అందుకే నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టాం: శుభ్‌మన్ గిల్
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. తుది జట్టులో ఒక మార్పు చేశామని చెప్పిన గిల్.. ఆకిబ్ నబీ కోసం నితీష్ రెడ్డిని పక్కన పెట్టినట్లు వెల్లడించాడు.
పేస్ బౌలింగ్ అనుకూలంగా..
'పిచ్‌పై కాస్త గడ్డి ఎక్కువగా ఉంది. అక్కడక్కడా ప్యాచీగా ఉంది. కాబట్టి పేస్ బౌలర్లకు అడ్వాంటేజ్ లభించనుంది. దాంతోనే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నా. పైగా ఇక్కడ ఉక్కపోత ఎక్కువగా ఉంది. మా పేసర్లకు ఈ కండిషన్స్ మంచి సవాల్ ఎదురవుతోంది. గత మ్యాచ్‌లో మా ప్రదర్శన సంతృప్తిగానే ఉంది. తొలి 20-25 ఓవర్లలో ఒత్తిడికి గురైనప్పటికీ.. మేం పుంజుకున్న తీరు చాలా బాగుంది. వన్డే ఫార్మాట్‌లో ఫీల్డింగ్ తీవ్రతే మ్యాచ్‌ను నిర్దేశిస్తుంది.

ఆకిబ్ నబీ అరంగేట్రం..
గత మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో మేం ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉండాల్సింది. ఈ మ్యాచ్‌లో మెరుగైన ఫీల్డింగ్ చేస్తామని ఆశిస్తున్నా. మా టాపార్డర్ చాలా బలంగా ఉంది. గత మ్యాచ్‌లో అందరూ మంచి ఫామ్ కనబర్చారు. రోహిత్ భాయ్ కూడా మంచి టచ్‌లో కనిపించారు. కాబట్టి ఇది మాకు మరొక మంచి మ్యాచ్ అవుతుందని ఆశిస్తున్నాను. తుది జట్టులో మేం ఒక మార్పు చేశాం. నితీష్ రెడ్డి స్థానంలో ఆకిబ్ నబీ అరంగేట్రం చేస్తున్నాడు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
బౌలింగ్ ఎంచుకునేవాళ్లం..
మరోవైపు టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోవాలనుకున్నామని వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ తెలిపాడు. 'టాస్ గెలిస్తే మేం కూడా బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నాం. ఏది ఏమైనా భారీ లక్ష్యాన్ని నమోదు చేసి.. డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. తొలి మ్యాచ్‌లో మేం చేయాల్సిన పరుగుల కంటే తక్కువ చేశాం. మేం మెరుగయ్యే విషయాలను గుర్తించి, వీలైనంత త్వరగా వాటిని సరిదిద్దుకోవడానికి మార్గాలు వెతకాల్సిందే.
మ్యాచ్‌ల మధ్య ఎక్కువ సమయం లేదు. మైదానంలోకి దిగిన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తూ గెలవాల్సిందే. పిచ్ చూడటానికి బాగుంది. ఆరంభంలో బంతి కాస్త స్వింగ్ అవ్వొచ్చు. పిచ్‌కు తగ్గట్లు లక్ష్యాన్ని నమోదు చేయాలి. మా తుది జట్టులో నాలుగు మార్పులు చేశాం.'అని షై హోప్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
వెస్టిండీస్: జాన్ క్యాంప్‌బెల్, కీసీ కార్టీ, షై హోప్ (వికెట్ కీపర్/కెప్టెన్), అమీర్ జంగూ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ ఛేజ్, కీమో పాల్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్, విటెల్ లావ్స్
ఇండియా: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కె.ఎల్. రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, రవీంద్ర జడేజా, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


