For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అది క్రీడా స్పూర్తికి విరుద్ధం: ఎంసీసీ సమీక్షలో ఓవర్ త్రోపై షేన్ వార్న్

Shane Warne Says World Cup Final Overthrow Should Have Been A Dead Ball

హైదరాబాద్: ప్రపంచకప్‌ ఫైనల్లో ఆఖరి ఓవర్లో ఓవర్‌త్రో ద్వారా ఇంగ్లాండ్‌కు పరుగులు లభించడంతో న్యూజిలాండ్‌కు ప్రపంచకప్‌ను దూరం చేసింది. లార్డ్స్ వేదికగా జులై 14న జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో ఆఖరి ఓవర్లో గప్టిల్‌ విసిరిని బంతి స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లింది. ఈ ఓవర్ త్రో కారణంగా ఇంగ్లాండ్‌కు ఆరు పరుగులు వచ్చాయి.

ప్రపంచకప్ ఫైనల్: ఓవర్‌త్రోలో స్టోక్స్-గుప్టిల్ పాత్రపై సెప్టెంబర్‌లో సమీక్ష!

ఫలితంగా ఇరు జట్ల ప్రధాన స్కోర్లు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ ఫలితం నిర్ణయించేందుకు సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. సూపర్‌ ఓవర్‌లోనూ ఇరు జట్ల స్కోరు సమం అయిన నేపథ్యంలో బౌండరీ సంఖ్య ఆధారంగా ఆతిథ్య జట్టైన ఇంగ్లాండ్‌ను ఐసీసీ విజేతగా ప్రకటించింది. అయితే అంపైర్‌ ఆరు పరుగులు కేటాయించడాన్ని మాజీలు తప్పుబట్టారు.

ఈ మ్యాచ్ ఫలితం మారిపోవడానికి కారణమైన ఓవర్ త్రో నిబంధనలపై క్రికెట్ విశ్లేషకులు సైతం నిప్పులు చెరిగారు. ఓవర్ త్రో నిబంధనలను మార్చాలని సూచించారు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ చట్టాలను రూపొందించే మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ) ఓవర్‌త్రో నిబంధనపై సమీక్ష చేపట్టింది.

డబ్ల్యూసీసీ ప్యాన‌ల్‌లో ఉన్న మాజీ క్రికెట‌ర్లు షేన్ వార్న్‌, కుమార సంగ‌క్క‌ర‌, సౌరవ్ గంగూలీలు సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ ఫైనల్‌ ఓవర్‌త్రోపై షేన్‌ వార్న్‌ మాట్లాడుతూ "ఓవర్‌ త్రో నిబంధనలపై ఎమ్‌సీసీ సమీక్ష నిర్వహిస్తున్నాం. ఎమ్‌సీసీలో సభ్యుడిగా నా వాదన వినిపించాను" అని తెలిపారు.

కశ్మీర్ నుంచి ఇంటికి: ధోని ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

"ఫీల్డర్‌ విసిరిన బంతి క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్‌ శరీరానికి, బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళితే దానిని డెడ్‌బాల్‌గా పరిగణించాలి. బ్యాట్స్‌మెన్‌ సైతం పరుగు తీయొద్దు. ఎందుకంటే అది క్రీడా స్పూర్తికి విరుద్దం. ఓవర్‌ త్రో పరుగులు అనేవి మైదానంలో ఉన్న ఫీల్డింగ్‌ జట్టు తప్పిదం వల్లనే రావాలి. కానీ, ఎవరి తప్పిదం లేనప్పుడు వచ్చిన పరుగులను లెక్కించకూడదు" అని వార్న్ పేర్కొన్నాడు.

"ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌ను నేను స్వాగతిస్తున్నా. టెస్టు క్రికెట్‌ను బతికించేందుకు ఐసీసీ ముందడుగేసింది. అన్ని దేశాల క్రికెట్‌ బోర్డులు టెస్టు ప్రమాణాలను పెంపొందించేలా నిర్ణయాలు తీసుకోవాలి. టెస్టుల్లో ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, నెంబర్లను కొందరు తప్పుబడుతున్నారు. ఇందులో ఏం తప్పు ఉందో అర్థం కావడం లేదు. జెర్సీలపై నెంబర్లు, పేర్లు ఉంటే ప్యాన్స్ ఆటగాళ్లను సులువుగా గుర్తుపట్టొచ్చు" అని వార్న్ వెల్లడించాడు.

Story first published: Wednesday, August 21, 2019, 18:57 [IST]
Other articles published on Aug 21, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+