టీ20 కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మకు ఇవ్వాలి: మాజీ క్రికెటర్

ముంబై: భారత క్రికెట్‌లో స్ప్లిట్ కెప్టెన్సీ(వివిధ ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు) విధానాన్ని అమలు చేయాలని భారత మాజీ పేసర్ అతుల్ వాసన్ సూచించాడు. టీ20 సారథ్య బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పగించి, ప్రస్తుతం మూడుఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విరాట్ కోహ్లీపై పనిభారాన్ని తగ్గించాలన్నాడు. టెస్టులు, వన్డేల్లో కోహ్లీ సారథ్యం వహిస్తాడని, టీ20ల్లో మాత్రం రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

కోహ్లీ సూపర్ కెప్టెనే కానీ..
‘వర్క్‌లోడ్ దృష్ట్యా భారత క్రికెట్‌లో స్ప్లిట్ కెప్టెన్సీ విధానాన్ని అమలు చేయడంపై ఆలోచించాలి. విరాట్‌కు మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేయాలనుంటుంది. కానీ రోహిత్ అద్భుతమైన కెప్టెన్ అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. అతని రికార్డు కూడా బాగుంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. అలాగే టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కూడా అద్భుత నాయకుడిగా కొనసాగుతున్నాడు. వన్డే క్రికెట్‌లో కూడా కోహ్లీనే కెప్టెన్‌గా ఉండాలి. కానీ టీ20 సారథ్య బాధ్యతలు మాత్రం రోహిత్‌కు ఇవ్వాలి. అతని పనిభారాన్ని తగ్గించాలి.'అని స్పోర్ట్స్ కీదా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతుల్ వాసన్ చెప్పుకొచ్చాడు.

రోహిత్‌కు అద్భుత రికార్డు..
ఇక టీ20ల్లో రోహిత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. 19 మ్యాచ్‌ల్లో జట్టుకు నేతృత్వం వహించిన రోహిత్.. 15 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు. ఇక కోహ్లీ 37 మ్యాచ్‌ల్లో జట్టుకు సారథ్యం వహించగా.. 22 మ్యాచ్‌ల్లో విజయాన్నందించాడు. గత కొంతకాలంగా కోహ్లీ.. టీ20ల్లో ఎక్కువగా విశ్రాంతి తీసుకున్నాడు. రాబోయే రెండేళ్లలో వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు జరుగనున్న క్రమంలో రోహిత్‌కు సారథ్య బాధ్యతలపై సునీల్ జోషీ నేతృత్వంలోని ప్రస్తుత సెలెక్షన్ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఐపీఎల్‌లో 4 టైటిళ్లు..
ఇక ఐపీఎల్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇప్పటికే నాలుగు టైటిళ్లను గెలుచుకోగా.. విరాట్ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒక్క ట్రోఫీ కూడా అందుకోకపోవడం గమనార్హం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అటు అభిమానులు, కొందరు విశ్లేషకులు పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతలను రోహిత్‌కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కోహ్లీ విశ్రాంతి తీసుకున్న సమయంలో వైస్ కెప్టెన్‌గా జట్టు పగ్గాలందుకున్న రోహిత్.. నిదహాస్ ట్రోఫీ, ఆసియాకప్ 2018 టైటిళ్లను అందించాడు.
ఇది తెలివైన పని కాదు.. శార్దూల్ ఠాకూర్ ఔట్‌డోర్ ప్రాక్టీస్‌పై బీసీసీఐ ఫైర్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications