న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేఎల్ రాహుల్‌తో పోటీపై ధావన్ ఏమన్నాడంటే.?

Shikhar Dhawan Says I want to perform, team selection not in my hands over competition with KL Rahul

న్యూఢిల్లీ: పేలవ ఫామ్, వరుస గాయాలతో జట్టులోకి వస్తూ పోతున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్.. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ ఆడుతానని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం భారత జట్టులో ఓపెనర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో ఇరగదీస్తుండగా.. ధావన్ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ అద్బుత ప్రదర్శన కనబర్చాడు. టెస్ట్‌ల్లో మయాంక్ అగర్వాల్ రాణిస్తుండగా.. లిమిటెడ్ ఫార్మాట్‌లో పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్ పోటీలో నిలిచారు.

గాయాలతో వస్తూ పోతూ..

గాయాలతో వస్తూ పోతూ..

ఇక గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన ధావన్.. ఆ వెంటనే చేతి వేలి గాయంతో మెగాటోర్నీ నుంచి అర్దాంతరంగా నిష్క్రమించాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతూ మోకాలి గాయంతో కొన్ని సిరీస్‌లకు దూరమయ్యాడు. ఆ వెంటనే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రీ ఎంట్రీ ఇచ్చి రాణించినా.. ఫీల్డింగ్ చేస్తూ భుజ గాయానికి గురయ్యాడు. దీంతో న్యూజిలాండ్ సుదీర్ఘ పర్యటనకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఈ టూర్‌లో ఓపెనింగ్ చేసిన రాహుల్ అద్భుతంగా రాణించాడు. అంతేకాకుండా వికెట్ కీపర్ పాత్రను సమర్దవంతంగా నిర్వర్తించి అందరి మన్ననలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ నుంచి గబ్బర్ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నాడు. దీనిపై తాజాగా ఇర్ఫాన్ పఠాన్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌సెషన్‌లో స్పందించిన గబ్బర్.. జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తానని, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని రాణించడమే తన పనని, సెలెక్షన్‌తో తనకు సంబంధంలేదన్నాడు.

నా టార్గెట్ టీ20 వరల్డ్ కప్..

నా టార్గెట్ టీ20 వరల్డ్ కప్..

‘నా లక్ష్యం టీ20 ప్రపంచకప్‌లో ఆడటమే. ఆ మేరకు సిద్దమవుతున్నా. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా. ఎప్పుడు అవకాశం దొరికినా.. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు నేను సిద్ధం. కానీ జట్టు ఎంపికనదే నా చేతుల్లో ఏమీ ఉండదు. గతేడాది కన్నా ఈ సారి మెరుగైన ప్రదర్శన కనబర్చాలనుకుంటున్నా. గతేడాది మొత్తం గాయాల బారిన పడి జట్టులోకి వస్తూ.. వెళ్లాను. ఇదంతా ఆటలో భాగమే.అయినా జట్టులోకి రావడం, పోవడం నాకు ఓ అలవాటుగా మారిపోయింది. ఇక కేఎల్ రాహుల్ ఇటీవల చాలా బాగా ఆడుతున్నాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌ నుంచి అతని బ్యాటింగ్‌ను నేను కూడా బాగా ఆస్వాదించాను. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో అతని బ్యాటింగ్ దగ్గరగా చూశాను. అతని బ్యాటింగ్‌ మరో స్థాయికి చేరింది. మైదానం నలువైపులా అలవోకగా షాట్లు కొట్టేస్తున్నాడు. రోహిత్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు'అని ధావన్ చెప్పుకొచ్చాడు.

ఓపెనింగ్‌ కొత్త కాదు..

ఓపెనింగ్‌ కొత్త కాదు..

ధావన్.. ఓ ఇడియట్ అని, తొలి బంతి ఆడటానికి ముందుకురాడని ఇటీవల డేవిడ్ వార్నర్‌తో రోహిత్ శర్మ అన్న విషయం తెలిసిందే. దీనికి వార్నర్ కూడా అవునని బదులిచ్చాడు. అయితే ఈ ఇద్దరి వ్యాఖ్యలపై ధావన్ స్పందించాడు. 'నాకు ఓపెనింగ్‌ కొత్త కాదు. ఎనిమిదేళ్లుగా ఓపెనింగ్‌ చేస్తున్నా. నేను ఏదో తొలి బంతిని ఆడటాన్ని, మొదటి ఓవర్‌ను ఆడటాన్ని ఇష్టపడనని అన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి.ఒకవేళ తొలి ఓవర్‌ను ఆడకపోతే.. రెండో ఓవర్‌లోనైనా ఆడాలి కదా. మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా కొనసాగుతున్నా. ఒకవేళ మనకు సీమింగ్‌ వికెట్‌ ఎదురైతే.. కాస్త కఠినంగా ఉంటుంది. కానీ ఆడక తప్పదు. పేస్‌ బౌలర్లను ఆడకపోతే ఇక ఓపెనింగ్‌కు దిగడం ఎందుకు. నేను ఓపెనర్‌ అయినప్పుడు తొలి ఓవర్‌ను ఎందుకు ఆడలేను' అని ధావన్‌ చెప్పుకొచ్చాడు.

రీ ఎంట్రీ ఇవ్వడం అల‌వాటైపోయింది..

రీ ఎంట్రీ ఇవ్వడం అల‌వాటైపోయింది..

ఇర్ఫాన్ ప‌ఠాన్‌తో మాట్లాడుతూ.. త్వ‌రలోనే తాను జ‌ట్టులోకి రీ ఎంట్రీ ఇస్తానన్నాడు. ఇద్దరూ మాట్లాడుతండ‌గా.. ధావ‌న్ ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ప‌లుమార్లు అంత‌రాయానికి గురైంది. ఈ నేప‌థ్యంలో త‌న‌కు రీ ఎంట్రీ ఇవ్వడం అల‌వాటుగా మారిపోయింద‌ని గబ్బర్ చ‌మ‌త్కరించాడు. నిజానికి గ‌తేడాది ధావన్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. చివరకు దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపికైనా.. కరోనా వైరస్ అతని ఆశలపై నీళ్లు చల్లింది.' అని గబ్బర్ అన్నాడు. ధావన్ భారత్ తరఫున 34 టెస్టులు, 136 వన్డేలు, 61 టీ20లు ఆడాడు.

స్టార్ ఫుట్‌బాలర్‌ ఘాతుకం.. కన్న కొడుకునే చంపి కరోనా మృతిగా చిత్రీకరణ!

Story first published: Friday, May 15, 2020, 11:12 [IST]
Other articles published on May 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X