న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువరాజ్ సింగ్ పట్ల హద్దు మీరి అతని వెన్ను విరిచా: షోయబ్ అక్తర్

Shoaib Akhtar recalls how he used to ‘cross the line’ while showing his affection injured others

కరాచీ: మైదానంలో భారత్-పాకిస్థాన్ పోరు యుద్దంలా ఉన్నా.. ఆఫ్‌ద ఫీల్డ్‌లో మాత్రం ఇరు దేశాల ఆటగాళ్లు స్నేహంగా ఉండేవారు. ఒకరిపై ఒకరు సరదా జోకులు వేసుకుంటూ నవ్వుకునేవారు. ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే షోయబ్ అక్తర్.. తాజాగా భారత ఆటగాళ్లతో సరదాగా గడిపిన క్షణాలను నెమరువేసుకున్నాడు. సహచర ఆటగాళ్ల పట్ల తన ప్రేమ కొంచెం క్రూరంగా ఉండేదన్నాడు.

ఎప్పుడూ వారితో సరదాగా వాదులాడుకునేవాడినని, ఈ క్రమంలో కొన్నిసార్లు హద్దులు దాటి వారిని గాయపర్చిన సందర్భాలున్నాయని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఓసారి ఇలానే భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వెన్ను విరిచానని, అలాగే అఫ్రిది పక్కటెముకలకు గాయం చేసానని గుర్తు చేసుకున్నాడు.

నా ప్రేమ కొంచెం వైల్డ్‌గా..

నా ప్రేమ కొంచెం వైల్డ్‌గా..

‘నేను చనువుగా ఉండే ఆటగాళ్లతో సరదాగా వాదులాడేవాడిని. నెడుతూ.. కొడుతూ మాట్లాడేవాడిని. నా పద్ధతిలో ప్రేమ చూపించడం అంటే అదే. ఇలా కొన్నిసార్లు హద్దులు దాటి ఆటగాళ్లను గాయపర్చిన సందర్భాలున్నాయి. ఇలానే ప్రవర్తించి యువరాజ్ వెన్ను విరిచా. అంతకు ముందు అఫ్రిదిని హత్తుకొని పక్కటెముకలు విరగ్గొట్టా. అబ్ధుల్ రజాక్‌ను బాగా స్ట్రెచ్ చేసి అతని కాలి నరం మెలిక పడేలా చేశాను. అయితే ఇదంతా ప్రేమతో సరదాగా చేసింది. నా ప్రేమ కొంచెం వైల్డ్‌గా ఉంటుంది.' అంటూ అక్తర్ చెప్పుకొచ్చాడు.

భజ్జీ‌ని కొట్టేందుకు హోటల్‌ గదికి వెళ్లా..

భజ్జీ‌ని కొట్టేందుకు హోటల్‌ గదికి వెళ్లా..

2010 ఆసియాకప్‌లో హర్భజన్‌ సింగ్‌తో మైదానంలో నెలకొన్న వాగ్వాదంతో హోటల్ గదికి వెళ్లి అతన్ని కొట్టాలనుకున్నానని అక్తర్ గతంలో వెల్లడించాడు. 'హర్భజన్‌ మాతో కలిసి తింటాడు, లాహోర్‌లో మాతో కలిసి తిరుగుతాడు. అతను పంజాబీ కావడంతో మా మధ్య ఒకే తరహా సాంప్రదాయాలు ఉంటాయి. అయినా, అతను మాతో గొడవపడతాడు. ఆ రోజు మ్యాచ్‌ అయ్యాక అతని గదికెళ్లి గొడవపడాలనుకున్నా. భజ్జీ‌ని కొట్టేందుకు హోటల్‌ రూంకి వెళ్లాను. బహుశా నేను అతని రూమ్‌కు వస్తానని తెలుసేమో? భజ్జీ అక్కడ లేడు. దాంతో నేను వెనక్కి వచ్చేశా. అయితే మరుసటి రోజు క్షమాపణ చెప్పాడు' అని అక్తర్‌ వివరించాడు.

హర్భజన్ కూడా..

హర్భజన్ కూడా..

ఇదే విషయాన్ని హర్భజన్‌ కూడా ఓసందర్భంలో ఒప్పుకున్నాడు. 'అక్తర్ నా గదికొచ్చి కొడతానని చెప్పాడు. దాంతో నేను కూడా.. సరే, రా! ఎవరు ఎవర్ని కొడతారో చూసుకుందాం అని బదులిచ్చా. కానీ ఆ సమయంలో నేను నిజంగా భయపడ్డా. ఎందుకంటే.. అక్తర్‌ శరీర సౌష్టవం బలంగా ఉంటుంది' అని అన్నాడు. ఈ విషయాన్ని సురేశ్‌ రైనా సైతం ఇర్ఫాన్‌ పఠాన్‌తో ప్రస్తావించాడు. 'భజ్జీ ఒక ఫైటర్‌. అతనితో ఆడేటప్పుడు ఒకసారి అక్తర్‌తో గొడవపడ్డాడు. చివరికి భజ్జీ సిక్స్‌ కొట్టి గెలిపించాడు. ఆ సమయంలో నేను నాన్‌స్ట్రైకర్‌గా ఉన్నా'అని రైనా చెప్పుకొచ్చాడు.

 ఆ మాటంటే సెహ్వాగ్ బతికేవాడా?

ఆ మాటంటే సెహ్వాగ్ బతికేవాడా?

ఇక అక్తర్ గతవారం వీరేంద్ర సెహ్వాగ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ మ్యాచ్‌లో షోయబ్‌ అక్తర్‌ అదే పనిగా స్లెడ్జింగ్‌ చేయడంతో సెహ్వాగ్‌ అతనికి ఘాటుగా బదులిచ్చాడు.'అదే పనిగా బౌన్సర్లు వేస్తూ హుక్ షాట్ కొట్టమని రెచ్చగొడుతున్నాడు. దాంతో విసిగిపోయిన నేను నాన్‌స్ట్రైకర్‌లో సచిన్‌ను చూపిస్తూ మీ అయ్య ఉన్నాడు.. అతడికి చెప్పు అతను కొట్టి చూపిస్తాడన్నా. ఆ వెంటనే సచిన్ సిక్స్ కొట్టడంతో అయ్య అయ్యే.. కొడుకు కొడుకే అన్నా'అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన అక్తర్‌.. ‘సెహ్వాగ్ ఆ మాట అంటే బతికేవాడా..? నేను వదిలిపెట్టేవాడినా..?మైదానమంతా ఉరికించి కొట్టేవాడిని. తర్వాత హోటల్‌లో కూడా గొడవపడేవాడిని'అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

CPL 2020: పాపం ఫాబియన్‌..ఫ్లైట్‌ మిస్సయి టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు!

Story first published: Friday, August 7, 2020, 15:46 [IST]
Other articles published on Aug 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X