
భారత్‌తో పోరంటే..
అయితే దాయాదుల పోరు గురించి తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న అఫ్రిది.. పాక్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సవేరా పాషా యూట్యూబ్ చానెల్ ‘క్రిక్ క్యాస్ట్'షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్‌తో మ్యాచ్ ఆడటాన్ని తాను చాలా ఆస్వాదించేవాడినని చెప్పుకొచ్చాడు.
‘భారత్‌తో మ్యాచ్ అంటే మేం బాగా ఎంజాయ్ చేస్తాం. ఎన్నోసార్లు భారత్‌ను ఓడించాం. అలా చిత్తుగా ఓడిపోయిన ప్రతిసారీ మ్యాచ్ తర్వాత భారత క్రికెటర్లు తమని క్షమించాలని కోరేవారు.'అని తెలిపాడు.

నాకు భలే ఇష్టం..
భారత్, ఆస్ట్రేలియాతో పోరును నేను బాగా ఆస్వాదించేవాడిని. ఎందుకంటే ఈ రెండు చాలా బలమైన పెద్ద జట్లు. తీవ్ర ఒత్తిడిలో ఆడటం చాలా మజానిచ్చేంది.నా కెరీర్‌పరంగా గుర్తుండిపోయే ఇన్నింగ్స్ 1999 చెన్నై టెస్టులో చేసిన 141 పరుగులు.. అది కూడా భారత్‌పైనే. వాస్తవానికి ఆ సిరీస్‌కు తొలుత నేను ఎంపికవ్వలేదు. కానీ.. వసీమ్ అక్రమ్ మద్దతుతో ఆ భారత్ పర్యటనకి వెళ్లగలిగాను'అని అఫ్రిది వెల్లడించాడు. 1996లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అఫ్రిది.. 2018లో తన ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఇక అతని సారథ్యంలోని పాక్ జట్టు 2011 ప్రపంచకప్ సెమీస్‌కు చేరుకొని భారత్ చేతిలోనే ఓడింది.

కరోనాను ఓడించిన అఫ్రిది..
ఇక ఇటీవల కరోనా వైరస్ బారినపడిన అఫ్రిది.. రెండు రోజుల క్రితమే కోలుకున్నాడు. తనతో పాటు తన భార్యా పిల్లలకు కూడా కోవిడ్-19 పరీక్షల్లో 'నెగెటివ్'గా నిర్ధారణ అయిందని ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 'ఆ అల్లా దయవల్ల నేను, నా సతీమణి, కూతుళ్లు అక్సా, అన్షా కూడా కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పుడు అంతా బాగుంది. మేం కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్ధించిన మీ అందరికి కృతజ్ఞతలు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయమిది'అని అఫ్రిది ట్వీట్ చేశాడు. గత నెల 13న అఫ్రిది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

భారత్‌దే పై చేయి..
వాస్తవానికి పాకిస్థాన్‌పై ఏ ఫార్మాట్‌లోనైనా భారత్‌కే మెరుగైన రికార్డ్ ఉంది. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ 7 సార్లు భారత్, పాక్ ఢీకొనగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే గెలుపొందింది. ఇక టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 5 సార్లు తలపడగా నాలుగుసార్లు భారత్ గెలవగా.. ఒక్కసారి డ్రా అయింది. ఇక మ్యాచ్‌ల పరంగ మాత్రం పాక్‌దే పైచేయి. ఇప్పటి వకు ఇరు దేశాల మధ్య 59 టెస్ట్‌లు జరగ్గా.. పాక్ 12 సార్లు గెలవగా.. భారత్ 9 సార్లే విజయం సాధించింది. 38 మ్యాచ్‌ల ఫలితం తేలలేదు. 132 వన్డేల్లో 73 పాక్ గెలవగా.. భారత్ 55 మాత్రమే విజయం సాధించింది. 4 మ్యాచ్‌లు టై అయ్యాయి. ఇక టీ20ల్లో ఇరు జట్లు 8 మ్యాచ్‌లు ఆడగా.. భారత్ అత్యధికంగా 6 సార్లు విజయం సాధించగా.. పాక్ ఒకేసారి గెలుపొందింది. మరొక మ్యాచ్ డ్రా అయింది.


Click it and Unblock the Notifications

కోహ్లీ జోలికే పోం.. అతన్ని కవ్వించడం అత్యంత ప్రమాదకరం