Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్వారంటైన్‌ను ఎంజాయ్ చేస్తున్న శ్రేయస్, ఇర్ఫాన్.. ఇంతకీ ఏం చేశారంటే?

Shreyas Iyer and Irfan Pathan enjoying quarantine

హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని టోర్నీలు రద్దయ్యాయి. ఆఖరి ఒలింపిక్స్ కూడా వచ్చే ఏడాదికి వాయిదాపడ్డాయి. ఇక వాయిదా పడ్డా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది.

ఈ గత్తర లేవకుంటే..

ఈ గత్తర లేవకుంటే..

వాస్తవానికి ఈ కరోనా గత్తరనే లేవకుంటే.. ఈ పాటికి ఈ క్యాచ్ రిచ్ లీగ్ అభిమానులకు కావాల్సిన మజానిచ్చేది. ప్రేక్షకులతో మైదానాలు కలకలలాడేవి. సిక్సర్ల మోతతో బ్యాట్స్‌మన్.. వికెట్లతో బౌలర్లు.. అద్భుతమైన విన్యాసలతో ఫీల్డర్లు మైమరిపించేవారు.

కానీ ఏం చేస్తాం.. చైనా లో లేసిన ఈ గత్తర.. ప్రపంచాన్నే వణికిస్తోంది. ఇంటి నుంచి కాలు బయట పెట్టలేని స్థితిని తీసుకొచ్చింది. రోజు రోజుకు ఈ మహమ్మారి బారిన పడిన బాధితుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో పగలు పప్పు, ఉప్పు కోసం.. రాత్రిళ్లు మందుల కోసమే బయటకు వచ్చే పరిస్థితి నెలకొంది.

క్వారంటైన్‌‌లో ఆటగాళ్లు..

క్వారంటైన్‌‌లో ఆటగాళ్లు..

ఇక ఆటల్లేక క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్వారంటైన్ సమయాన్ని వారు తెగ ఆస్వాదిస్తున్నారు. కొందరు ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తుండగా.. మరికొందరు ఇంట్లో వాళ్లతో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రేయస్ అయ్యర్ క్వారంటైన్‌ను ఎలా ఆస్వాదిస్తున్నామో? అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

కరోనాపై పోరాటానికి మెస్సీ రూ.8.2 కోట్ల విరాళం!!

పెట్‌డాగ్‌తో శ్రేయస్ ఆట..

టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ అయితే తన పెట్‌డాగ్‌తో ఆడుకుంటున్నాడు.దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. ఈ వీడియోలో ఓ బ్లాంకెట్ ఊపుతూ తాను మాయమయ్యాననే భ్రమను తన పెట్ డాగ్ కల్పించాడు. దీంతో ఆ డాగ్ అయ్యర్ కోసం వెతకడం మొదలుపెట్టింది. దీనికి ‘బ్రెట్టీ(పెట్ డాగ్ ముద్దు పేరు) ఇక్కడా.. బ్రెట్టీ అక్కడా... శ్రేయస్ ఇక్కడా.. శ్రేయస్ ఎక్కడా?'అనే క్యాప్షన్ ఇచ్చాడు.

అన్న కొడుకుతో పఠాన్..

ఇక ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వెటరన్ పేసర్ ఇర్ఫాన్ పఠాన్.. ఈ క్వారంటైన్ సమయంలో తన బాల్యం తిరొగొచ్చిందంటూ ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో తన సోదరుడు యూసఫ్ పఠాన్ కుమారుడు అయాన్ పఠాన్‌ను ఆటపట్టించాడు. చాటుగా ఉండి అయాన్ రాగానే గట్టిగా అరుస్తూ బెదిరించాడు. ప్రస్తుతం ఈ వీడియోలున నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

భారత్@560..

భారత్@560..

ఇక కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పటికే బాధితుల సంఖ్య 560కు చేరగా 11 మంది మృతి చెందారు. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 64 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం 99 కేసులతో పోల్చుకుంటే ఇది కొంత ఉపశమనం ఇచ్చే సంఖ్యనే అయినా.. బుధవారం ఒకరు మరణించారు.

Story first published: Wednesday, March 25, 2020, 13:32 [IST]
Other articles published on Mar 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+