Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కైఫ్ తనయుడా.. మావోడితో మ్యాచ్ ఆడు.. పేస్ అంటే ఎంటో చూపిస్తాడు: అక్తర్

Shoaib Akhtar responds to Mohammad Kaifs sons hitting Shoaib must be easy’ remark

కరాచీ: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. తన తరంలో అత్యంత ప్రమాదకర బౌలరనే విషయం అందరికి తెలిసిందే. అతని బౌలింగ్ ఆడటానికి సచిన్, పాంటింగ్ వంటి లెజండరీ క్రికెటర్లే భయపడేవారు. అత్యంత వేగవంతమైన పేసర్‌గా కూడా అక్తర్ గుర్తింపు పొందాడు. అందుకే పాక్ అభిమానులు అతన్ని ముద్దుగా రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అని పిలుచుకుంటారు.

పాత తరం మ్యాచ్‌లు..

పాత తరం మ్యాచ్‌లు..

అయితే టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తనయుడు కబీర్ మాత్రం ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ బౌలింగ్ ఆడటం చాల సులవంటున్నాడు. అతని పేస్‌తో ఈజీగా పరుగులు రాబట్టవచ్చని ఈ ప్రమాదకర బౌలర్‌ను తీసిపారేశాడు. కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా జరగాల్సిన క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయి. దీంతో స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్స్.. పాత తరం మ్యాచ్‌ల హైలైట్స్‌ను ప్రసారం చేస్తున్నాయి.

భారత్-పాక్ హైలైట్స్..

భారత్-పాక్ హైలైట్స్..

ఈ నేపథ్యంలోనే స్టార్ స్పోర్ట్స్.. 2003 ప్రపంచకప్‌లోని భారత్-పాకిస్థాన్ మ్యాచ్ హైలైట్స్ ప్రసారం చేసింది. ఈ మ్యాచ్‌లో షోయబ్ వేసిన ఓ బంతిని కైఫ్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ తరలించాడు. ఇది చూసిన అతని తనయుడు కబీర్.. అక్తర్ బౌలింగ్ ఆడటం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డాడు. అతని పేస్ వల్ల సులువువగా పరుగులు రాబట్టవచ్చని తెలిపాడు. అయితే దీనికి సంబంధించిన వీడియోను మహ్మద్ కైఫ్ ట్విటర్ వేదికగా పంచుకున్నాడు.

‘స్టార్ స్పోర్ట్స్ ఇండియాకు ధన్యవాదాలు.. చివరకు కబీర్ ఆ భారత్-పాక్ చారిత్రాత్మకమైన మ్యాచ్‌ను చూశాడు. కానీ ఈ జూనియర్‌ను తన తండ్రి ఆట ఆకట్టుకోలేదు. షోయబ్ బౌలింగ్‌లో పేస్ ఉందని, అతని బౌలింగ్‌లో హిట్ చేయడం చాలా సులువని చెప్పాడు. కానీ పిల్లలు ఈ రోజు చెప్తున్నా అతని బౌలింగ్ మీరనుకున్నంత ఈజీ కాదు'అని ట్వీట్ చేశాడు.

ప్రస్తుత టీమ్‌లో రోహిత్, కోహ్లీ మినహా ఎవరికీ భయంలేదు: యువరాజ్

కైఫ్ మీవోడికి నా ప్రేమను పంచు..

కైఫ్ మీవోడికి నా ప్రేమను పంచు..

ఇక ఈ ట్వీట్‌కు షోయబ్ అక్తర్ తనదైన శైలిలో బదులిచ్చాడు. తన కొడుకే కబీర్‌కు పేస్ ఎలా ఉంటుందో తెలియజేస్తాడని సరదాగా వ్యాఖ్యానించాడు. ‘కైఫ్.. మీ కబీర్‌ను మహమ్మద్ మిఖేల్ అలీ అక్తర్‌తో మ్యాచ్ ఆడమను. అప్పుడు మావోడు పేస్ ఎలా ఉంటుందో చూపిస్తాడు. హహహ.. నా ప్రేమను మీవోడికి పంచు'అని అక్తర్ ట్వీట్ చేశాడు.

నాటి మ్యాచ్‌లో కైఫ్ 35 పరుగులు చేశాడు. ఇక భారత అభిమానులకు ఈ మ్యాచ్ చిరస్మరణీయం. వసీం అక్రమ్, వఖార్ యూనిస్, షోయబ్ అక్తర్ వంటి దిగ్గజ బౌలర్లు ఉన్న నాటి మ్యాచ్‌లో సచిన్ 75 బంతుల్లో 98 పరుగుల క్లాస్ ఇన్నింగ్స్‌తో భారత జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. కేవలం రెండు పరుగుల దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు.

Story first published: Wednesday, April 8, 2020, 14:54 [IST]
Other articles published on Apr 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+