Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలాంటప్పుడు రోహిత్ శర్మకే కెప్టెన్సీ ఇవ్వాలి: షోయబ్ అక్తర్

Shoaib Akhtar says If Rohit Sharma does well in Australia, then there should be a debate about split captaincy
IND vs AUS 2020 : If Rohit Sharma Does Well Then A Debate About Split Captaincy : Shoaib Akhtar

కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో టెస్ట్ టీమ్ పగ్గాలను పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకే ఇవ్వాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నాడు. టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే కన్నా జట్టును రోహిత్ శర్మ నడిపిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. గతంలో కోహ్లీ గైర్హాజరీలో రోహిత్ ఆసియాకప్, నిదహాస్ ట్రోఫీలు గెలిపించాడని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ గుర్తు చేశాడు. ఇక టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ రాణిస్తే మరోసారి ఇద్దరి కెప్టెన్ల వాదన తెరమీదకు వస్తుందన్నాడు.

గోల్డెన్ చాన్స్..

గోల్డెన్ చాన్స్..

తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన అక్తర్.. టీమిండియా ఆస్ట్రేలియా టూర్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ గొప్ప ఆటగాడు. ఇప్పుడు అతను తన ప్రతిభ ఏంటో కూడా తెలుసుకున్నాడు. కెప్టెన్‌గా నిరూపించుకోవడానికి ఆస్ట్రేలియా పర్యటన అతనికి మంచి అవకాశం. ఈ సదవకాశాన్ని అతను రెండు చేతుల అందిపుచ్చుకోవాలి. జట్టును నడిపించే ప్రతిభ, సామర్థ్యం అతనికి ఉన్నాయి. కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో జట్టు సారథ్య బాథ్యతలను రహానే‌కు బదులు రోహిత్‌కు ఇవ్వడమే మేలు.

టీమిండియాకు టఫ్ టైమ్..

టీమిండియాకు టఫ్ టైమ్..

అయితే భారత జట్టుకు ఇది కఠిన పరీక్షా సమయం. ఓ ఆటగాడిగా నేను ఇలాంటి పరిస్థితుల కోసమే ఎదురు చూస్తాను. రోహిత్ శర్మ కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా ఎలా రాణిస్తాడని యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అతను కనుక వ్యక్తిగతంగా రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తే మరోసారి ‘ఇద్దరి కెప్టెన్ల' వాదన తెరపైకి వస్తుంది. నా అభిప్రాయం ప్రకారం భారత్‌కు మళ్లీ టెస్ట్ సిరీస్ గెలిచే సత్తా ఉంది. కానీ వారి మిడిలార్డర్ విఫలమైతే కష్టాలు తప్పవు.

నా తో సహా..

నా తో సహా..

ఈ సిరీస్ కోసం నాతో సహా జనాలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక డే నైట్ టెస్ట్ కూడా భారత్‌కు కఠినం కానుంది. ఈ పరిస్థితుల్లో భారత్ అద్భుతంగా ఆడితే వారికి తిరుగుండదు. ఫస్ట్ టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లు చూస్తేనే సిరీస్‌లో ఎవరు పైచేయి సాధిస్తారనే విషయం స్పష్టం అవుతుంది.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు. ఇక 2018-19 పర్యటనలో కోహ్లీ సేన 2-1తో టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేకపోవడం భారత్‌కు కలిసొచ్చింది. పైగా ఈ సారి కోహ్లీ ఫస్ట్ టెస్ట్ తర్వాత పెటర్నిటీ లీవ్ మీద భారత్‌కు రానున్నాడు.

రోహిత్‌కు కెప్టెన్సీ..

రోహిత్‌కు కెప్టెన్సీ..

ఇక ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్‌ను రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో భారత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పగ్గాలను రోహిత్‌కు ఇవ్వాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇద్దరు కెప్టెన్లు ఉంటే తప్పేంటని, కోహ్లీకి కూడా వర్క్ లోడ్ తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. గౌతమ్ గంభీర్ అయితే రోహిత్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోతే దేశానికే నష్టమనే వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇక ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న రోహిత్‌ను తొలుత ఆసీస్ టూర్‌కు ఎంపిక చేయని సెలెక్షన్ కమిటీ ఆ తర్వాత టెస్ట్‌లకు అవకాశం కల్పించింది. కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో టెస్ట్ కెప్టెన్సీని రోహిత్‌కు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది.

విరాట్ కోహ్లీ పెద్ద మనసు.. 10 వేల మంది చిన్నారులకు సాయం!

Story first published: Thursday, November 19, 2020, 12:00 [IST]
Other articles published on Nov 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+