
లక్షణాల్లేకుండానే..
ఈ ఆటగాళ్లు కూడా ఫలితాలు వచ్చేవరకు ఎలాంటి లక్షణాలు లేకుండా ఎసింప్టమిక్‌గానే కనిపించారు. షోయబ్ మాలిక్, కోచ్ వకార్ యూనిస్ తదితరుల పరీక్షా ఫలితాలు కూడా రావాల్సి ఉంది. ఇక రెండు వారాల క్రితం ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి కూడా కరోనా సోకిన విషయం తెలిసింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న అఫ్రిది.. దేశంలో పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్యపై ఆందోళన వ్యక్తం చేశాడు.
త్వరగా కోలుకోవాలి..
మహమ్మారి బారిన పడిన పాక్ క్రికెటర్లు మొహమ్మద్ హఫీజ్, వహాబ్ రియాజ్, ఫఖర్ జమాన్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ హస్‌నైన్, కాశిఫ్ భట్టీ, ఇమ్రాన్ ఖాన్, హైదర్ అలీ, షాదాబ్ ఖాన్, హారిస్ రవూఫ్‌లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. పాకిస్థాన్ ప్రజలంతా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ.. వైరస్‌ను సీరియస్‌గా పరిగణించాలని ట్వీటర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు.‘పాక్ ఆటగాళ్లు ఫకార్, ఇమ్రాన్ ఖాన్, కాషిఫ్, హఫీజ్, హస్నైన్, రిజ్వాన్, వాహబ్, మలంగ్ త్వరగా కోలుకోవాలి. పాక్ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం లైట్ తీస్కోవద్దు. వైరస్‌ను సీరియస్‌గా పరిగణించండి.'అని అఫ్రిది ట్వీట్ చేశాడు.

షెడ్యూల్ ప్రకారమే..
ఇంగ్లండ్‌తో జరిగే 3 టెస్టులు, 3 టీ20ల కోసం 29 మందితో భారీ జట్టును పాక్ ప్రకటించగా... ఇప్పుడు దాదాపు మూడోవంతు మంది కరోనా బారిన పడ్డారు. అయినా సరే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్ బయల్దేరుతుందని పీసీబీ ప్రకటించింది. పాజిటివ్‌గా తేలినవారిలో ఒక్క వికెట్ కీపర్ రిజ్వాన్ మాత్రమే టెస్టు స్పెషలిస్ట్. అతనికి మాత్రమే తుది జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని, మిగతా వారికి టీ20ల కోసం కోలుకునేందుకు తగినంత సమయం ఉందని బోర్డు భావిస్తోంది.

రిజర్వ్ ఆటగాళ్లకు టెస్ట్‌లు..
రిజ్వాన్ గైర్హాజరులో మాజీ కెప్టెన్ సర్ఫరాజ్‌కు అవకాశం దక్కవచ్చు. ముందు జాగ్రత్తగా నలుగురు రిజర్వ్ ఆటగాళ్లు బిలాల్ ఆసిఫ్, ఇమ్రాన్ బట్, మూసా ఖాన్, మొహమ్మన్ నవాజ్‌లను ఎంపిక చేసిన పీసీబీ వారిని కూడా కరోనా టెస్టుల కోసం పంపించింది. జూన్ 25న పాక్ ఆటగాళ్లకు తర్వాతి దశ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
నీ సహచరులు సంబరాలు చేసుకుంటున్నారు.. ఇక్కడి నుంచి వెళ్లు: మాలిక్‌తో యువీ


Click it and Unblock the Notifications












