిన దిగ్గజ అంపైర్!

Simon Taufel explains the umpiring protocols over Controversy around Tim Paine’s dismissal at MCG

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. అడిలైడ్ విజయాన్ని మరిపిస్తూ దెబ్బ తిన్న పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో ఆతిథ్య జట్టుకు చూపించింది. మ్యాచ్ ఆద్యాంతం ఆధిపత్యం కనబర్చిన భారత్ 8 వికెట్లతో సునాయస విజయాన్నందుకుంది. అయితే ఈ మ్యాచ్ ముగిసినా థర్డ్ అంపైర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమయ్యాయి.

పైన్‌ ఔట్‌పై వివాదం

పైన్‌ ఔట్‌పై వివాదం

తొలి ఇన్నింగ్స్‌లో రనౌట్‌ విషయంలో బ్యాట్‌ లైన్‌పైనే కనిపిస్తున్నా ‘బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌'తో బయటపడిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ వివాదానికి కేంద్రంగా నిలిచాడు. జడేజా వేసిన బంతిని కట్‌ చేయడానికి ప్రయత్నించగా అది బ్యాట్‌ అంచును తాకుతూ కీపర్‌ చేతుల్లో పడింది. భారత్‌ అప్పీల్‌కు అంపైర్‌ స్పందించకపోవడంతో రహానే రివ్యూ కోరాడు. మూడో అంపైర్‌ పాల్‌ విల్సన్‌ పదే పదే రీప్లేలు చూడాల్సి వచ్చింది.

స్నికో‌ మీటర్‌లో..

స్నికో‌ మీటర్‌లో..

‘హాట్‌స్పాట్‌'లో బంతి బ్యాట్‌కు తగిలినట్లుగా ఎలాంటి ముద్ర కనిపించలేదు. అయితే తర్వాత ‘స్నికో'లో మాత్రం బంతి బ్యాట్‌ను దాటుతున్న సమయంలో మీటర్‌లో మార్పు స్పష్టంగా కనిపించింది. దాంతో అంపైర్‌ అవుట్‌గా ప్రకటించగా, తీవ్ర అసంతృప్తితో పైన్‌ మైదానం వీడాడు. ఆట ముగిసిన అనంతరం ఆసీస్‌ ఆటగాడు వేడ్‌ ప్రశ్నించాడు.

డీఆర్‌ఎస్‌ నిర్ణయాల్లో నిలకడ లేదని అతను విమర్శించాడు. ‘రెండో రోజు తొలి బంతి ఆడిన పుజారాకు కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. స్నికోలో ఇదే తరహాలో కనిపించింది. కానీ అతడిని నాటౌట్‌గా ప్రకటించి పైన్‌కు మాత్రం అవుట్‌ ఇచ్చారు. అవుటైనా, నాటౌట్‌ అయినా అంపైర్ల నిర్ణయాలు ఒకేలా ఉండాలి'అని వేడ్‌ అసహనం వ్యక్తం చేశాడు.

సైమన టఫెల్ క్లారిటీ..

ఇక ఐదుసార్లు ఐసీసీ ‘అంపైర్‌ ఆఫ్‌ ద ఇయర్‌'గా నిలిచిన దిగ్గజ అంపైర్‌ సైమన్‌ టఫెల్‌ దీనిపై మరింత స్పష్టతనిచ్చారు. పైన్‌ అవుట్‌ విషయంలో మూడో అంపైర్‌ సరిగ్గానే వ్యవహరించారన్నారు. ‘నిబంధనల ప్రకారం బంతి దిశ మార్చుకుందా అనేది ముందుగా అంపైర్‌ చూస్తారు. దీనిపై స్పష్టత లేకపోతే హాట్‌ స్పాట్‌ను ఆశ్రయిస్తారు. అప్పటికీ తేలకపోతే ప్రొటోకాల్‌ ప్రకారం రియల్‌ టైమ్‌ స్నికోను పరిశీలించాలి. బంతి బ్యాట్‌ను తాకే సమయంలో మీటర్‌లో అసాధారణ మార్పు కనిపిస్తే దానినే తుది నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది.

హాట్ స్పాట్‌లో కనిపించకపోతే..

హాట్ స్పాట్‌లో కనిపించకపోతే..

సాధారణంగా స్నికోలో చూసినప్పుడు బంతి బ్యాట్‌ను దాటిన తర్వాత శబ్దం వినిపిస్తుంది. అప్పుడే మీటర్‌లో కదలిక వస్తుంది. ఇదేమీ తప్పు కాదు. శబ్దంకంటే కాంతి వేగం ఎక్కువ కావడమే దీనికి కారణం. ఐసీసీ రూల్స్‌ ప్రకారం హాట్‌ స్పాట్‌లో ముద్ర కనిపించకపోతేనే స్నికో వరకు వెళ్లాలి. అంతకుముందు జో బర్న్స్‌ అప్పీల్‌ చేసినప్పుడు బ్యాట్‌కు బంతి తగిలిన విషయం హాట్‌స్పాట్‌లోనే స్పష్టంగా తేలిపోయింది కాబట్టి స్నికో చూడాల్సిన అవసరమే రాలేదు' అని టఫెల్‌ వివరించారు.

India vs Australia: రహానే నువ్వు సూపరబ్బా.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇదో అద్భుత విజయం!

Story first published: Tuesday, December 29, 2020, 15:42 [IST]
Other articles published on Dec 29, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+