For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెన్ స్టోక్స్ భార్యపై మార్లోన్ శామ్యూల్స్‌ అనుచిత వ్యాఖ్యలు.. మండిపడ్డ షేన్ వార్న్, ఫ్యాన్స్!

Shane Warne and Twitter slams Marlon Samuels for disgusting post about Ben Stokes and his wife

హైదరాబాద్: కనీస ఇంగిత జ్ఞానం లేకుండా.. ఓ అంతర్జాతీయ క్రికెటరనే సోయి మరిచి ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌, అతని భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వెస్టిండీస్ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్‌పై నెటిజన్లు, ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్నర్ మండిపడ్డారు. పురుష అహంకారంతో రగిలిపోతున్న శ్యామ్యూల్స్‌కు ఎవరైన మెడికల్ సాయం అందించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. శామ్యూల్స్ ఓ ఆర్డినరీ ఆటగాడని, ఈ తరహా ప్రవర్తనతోనే అతను అందరిని దూరం చేసుకొని ఇబ్బంది పడుతున్నాడని షేన్ వార్న్ ట్వీట్ చేశాడు.

ఈ కష్టం పగవాడికి కూడా రావద్దు..

ఈ కష్టం పగవాడికి కూడా రావద్దు..

ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్‌లో స్టోక్స్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆలస్యంగా ఈ టోర్నీలో పాల్గొన్న స్టోక్స్.. కరోనా ప్రొటోకాల్స్ ప్రకారం క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాతే మైదానంలోకి అడుగు పెట్టాడు. అంతకుముందు తల్లిదండ్రుల అనారోగ్యం కారణంగా పాకిస్థాన్‌ టెస్ట్ సిరీస్ నుంచి అర్దాంతరంగా తపుకున్నాడు. పేరెంట్స్ కోసం న్యూజిలాండ్ బయల్దేరిన అతను కరోనా ప్రొటోకాల్స్ ప్రకారం అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోటల్స్‌లో 14 రోజుల క్వారంటైన్ పాటించాడు. అయితే ఈ క్వారంటైన్ పరిస్థితి గురించి ఇటీవల మాట్లాడిన స్టోక్స్.. ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకుడదని, తాను బద్ద శత్రువుగా భావించే శ్యామూల్స్‌కు కూడా రావద్దని కోరుకుంటానని సరాదాగా చెప్పుకొచ్చాడు.

స్టోక్స్ కామెంట్స్‌ను అపార్డం చేసుకోని..

స్టోక్స్ కామెంట్స్‌ను అపార్డం చేసుకోని..

స్టోక్స్ నోట తన పేరు రావడమే తప్పుగా భావించిన శ్యామూల్స్.. అతని వ్యాఖ్యలను అపార్దం చేసుకొని అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. తన ఇన్ స్టా స్టోరీల్లో రాయలేని పదాలతో కామెంట్స్ చేశాడు.‘ఈ తెల్లోడు ఇంకా నా గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. 14 రోజులు నీ భార్యను పంపించరా.. 14 సెకన్లలో జమైకన్‌గా మార్చుతా.'అంటూ అసభ్య పదజాలంతో బూతుపురాణం అందుకున్నాడు. అలాగే షేన్ వార్న్‌పై కూడా శామ్యూల్స్ అనుచిత కామెంట్స్ చేశాడు.

ఈ నా కొడుక్కి సాయం చేయండి..

ఈ నా కొడుక్కి సాయం చేయండి..

ఇక అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్యామూల్స్‌పై షేన్ వార్న్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎవరి తోడు, స్నేహం లేక పిచ్చోడవుతున్నాడని, అతని ఎవరైనా సాయం చేయాలని ట్వీట్ చేశాడు. 'నాతో పాటు స్టోక్స్‌పై చేసిన వ్యాఖ్యలను ఇప్పుడే తిరిగి శామ్యూల్స్‌కు పంపించా. అతని వ్యాఖ్యలు సరైనవి కావు. ఒక వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడడంతో పాటు కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగడం బాధాకరమైన విషయం. శామ్యూల్స్‌కు మతి చెడింది.. ఇప్పుడు అతనికి సహాయం అవసరం. కానీ దురదృష్టం కొద్దీ అతనికి స్నేహితులు ఎవరు లేరు.. కనీసం తోటి క్రికెటర్లు కూడా అతనికి సాయంగా రారు. ఎందుకంటే అతనొక సాధారణ క్రికెటర్‌.. అందుకే ఎవరి వద్ద నుంచైనా వెంటనే సాయం కోరు '

శామ్యూల్స్ సిగ్గుండాలి..

శామ్యూల్స్ సిగ్గుండాలి..

ఇక శామ్యూల్స్ అనుచిత వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యల చేయడానికి సిగ్గండాలని మండిపడుతున్నారు. అతన్ని అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. బెన్ స్టోక్స్ కనుక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించేవారని, అతనికి మెడికల్ హెల్ప్ అందించాలని కామెంట్ చేస్తున్నారు.

అంపైర్ ఘోర తప్పిదం.. నిబంధనలకు విరుద్దంగా డేవిడ్ వార్నర్‌కు సాయం!

Story first published: Wednesday, October 28, 2020, 19:56 [IST]
Other articles published on Oct 28, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+