
బీసీసీఐని కోరినా..
టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి వివో వైదొలగడం, యూఏఈలో మ్యాచ్‌లు నిర్వహించాల్సి రావడం, గేట్ రెవెన్యూ లేకపోవడంతో ప్రతి ఫ్రాంచైజీకి దాదాపు రూ.80 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ నష్టంలో కొంత మొత్తాన్ని భరించాలని బీసీసీఐని కోరుతున్నా.. బోర్డుకు అందుకు సిద్దంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో ఫ్రాంచైజీలన్నీ తలలు పట్టుకుంటున్నాయి.

గేట్ రెవెన్యూ లేక..
సాధారణంగా ప్రతి ఫ్రాంచైజీకి రూ.22 నుంచి 28 కోట్ల గేట్ రెవెన్యూ(టికెట్ల అమ్మకంతో) లభిస్తుంది. కానీ ఈ సారి అది కష్టమే. టీమ్ స్పానర్స్ షిప్ రెవన్యూలో కూడా ఈసారి 15 నుంచి 20 శాతం కోత పడనుంది. రూ.100 కోట్లు దాటిన ముంబై ఇండియన్స్ మినహాయిస్తే.. టీమ్ స్పాన్సర్‌షిప్ ద్వారా ప్రతీ ఫ్రాంచైజీ ఏడాదికి రూ.50 నుంచి 70 కోట్లు సంపాదిస్తుంది. సాధారణంగా ఐపీఎల్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయం(సెంట్రల్ పూల్) నుంచి బీసీసీఐ యాభై శాతం అన్ని ఫ్రాంచైజీలకు పంచుతుంది.

వివో డీల్ రద్దుతో..
వివో స్పాన్సర్‌షిప్ విలువ ఏడాదికి రూ.440 కోట్లు. ఇందులో యాభై శాతం షేర్ అంటే రూ.220 కోట్లు ఎనిమిది ఫ్రాంచైజీల ఖాతాలోకి వెళ్తాయి. కానీ ఈసారి వివో స్పాన్సర్‌షిప్ రద్దవడంతో ఒక్కో ఫ్రాంచైజీ రూ.28 కోట్లు నష్టపోతున్నాయి. వివో టైటిల్ స్పాన్సర్ విలువలో 50 నుంచి 60 శాతం ఇచ్చే స్పాన్సర్ బీసీసీఐకి లభించినప్పటికీ ఫ్రాంచైజీలకు కొంత నష్టం తప్పదు. ఈ మూడింటితో ప్రతి జట్టు ఎంతలేదన్నా రూ.70-75 కోట్లు కోల్పోవడం ఖాయమే.

పెరగనున్న ఖర్చులు..
ఇక ఈ ఐపీఎల్ సీజన్ దుబాయ్‌లో నిర్వహించనుండటం కూడా ఫ్రాంచైజీలకు ప్రతికూలంగా మారింది. ఆటగాళ్లను తరలించేందుకు ప్రత్యేక విమానాలు, కరోనా భదత్ర, బయో సెక్యూర్ బబుల్ నేపథ్యంలో ప్రత్యేక హోటళ్లు, భద్రత వలయంతో కూడిన ప్రాక్టీస్ సెషన్స్ ఏర్పాటు చేయడం వంటి వాటితో ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. దీంతో మొత్తం ఒక్కో ఫ్రాంచైజీ ఈ సీజన్‌లో రూ.80-85 కోట్లు నష్టపోనున్నాయి.
రామమందిర భూమి పూజపై మహ్మద్ కైఫ్ ట్వీట్.. మండిపడుతున్న ఫ్యాన్స్!


Click it and Unblock the Notifications
