టీ20 ప్రపంచకప్ ఆడాలని ధోనీని భారత ప్రధాని నరేంద్ర మోదీ రిక్వెస్ట్ చేయవచ్చు: షోయబ్ అక్తర్

కరాచీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఘన వీడ్కోలు అందుకోవాల్సిందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఆ గౌరవాన్ని అందుకోవడానికి మహీ అన్ని విధాల అర్హుడని తెలిపాడు. అలాగే వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ ఆడాల్సిందని, ఆ మెగా టోర్నీలో ఆడమని ధోనీని భారత్ ప్రధాని నరేంద్ర మోదీ రిక్వెస్ట్ చేయవచ్చన్నాడు. పాక్ జనరల్ జియా ఉల్ హక్ కోరిక మేరకు ఇమ్రాన్ ఖాన్ తన క్రికెట్ కెరీర్ కొనసాగించలేదా..? అలానే మోదీ రిక్వెస్ట్ చేయవచ్చని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

అక్తర్ భావోద్వేగం..
ఏడాది కాలంగా ఆటకు దూరమైన ధోనీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు జట్టుకు చేసిన సేవలపై క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టీమిండియాకు అతడు అందించిన విజయాల్ని, జట్టును నడిపించిన తీరును కొనియాడుతున్నాడు. ఈ క్రమంలోనే మహీ రిటైర్మెంట్‌పై భావోద్వేగానికి గురైన అక్తర్.. ఓ యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఎప్పటికీ మర్చిపోదు..
‘మాజీ కెప్టెన్‌కు భారత్‌లో అమితమైన అభిమానులున్నారు. తన ఆటతో యావత్ దేశాన్ని మైమరిపించాడు. అతడు టీ20ల్లో అయినా ఆడాల్సింది. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ గెలిచాక ఘనంగా వీడ్కోలు చెప్పాల్సింది. కానీ అది అతని వ్యక్తిగత నిర్ణయం. ఇక ధోనీ సాధించలేనిది ఏదీ లేదు. రాంచీ లాంటి చిన్న పట్టణం నుంచి వచ్చి దేశం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. క్రికెట్‌ను ఆరాధ్య దైవంగా భావించే భారత్ వంటి దేశం అతడిని ఎప్పటికీ మర్చిపోదు.' అని ఈ రావల్సిండి ఎక్స్‌ప్రెస్ చెప్పుకొచ్చాడు.

యావత్ భారత్ సిద్దంగా ఉంది..
ధోనీకి ఘన వీడ్కోలు ఇచ్చేందుకు భారత్ సిద్దంగా ఉందన్నాడు. ‘మహీకి ఘన వీడ్కోలు ఇచ్చేందుకు యావత్ భారత్ సిద్దంగా ఉంది. ధోనీ ఇష్టం లేకపోతే అది వేరే విషయం. కానీ భారత అభిమానులంతా లెజెండ్ క్రికెటర్‌కు గ్రాండ్‌గా గుడ్‌బై చెప్పేందుకు సిద్దమవుతున్నారు. అతను ఆడే ఆఖరి టీ20 మ్యాచ్‌కు మైదానమంతా ప్రేక్షకులతో నిండిపోతుంది.'అని 45 ఏళ్ల అక్తర్ చెప్పుకొచ్చాడు. అయితే ధోనీ ఎలాంటి వీడ్కోలు మ్యాచ్ అడగలేదని ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.

ఇమ్రాన్ ఖాన్ ఆడలేదా..?
ఇక ఇమ్రాన్ ఖాన్ విషయాన్ని ప్రస్తావించిన అక్తర్.. పాక్ జనరల్ జియా ఉల్ హక్ కోరిక మేరకు ఇమ్రాన్ ఇంకొన్నాళ్లు క్రికెట్ ఆడాడని గుర్తు చేశాడు. అలానే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ ఆడాలని రిక్వెస్ట్ చేయవచ్చని అంచనా వేశాడు. ‘మనకేం తెలుసు ధోనీని టీ20 ప్రపంచకప్ ఆడాలని భారత ప్రధాని కోరవచ్చు. అది కూడా జరిగే అవకాశం ఉంది. పాక్ జనరల్ జియా ఉల్ హక్ కోరిక మేరకు ఇమ్రాన్ ఖాన్ ఇంకొన్నాళ్లు క్రికెట్ ఆడలేదా? ప్రధాని కోరికను ఎవరూ కాదనలేరు కదా'అని అక్తర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
హలో ధోనీ ఫ్యాన్స్.. మీవోడి ఫస్ట్ వికెట్ నేను కాదు: కెవిన్ పీటర్సన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications