Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: రహానే నువ్వు సూపరబ్బా.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇదో అద్భుత విజయం!

India Won The Test Match in Australia Without Virat Kohli, Rohit Sharma, Mohammed Shami

మెల్‌బోర్న్: విరాట్ కోహ్లీ లేడు.. మహ్మద్ షమీ లేడు.. రోహిత్ శర్మ లేడు.. ఇషాంత్ శర్మ లేడు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఉమేశ్ యాదవ్ కూడా గాయంతో దూరమయ్యాడు.! శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్‌ ఇద్దరూ అరంగేట్ర ఆటగాళ్లే.! పైగా టాస్ కూడా కలిసి రాలేదు.! కానీ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై భారత్ ఓడించింది. దెబ్బ తిన్న పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో రుచి చూపించింది. అడిలైడ్ పరాజయం తర్వాత ఎవరూ ఏమాత్రం ఊహించని విజయాన్నందుకుంది. నిజంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదో అద్భుత విజయం.! ఇలా అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.!

రహానే నువ్వు సూపరబ్బా..

అయితే ఈ విజయం క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలంటే అది టీమిండియా తాత్కలిక సారథి అజింక్యా రహానేకే ఇవ్వాలి. ఎందుకంటే చిత్తుగా ఓడి ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన జట్టులో కెప్టెన్‌గా అతను రగిల్చిన ఉత్సాహం చెప్పలేనిది. మాటల్లో వర్ణించలేనిది. పైగా మైదానంలో అతను తీసుకున్న నిర్ణయాలు.. ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్స్ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తలిపించాయి. పరిస్థితులకు తగ్గట్లు బౌలర్లను మార్చడం.. ఫీల్డింగ్ సెట్ చేయడం.. డీఆర్‌ఎస్ నిర్ణయాలు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకునేలా చేశాయి.

నిర్ణయాలు అద్బుతం..

నిర్ణయాలు అద్బుతం..

రవీంద్ర జడేజా బౌలింగ్‌లో టీమ్ పైన్ ఔటైన విధానమే అతని కెప్టెన్సీ ప్రతిభను తెలియజేస్తుంది. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించినా.. కీపర్, బౌలర్ సందేహంగా ఉన్న.. స్లిప్‌లో ఉన్న రహానే మాత్రం ఆత్మవిశ్వాసంతో రివ్యూ తీసుకోని ఫలితాన్ని రాబట్టడం అందర్ని ఆశ్చర్యపరించింది. ఇలాంటి నిర్ణయాలే భారత్‌ను గెలిచేలా చేశాయి. కెప్టెన్‌గా 100కు 100 మార్క్‌లు తెచ్చుకున్న రహానే.. బ్యాట్స్‌మన్‌గా కూడా తన పాత్ర పోషించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అభిమానులు రహానేపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇదో గొప్ప విజయం..

ఇదో గొప్ప విజయం..

ప్రపంచ క్రికెట్‌లో ఇదో గోప్ప విజయమని హెడ్ కోచ్ రవిశాస్త్రి పేర్కొనడం జట్టుపై ఎంత ఒత్తిడి నెలకుందో అనే విషయాన్ని తెలియజేస్తుంది. అడిలైడ్ పరాజయం తర్వాత ఆటగాళ్లు ఎంత మానసిక వేదనను అనుభవించారో.. ఈ ఫలితం తర్వాత వారు చేసుకున్న సంబరాలతో స్పష్టం అవుతోంది. ఫస్ట్ మ్యాచ్ ఓటమి.. కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీ.. మహ్మద్ షమీ గాయం నేపథ్యంలో భారత్ గెలవడం దేవుడెరుగు.. కనీసం గట్టి పోటీనైనా ఇస్తుందా? అనే సందేహం నెలకొంది.

వాస్తవానికి తొలి మ్యాచ్‌ కూడా భారత్ సునాయసంగా గెలవాల్సింది. కానీ ఆటగాళ్లలో ఆ కసి లోపించడంతో రెండు రోజుల పాటు ఆధిపత్యం కనబర్చిన జట్టు ఒక్క సెషన్‌లో విఫలమై మూల్యం చెల్లించుకుంది. కానీ ఈ మ్యాచ్‌లో ఆ తప్పిదం మరోసారి రిపీట్ కాకుండా జాగ్రత్త పడింది. ఇదే జోరును ఇతర మ్యాచ్‌ల్లో కూడా కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు.

India vs Australia: 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా చెత్త రికార్డు!

Story first published: Tuesday, December 29, 2020, 14:27 [IST]
Other articles published on Dec 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+