Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ జోలికే పోం.. అతన్ని కవ్వించడం అత్యంత ప్రమాదకరం

Australia quick Hazlewood on what gets Virat Kohli fired up

న్యూఢిల్లీ: అప్‌కమింగ్ సిరీస్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పెట్టుకోమని ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హాజల్‌వుడ్‌ చెప్పాడు. ముఖ్యంగా కోహ్లీ బ్యాటింగ్‌ చేసే సమయంలో తమ జట్టు ఆటగాళ్లెవరూ అతడిని కవ్వించే ప్రయత్నం చేయరని స్పష్టం చేశాడు. అలా చేయడం వల్ల విరాట్‌లోని అత్యుత్తమ ఆట బయటకొస్తుందని అది మరింత ప్రమాదకరమని హాజల్‌వుడ్‌ అభిప్రాయపడ్డాడు.

2018-19 బోర్డర్-గావస్కర్ సిరీస్‌ను కోహ్లీసేన 2-1తో గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఇక ఈ ఏడాది చివర్లో భారత్.. ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో హజల్‌వుడ్ మాట్లాడుతూ.. 'కోహ్లీని రెచ్చగొట్టేందుకు మేం సాహసించం. అతని రెచ్చగొడితే ఏమవుతుందో 2018 సిరీస్‌లోనే మేం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం.

కోహ్లీ కూడా ఆటలో పోటీని ఇష్టపడతాడు. ఇలాంటి సందర్భాల్లో అతను మరింతగా చెలరేగిపోతాడు. కోహ్లీ బ్యాటింగ్‌ చేసే సమయంలో స్లెడ్జింగ్‌ జోలికే వెళ్లకూడదు. బౌలర్లెవరూ ఆ పని చేయకూడదు'‌అని హాజెల్‌వుడ్‌ వ్యాఖ్యానించాడు.

Story first published: Sunday, July 5, 2020, 14:26 [IST]
Other articles published on Jul 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+