Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారికి బౌలింగ్ చేయడం కష్టం.. నా ఐపీఎల్ ఫేవరేట్ మూమెంట్ అదే: అక్తర్

Shoaib Akhtar reveals his best memory of IPL

కరాచీ: టీమిండియా లెజండరీ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు రికీ పాంటింగ్, జస్టిన్ లాంగ‌ర్‌లకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. వారికి బౌలింగ్ చేయడం సవాల్‌తో కూడుకున్నదని ఈ వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్ చెప్పుకొచ్చాడు. ఆదివారం హలో మొబైల్ యాప్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించిన అక్తర్.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

 భారత్-పాక్ సిరీస్ జరగాలి..

భారత్-పాక్ సిరీస్ జరగాలి..

భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని, ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలను మెరుగుపడాలని ఆకాంక్షించాడు. ఇక కరోనా ఫండ్ రైజింగ్ కోసం భారత్-పాక్ సిరీస్ నిర్వహించాలని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ఐడియాను భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, మదన్ లాల్ వ్యతిరేకించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య సిరీస్ కుదరదన్నారు. కపిల్ అయితే.. డబ్బుల కోసం ప్రాణాలు పనంగా పెట్టి క్రికెట్ ఆడాల్సిన కర్మ భారత్‌కు పట్టలేదని ఘాటుగానే వ్యాఖ్యానించాడు. ఇక అక్తర్ కూడా ఈ విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం కూడా భారత్-పాక్ సిరీస్ అంశాన్ని ప్రస్తావించాడు.

స్మిత్ కన్నా విరాటే బెటర్..

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ కన్నా.. విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని అక్తర్ కితాబిచ్చాడు. కోహ్లీకి బౌలింగ్ చేయాలనుందని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీపాంటింగ్, మాజీ ప్లేయర్ జస్టిన్ లాంగర్‌లకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని తెలిపాడు. వారికి బౌలింగ్ చేయడం ఓ సవాల్‌తో కూడుకున్నదని చెప్పుకొచ్చాడు. ఇక తన స్పూర్తిదాయకమైన ప్లేయర్ మాత్రం పాక్ లెజండరీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అని పేర్కొన్నాడు

ఆ కౌగిలింత అతి మధురం..

ఆ కౌగిలింత అతి మధురం..

ఐపీఎల్‌లో తన బెస్ట్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ అని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ ఫెవరేట్ మూమెంట్ చాలెంజ్ నడుస్తున్న క్రమంలో ఓ అభిమాని.. అక్తర్‌ను ఐపీఎల్ ఫేవరేట్ మూమెంట్ ఏంటని ప్రశ్నించగా.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కౌగిలించుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనన్నాడు. ఐపీఎల్ ప్రారంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అక్తర్ బరిలోకి దిగాడు. అయితే ఓ మ్యాచ్‌ విజయానంతరం కేకేఆర్ సహయజమాని అయిన షారుఖ్.. ఆమాంతం ఎగిరి తన ఓళ్లో వాలిపోయాడని అక్తర్ గుర్తు చేసుకున్నాడు. ఆ క్షణం ఎప్పటికీ మరిచిపోలేనిదని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ పేర్కొన్నాడు.

ఐపీఎల్‌లో అత్యుత్తమ కెప్టెన్ అతనే: గంభీర్

ఢిల్లీపై అక్తర్ 4/11..

ఢిల్లీపై అక్తర్ 4/11..

ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో పరిమిత అవకాశాలు అందుకున్న అక్తర్.. ఢిల్లీతో జరిగిన ఓ మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటాడు. సౌరవ్ గంగూలీ సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆ మ్యాచ్‌లో 133 పరుగులే చేయగలింది. కానీ అక్తర్ సూపర్ బౌలింగ్‌తో 23 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది. ఆ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన అక్తర్ 11 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ గురించి గతంలో అక్తర్ మాట్లాడుతూ.. తన స్టన్నింగ్ పెర్ఫామెన్స్ చూసి షారుఖ్ బిత్తరపోయాడన్నాడు. ‘ఆ మ్యాచ్‌లో నేను 4 వికెట్లు తీయగానే ప్రతి ఒక్కరు స్టన్ అయ్యారు. షారుఖ్ ఖాన్ అయితే గెలిచిన సంతోషంలో మైదానమంతా పరుగెడుతూ పిచ్చోడిలా ప్రవర్తించాడు. ఆ క్షణం నేను వరల్డ్ కప్ గెలిచాననుకున్నా. అప్పుడు చుట్టూ అలాంటి వాతావరణమే ఉంది. మా కోసం మీరు ఓ పెద్ద మ్యాచ్ గెలిచారని షారుఖ్ మాతో అన్నాడు.'అని నాటి క్షణాలను షోయబ్ గుర్తు చేసుకున్నాడు.

Story first published: Monday, April 20, 2020, 10:35 [IST]
Other articles published on Apr 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+