Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రీఎంట్రీలో అదరగొట్టిన హైదరాబాద్ అల్లుడు

Shoaib Malik shines on return to help Pakistan take 1-0 lead vs Bangladesh

లాహోర్‌: నిలకడలేమి ఆటతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పునరాగమనంలో సత్తాచాటాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న సిరీస్‌కు అనూహ్యంగా జట్టులోకి వచ్చిన మాలిక్.. అజేయ హాఫ్ సెంచరీతో తనపై సెలెక్టర్లు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు.

పరాజయాలకు ఫుల్ స్టాప్..

పరాజయాలకు ఫుల్ స్టాప్..

ఇక అతని ఇన్నింగ్స్‌తో గతకొంత కాలంగా అంతర్జాతీయ టి20ల్లో ఎదురవుతోన్న వరుస పరాజయాలకు పాకిస్తాన్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. బంగ్లాదేశ్‌తో శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 141 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌ (4 ఫోర్లు, సిక్స్‌‌తో 39), మొహమ్మద్‌ నైమ్‌ (3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీం,షాహిన్ షా, హరీస్ రౌఫ్ తలో వికెట్ తీశారు.

మాలిక్ హాఫ్ సెంచరీ..

మాలిక్ హాఫ్ సెంచరీ..

అనంతరం ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ 19.3ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది.. షోయబ్‌ మాలిక్‌ (45 బంతుల్లో 58 నాటౌట్‌; 5 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీతో రాణించడంతో... పాక్‌ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. బంగ్లా బౌలర్లలో షఫిల్ ఇస్తామ్ రెండు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, అల్-అమిన్ హుస్సెన్, అమినుల్ ఇస్లామ్ తలో వికెట్ దక్కించుకున్నారు. మాలిక్‌ చివరి టి20ని 2019 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో ఆడాడు. ఈ మ్యాచ్‌ ద్వారా పాకిస్తాన్‌ తరఫున హసన్‌ అలీ, హరీస్‌ రౌఫ్‌లు టి20ల్లో అరంగేట్రం చేశారు. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా రెండో టి20 లాహోర్ వేదికగా శనివారం జరుగనుంది.

ఎంత పనిచేస్తివి రాహులా?.. పంత్‌పై పేలుతున్న జోకులు, ఫన్నీ మీమ్స్.!!

సానియా బాటలోనే...

రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే మైదానంలో అడుగుపెట్టిన మాలిక్ సతీమణి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సైతం తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్న విషయం తెలిసిందే. హోబర్ట్ ఇంటర్నేషనల్ డబుల్స్ టైటిల్ గెలిచిన హైదరాబాద్ స్టార్.. సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయింది. గాయంతో టోర్నీ నుంచి తప్పుకుంది. ఇక ఇప్పుడు మాలిక్ కూడా రీ ఎంట్రీలో అదరగొట్టడంతో సానియా-మాలిక్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు దశాబ్దాల ఆటగాడిగా..

నాలుగు దశాబ్దాల ఆటగాడిగా..

1990లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన షోయబ్ మాలిక్, 2000,2010,2020 నాలుగు దశాబ్ధాలు క్రికెట్ ఆడిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ ఘనతను అందుకున్న ఎనిమిదో ప్లేయర్‌గా నిలిచాడు. 1999లో వెస్టిండీస్‌తో మాలిక్ అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. విచిత్రం ఏంటంటే తన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన మిస్బా ఉల్ హక్ ఛీఫ్ సెలెక్టర్‌‌గా ఉండటం.. మాలిక్ ఇంకా ఆడుతుండటం. ఇక మాలిక్ అద్భుత రీఎంట్రీ పై పాక్ అభిమానులు ప్రశంసల జల్లుకురిపిస్తున్నారు.

Story first published: Saturday, January 25, 2020, 9:30 [IST]
Other articles published on Jan 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+