Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సుశాంత్‌తో ఆరోజు మాట్లాడి ఉండాల్సింది: అక్తర్

 Shoaib Akhtar Says Sushant Singh Rajput didnt look confident when I met him in Mumbai, regret not talking to him
#SushantSinghRajput : తప్పు చేశా.. Sushant తో ఆరోజే మాట్లాడి ఉండాల్సింది - Shoaib Akhtar

కరాచీ: బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం పట్ల షోయబ్ అక్తర్ విచారం వ్యక్తం చేశాడు. నాలుగేళ్ల క్రితమే సుశాంత్‌‌ను కలిసినపుడు అతని ముఖంలో ఆత్మ విశ్వాసం కనిపించలేదని, అప్పుడే జీవితం గురించి కొన్ని మాటలు చెప్పి ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఇక జూన్ 14న ముంబై, బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ ద్వారా క్రికెట్ అభిమానులకు సుపరిచతమైన సుశాంత్ మరణం పట్ల ఇప్పటికే యావత్ క్రికెట్ లోకం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

జీవిత పాఠాలు చెప్పాల్సింది..

జీవిత పాఠాలు చెప్పాల్సింది..

తాజాగా అక్తర్ తన యూట్యూబ్ చానెల్‌లో సుశాంత్ ఆత్మహత్య గు రించి మాట్లాడాడు. ‘2016లో భారత్‌ను వీడే క్రమంలో ముంబైలోని ఒలివ్ హోటల్‌లో సుశాంత్‌ను కలిసా. నిజాయితిగా చెబుతున్నా.. అప్పుడే అతని ముఖంలో ఏదో బాధకనిపించింది. ఆత్మవిశ్వాసంగా లేడనిపించింది. తలను నేలకు వేసుకొని వెళ్తుండగా.. ధోనీ బయోపిక్ సినిమా చేస్తున్నాడని నా స్నేహితుడు తెలిపాడు. ఎలాంటి బ్యాక్ రౌండ్ లేకుండా సుశాంత్ తన టాలెంట్‌తో నిలదొక్కుకున్నాడు. అతని అద్భుతమైన నటనను చూసిన నాకు ఆ రోజు సుశాంత్‌ను ఆపి మాట్లాడి ఉండాల్సిందనిపించింది. నా జీవితంలోని కష్టనష్టాలను చెప్పి ధైర్యంగా ఉండమనాల్సింది అనిపిస్తుంది. కానీ అలా చేయలేదు. దానికి ఇప్పుడు పశ్చాతాప పడుతున్నా.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

ఆధారాల్లేకుండా మాట్లాడొద్దు..

ఆధారాల్లేకుండా మాట్లాడొద్దు..

ఇక నెపోటిజమ్(బంధుప్రీతి) కారణంగా సుశాంత్ చనిపోయాడని, ముఖ్యంగా సల్మాన్ ఖాన్ వంటి బడా హీరోలే చంపేశారని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా ఆధారాల్లేకుండా ఇలా మాట్లాడటం సరైంది కాదని అక్తర్ అభిప్రాయపడ్డాడు. సమస్యలకు చావొక్కటే పరిష్కారం కాదని కూడా సూచించాడు.

 చావొక్కటే పరిష్కారం కాదు..

చావొక్కటే పరిష్కారం కాదు..

‘జీవితంలో ఎదురయ్యే కష్టాలకు చావొక్కటే పరిష్కారం కాదు. ప్రతీఒక్కరి జీవితంలో అవి సర్వసాధారణమే. నీకేమైన బాధలుంటే.. నీ సన్నిహితులతో వాటి గురించి చర్చించు. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే బ్రేకప్ తర్వాత తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఆ సమయంలో సరైన సహాయం తీసుకొని ఆ గండం నుంచి గట్టెక్కింది. సుశాంత్‌కు కూడా ఇలాంటి సాయమే చేయాల్సింది.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్‌కు ఆడితే చంపేస్తామన్నారు: మాజీ క్రికెటర్

Story first published: Sunday, June 28, 2020, 11:30 [IST]
Other articles published on Jun 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+