Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ మ్యాచ్‌లో నా బౌలింగ్‌కు షారుఖ్‌ఖానే పిచ్చోడయ్యాడు : అక్తర్

Shoaib Akhtar recollects his match-winning spell for KKR in 2008

న్యూఢిల్లీ: ఐపీఎల్ తొలి సీజన్‌లో తన బౌలింగ్‌ చూసి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ పిచ్చోడయ్యాడని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తెలిపాడు. ప్రారంభ సీజన్‌లో కోల్‌కతాకు ఆడిన ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ఢిల్లీతో జరిగిన ఓ మ్యాచ్‌లో(4/11) అద్భుత బౌలింగ్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ సీజన్‌లో పరిమిత అవకాశాలు అందుకున్న అక్తర్.. ఢిల్లీతో జరిగిన ఆ మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటాడు.

అక్తర్ స్వీట్ మెమొరీస్...

అక్తర్ స్వీట్ మెమొరీస్...

సౌరవ్ గంగూలీ సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆ మ్యాచ్‌లో 133 పరుగులే చేయగలింది. కానీ అక్తర్ సూపర్ బౌలింగ్‌తో 23 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది. ఆ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన అక్తర్ 11 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అయితే తాజాగా ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ.. ఐపీఎల్‌తో ఉన్న తన బంధాన్ని వివరించే క్రమంలో ఆ మ్యాచ్ నాటి మధుర క్షణాలను నెమర వేసుకున్నాడు.

తృటిలో చేజారిన 20 ఏళ్ల లక్ష్మణ్ రికార్డు.!!

వరల్డ్‌కప్ గెలిచాననుకున్నా..

వరల్డ్‌కప్ గెలిచాననుకున్నా..

తన స్టన్నింగ్ పెర్ఫామెన్స్ చూసి కోల్‌కతా ఫ్రాంచైజీ యాజమాని అయిన షారుఖ్ బిత్తరపోయాడని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ చెప్పుకొచ్చాడు. ‘ఆ మ్యాచ్‌లో నేను 4 వికెట్లు తీయగానే ప్రతి ఒక్కరు స్టన్ అయ్యారు. షారుఖ్ ఖాన్ అయితే గెలిచిన సంతోషంలో మైదానమంతా పరుగెడుతూ పిచ్చోడిలా ప్రవర్తించాడు. ఆ క్షణం నేను వరల్డ్ కప్ గెలిచాననుకున్నా. అప్పుడు చుట్టూ అలాంటి వాతావరణమే ఉంది. మా కోసం మీరు ఓ పెద్ద మ్యాచ్ గెలిచారని షారుఖ్ మాతో అన్నాడు.'అని నాటి క్షణాలను షోయబ్ గుర్తు చేసుకున్నాడు.

సెహ్వాగ్ గోల్డెన్ డక్..

సెహ్వాగ్ గోల్డెన్ డక్..

ఆ మ్యాచ్‌లో నాటి ఢిల్లీ డేర్‌డేవిల్స్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చిన అక్తర్.. ఆ వెంటనే అద్భుత బౌన్సర్‌తో గౌతం గంభీర్‌ను బోల్తా కొట్టించాడు. తర్వాత మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌, మనోజ్ తివారిలను ఔట్ చేసి ఢిల్లీ పతనాన్ని శాసించాడు. అతని ధాటికి 28 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 17.5 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది.

అప్పట్లో అక్తర్ ప్రదర్శనను సౌరవ్ గంగూలీ కూడా కొనియాడాడు. కానీ ఆ సీజన్‌లో కేకేఆర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 6వ స్థానంతో సరిపెట్టుకోగా.. ఢిల్లీ మాత్రం సెమీస్‌ చేరి ఓడింది. రాజస్థాన్ రాయల్స్ చాంపియన్‌గా నిలవగా.. చెన్నై సూపర్ కింగ్స్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

గంగూలీ బుక్‌లో..

గంగూలీ బుక్‌లో..

ఇక నాటి షోయబ్ ప్రదర్శనను కొనియాడుతూ గంగూలీ తన బుక్‌లో ప్రస్తావించాడు. ‘షోయబ్ పేస్ పొట్టి ఫార్మాట్‌లో పనికొస్తుందని తెలుసు. సెహ్వాగ్ విధ్వంసంతో దూకుడు మీదున్న ఢిల్లీని అక్తర్ అద్భుతంగా అడ్డుకున్నాడు. షోయబ్ 11 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టడంతో మేము లో స్కోరింగ్ మ్యాచ్ గెలిచాం. ఆ క్షణం ఈడెన్ మైదానం ఆనందంతో గర్జించింది. మా మరపురాని విజయాల్లో ఇది ఒకటి, కానీ ఆ సీజన్‌లో మేము దాన్ని కొనసాగించలేకపోయాం.'అని గంగూలీ తన పుస్తకంలో ప్రస్తావించాడు.

ఆ సీజన్‌లో 7.71 ఎకానమీతో షోయబ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అతనికి టీ20 లీగ్ ఆడే అవకాశం రాలేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో పాకిస్థాన్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరమయ్యారు.

Story first published: Friday, February 14, 2020, 20:40 [IST]
Other articles published on Feb 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+