For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనాపై పోరాటానికి మెస్సీ రూ.8.2 కోట్ల విరాళం!!

Lionel Messi donate 1 million euros towards Spains fight against coronavirus

బార్సిలోనా: అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ తన పెద్ద మనసు చాటుకున్నాడు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరాడెందుకు తన వంతు సాయం ప్రకటించాడు. స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా ఎఫ్‌సీ ఫార్వార్డ్ ప్లేయర్ అయిన మెస్సీ.. ఒక మిలియన్ యూరోలను విరాళంగా ప్రకటించాడు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.8.2 కోట్లు. ఈ డొనేషన్‌‌లో సగం బార్సీలోనా ఆసపత్రులకు మిగతాది తన సొంత దేశం అర్జెంటీనాలో ఖర్చు చేయనున్నారని మార్కలోని ఒక నివేదిక తెలిపింది. కరోనావైరస్‌పై పోరాడేందుకు లియోనల్ మెస్సీ ఆసుపత్రులకు విరాళాన్ని ప్రకటించాడని సంబంధిత క్లినిక్స్ తెలిపాయి. 'నీ కమిట్‌మెంట్ మద్దుతగా ధన్యవాదాలు లియో' అంటూ ట్వీట్ చేశాయి.

ఇక మెస్సీతో పాటు మాంచెస్టర్ సిటీ మేనేజర్ పెప్ గార్డియోలా కూడా ఒక మిలియన్ యూరోలను విరాళంగా ప్రకటించాడు. బార్సిలోనాలోని మెడికల్ కాలేజ్‌కు తన సహాయాన్ని అందించాడు. 'కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవటానికి ఆరోగ్య పరికరాల కోసం పెప్ గార్డియోలా ఏంజెల్ సోలర్ డేనియల్ ఫౌండేషన్‌కు ఒక మిలియన్ యూరోలు విరాళం ఇచ్చాడు' అని బాల్సిలోనా మెడికల్ కాలేజ్ ఓ ప్రకటన‌లో తెలిపింది. ఇక కరోనాపై పోరాడేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 10 మిలియన్ల డాలర్లు విరాళంగా అందజేస్తామని ఫిఫా హామీ ఇచ్చింది.

ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం లాక్‌డౌన్ అయింది. ఈ నేపథ్యంలో స్టార్ ప్లేయర్లంతా ముందుకు వచ్చి సాయం ప్రకటిస్తున్నారు. కానీ భారత్‌లో మాత్రం ఇంత వరకు కోట్లు ఆదాయం ఉన్న ఆటగాళ్లు సాయం ప్రకటించలేదు. భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా ఒక్కడే తన ఆరు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇక కోట్ల సంపద కలిగిన క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ధోనీ, సచిన్, సెహ్వాగ్, రాహుల్ ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా విరాళం ప్రకటించలేదు.

Story first published: Wednesday, March 25, 2020, 11:33 [IST]
Other articles published on Mar 25, 2020
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+