Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వసీం అక్రమ్ అలా చేయలేదే? సర్ఫరాజ్ షూస్ మోయడంపై అక్తర్ ఫైర్!

Shoaib Akhtar and Rashid Latif slams management on seeing Sarfaraz Ahmed carry shoes

కరాచీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ డ్రింక్స్, షూస్ మోయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్లు జట్టును నడిపించి, 2017 చాంపియన్స్ ట్రోఫీ అందించిన కెప్టెన్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా? అని పాక్ అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆ టీమ్ మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఓ చాంపియన్‌కు ఇచ్చే గౌరవం ఇదా..?

ఓ చాంపియన్‌కు ఇచ్చే గౌరవం ఇదా..?

ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఈ రావల్సిండి ఎక్స్‌ప్రెస్.. సర్ఫరాజ్‌తో ఆ పనులు చేయించడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నాడు. ‘సర్ఫరాజ్ షూస్, డ్రింక్స్ మోయడం నాకు నచ్చలేదు. పాకిస్థాన్ జట్టును నాలుగేళ్లు నడిపించి, చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిపిన ఓ కెప్టెన్‌ చేత డ్రింక్స్ మోయించడం బాలేదు. తనకు తానుగా చేస్తానన్నా.. అడ్డుకోవాల్సింది. వసీం అక్రమ్ ఏనాడు నా కోసం షూస్ తీసుకురాలేదే.

ఇది సర్ఫరాజ్ ఎంత బలహీనుడో తెలియజేస్తుంది. షూస్ మోసిన విధంగానే పాక్ జట్టును అతను నడిపించి ఉండాలి. అందుకే మిక్కీ ఆర్థర్(మాజీ కోచ్) ఎప్పుడూ అతనిపై ఆధిపత్యం చెలాయించేవాడు. షూస్ మోయం తప్పని నేను అనడం లేదు. కానీ ఓ మాజీ కెప్టెన్ అలాంటి పనులు చేయడం సరికాదంటున్నా'అని అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

టీమ్ స్పిరిట్ ఎక్కడా..?

టీమ్ స్పిరిట్ ఎక్కడా..?

మరో మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలాగే సర్ఫరాజ్ గొప్ప మనసును, స్పూర్తిని కొనియాడాడు. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో టీమ్ స్పిరిట్‌ ఎక్కడా? అని ప్రశ్నించాడు. మ్యాచ్ జరుగుతుండగా.. వెటరన్ పేసర్లు మహ్మద్ అమిర్, వహాబ్ రియాజ్ కనీసం పాకిస్థాన్ కిట్ డ్రెస్ ధరించకుండా ట్రాక్ సూట్స్ వేసుకోవడం ఏంటని నిలదీశాడు.

‘సీనియర్ ప్లేయర్లు అమిర్, వహాబ్ కనీసం కిట్ డ్రెస్ లేకుండా ట్రాక్ సూట్స్‌లో కనిపించారు. ఇది ఏమాత్రం ఆహ్వానించదగినది కాదు. కానీ సర్ఫరాజ్ తన గొప్పతనాన్ని, ఆట పట్ల అతనికి ఉన్న అంకితభావాన్ని చాటుకున్నాడు. ఇలాంటివి మళ్లీ జరగకూడదు'అని రషీద్ లతీఫ్ నొక్కిచెప్పాడు.

తప్పేముంది..?

తప్పేముంది..?

సర్ఫరాజ్ అహ్మద్‌తో డ్రింక్స్ మోయించడంపై వస్తున్న విమర్శలపై పాకిస్థాన్ చీఫ్ కోచ్ కమ్ చీఫ్ సెలక్టర్ మిస్బా ఉల్ హక్ స్పందించాడు. మైదానంలో డ్రింక్స్ మోయడంలో తప్పేముందని విమర్శకులను ప్రశ్నించాడు. తాను కెప్టెన్‌గా ఉండి కూడా ఈ పని చేశానని గుర్తు చేశాడు. ‘క్రికెటర్స్ డ్రింక్స్ మోయడం చాలా సాధారణ విషయం. బహుశా సర్ఫరాజ్ అహ్మద్‌ కూడా ఈ విషయంలో ఏ మాత్రం ఫీల్ అవలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్ సమయంలో నేను కెప్టెన్‌గా ఉండి కూడా ఓ మ్యాచ్‌లో డ్రింక్స్ మోశా. డ్రింక్స్ మోయడం తప్పేమీకాదు' అని మిస్బా బదులిచ్చాడు.

భారత ఫ్యాన్స్ సెటైర్స్..

భారత ఫ్యాన్స్ సెటైర్స్..

సర్ఫరాజ్ అహ్మద్‌ డ్రింక్స్ మోయడాన్ని పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు అవమానంగా ఫీలవుతుండటంపై భారత ఫ్యాన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. గతంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా సహచరుల కోసం వాటర్ బాయ్‌గా మారారు.. వారికంటే సర్ఫరాజ్ గొప్పవాడా? అని ప్రశ్నిస్తున్నారు. బెంచ్‌లోని ఆటగాళ్లు డ్రింక్స్ తీసుకుపోవడం సాధారణం, ఎందుకంత సీన్ చేస్తున్నారు? అని మరికొందరు అడుగుతున్నారు.

కొందరైతే 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ల వెనుక సర్ఫరాజ్ ఆవలింతలు తీయడాన్ని ప్రస్తావిస్తూ ఒక్క ఆవలింత ఎంత పనిచేసే? అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక సర్ఫరాజ్ పాక్ తరఫున ఇప్పటివరకు 49 టెస్టులు, 116 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

IPL 2020: క్యా‘కరోనా'.. ఒక్కో ఫ్రాంచైజీకి 80 కోట్ల నష్టం!

Story first published: Friday, August 7, 2020, 19:07 [IST]
Other articles published on Aug 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+