
ఆసియాకప్‌లో తలపడినా..
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో వీరిద్దరూ ఎప్పుడూ తలపడలేదు. అయితే ఆసియా కప్-2010లో భాగంగా భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ జరగ్గా.. ఆ మ్యాచ్‌లో వీరిద్దరూ ఆడారు. కానీ అక్తర్ బౌలింగ్‌ను ఆడే అవకాశం కోహ్లీకి దక్కలేదు. ఆ రోజు విరాట్ 18 బంతుల్లో 27 పరుగులు చేసిన అనంతరం పాక్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అలాగే కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అక్తర్‌కు బౌలింగ్ అవకాశం దక్కలేదు. దీంతో ఈ ఇద్దరూ మ్యాచ్ ఆడినా ఒకరికొకరు తలపడలేదు. అయితే ఓ సందర్భంలో అక్తర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు నాన్‌స్ట్రైయిక్‌లో ఉండటం మంచిదని కోహ్లీ సరదాగా వ్యాఖ్యానించగా.. విరాట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తాను బౌలింగ్ చేయకపోవడం ఎంతో మేలుచేసిందని అక్తర్ బదులిచ్చాడు.

కోహ్లీ- సచిన్‌కు పోలికా..?
అంతకుముందు ఓ లైవ్ సెషన్‌లో కోహ్లీ, సచిన్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని ఓ అభిమాని అక్తర్‌ను ప్రశ్నించగా.. కఠినమైన శకంలో సచిన్ క్రికెట్ ఆడడాని ప్రస్తుత తరంలో అయితే అతను సులువుగా మరో 1.30 లక్షల పరుగులు చేసేవాడని అక్తర్ సమాధానమిచ్చాడు. ‘క్రికెట్‌లోనే అత్యంత కఠినమైన శకంలో మాస్టర్ బ్యాటింగ్ చేశాడు. ఇప్పటి పరిస్థితుల్లో ఆడితే కనుక అతను సులువుగా మరో 1.30 లక్షల పరుగులు చేసేవాడు. కాబట్టి సచిన్-కోహ్లీ మధ్య పోలిక తేవడం సరైంది కాదు.'అని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ స్పష్టం చేశాడు.

పిల్ల లేకుండా పెళ్లి చేసినట్టు ఉంటుంది..
ఇక కరోనా వైరస్ కారణంగా ప్రేక్షకుల్లేకుండా మ్యాచ్‌లు నిర్వహించాలని వినిపిస్తున్న ప్రతిపాదనపై అక్తర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఖాళీ మైదానల్లో మ్యాచ్‌లు జరిపితే పిల్ల లేకుండా పెళ్లి చేసినట్టు ఉంటుందన్నాడు.‘ఖాళీ స్టేడియాల్లో ఆడటం క్రికెట్ బోర్డులకు లాభం చేకూర్చ వచ్చు. కానీ ఈ పద్దతిలో ప్రేక్షకుల ఆదరణను ఆశించిన స్థాయిలో అందుకోలేం. ప్రేక్షకుల్లేకుండా క్రికెట్ ఆడటం వధువు లేని వివాహం లాంటిది. ఆటలు ఆడటానికి ప్రేక్షకులు అవసరం. మరో ఏడాది లోపు కరోనా అంతమై పరిస్థితులు చక్కబడుతాయనుకుంటున్నా'అని అక్తర్ పేర్కొన్నాడు.

120 సెంచరీలు చేసినా..
సందర్భం వచ్చినప్పుడల్లా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించే అక్తర్.. అంతకుముందు కూడా చాలా సార్లు కొనియాడాడు. అతను సచిన్ 100 సెంచరీల రికార్డును సులువుగా బ్రేక్ చేస్తాడని జోస్యం చెప్పాడు. అంతేకాకుండా అతను 120 సెంచరీలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపాడు.
'మోడ్రన్ డే క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా లాంటి దిగ్గజ క్రికెటర్లను మళ్లీ చూడలేం. దీంతో పాటు క్రికెట్ నాణ్యత కూడా బాగా తగ్గింది. అయితే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డుని విరాట్ కోహ్లీ బద్దలు కొట్టగలడు. ప్రస్తుతం కోహ్లీ చాలా దూకుడుగా ఆడుతున్నాడు. 120 సెంచరీలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే.. అతడు కృతనిశ్చయంతో ఆడుతున్నాడు' అని అక్తర్ చెప్పాడు.
టీ20 కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మకు ఇవ్వాలి: మాజీ క్రికెటర్


Click it and Unblock the Notifications
