Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతనికి బౌలింగ్ చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేది: షాహిద్ అఫ్రిది

Shahid Afridi reveals name of legendary batsman who intimidated him

కరాచీ: వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారాకు బౌలింగ్ చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేదని పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500కు పైగా వికెట్లు పడగొట్టిన ఈ పాక్ స్పిన్నర్.. విండీస్ వీరుడికి బౌలింగ్ చేయాలంటే మాత్రం బెదిరిపోయేవాడినన్నాడు. ఇప్పటికీ లారాకు బౌలింగ్ చేయాలంటే జంకుతానని ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పాక్ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

ఆ భయం వెంటాడేది..

ఆ భయం వెంటాడేది..

లారాను చాలా సార్లు ఔట్ చేసినప్పటికి బంతిని బౌండరీలకు తరలిస్తాడనే భయం తనలో ఉండేదని అఫ్రిది తెలిపాడు. ‘లారాను కొన్నిసార్లు ఔట్ చేసాను. కానీ అతను బౌండరీలు కొడ్తాడనే భయం వెంటాడేది. అతని ప్రభావం నాపై చాలా ఉండేది. ఏ రోజు కూడా ఆత్మవిశ్వాసంతో అతనికి బౌలింగ్ చేయలేదు'అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.

దిగ్గజ స్పిన్నర్లే తేలిపోయారు..

దిగ్గజ స్పిన్నర్లే తేలిపోయారు..

లారా వరల్డ్‌క్లాస్ బ్యాట్స్‌మన్ అని, ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌లో పండుగ చేసుకునేవాడని ఈ విండీస్ వీరుడిపై అఫ్రిది ప్రశంసల జల్లు కురిపించాడు. వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు కూడా అతని విధ్వంసాన్ని అడ్డుకులేకపోయారని, ముత్తయ్య మురళీ ధరణ్ లాంటి దిగ్గజ స్పిన్నర్లే లారా ముందు తేలిపోయారని చెప్పుకొచ్చాడు.

‘లారా ఓ వరల్డ్‌క్లాస్ బ్యాట్స్‌మన్. స్పిన్నర్లపై పూర్తి ఆదిపత్యం చెలాయించేవాడు. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీదరణ్ కూడా లారా చేతిలో మూల్యం చెల్లించుకున్నాడు. స్పిన్నర్లపై అతని ఫుట్‌వర్క్ అమోఘం. స్పిన్ బౌలింగ్‌లో అతని బ్యాటింగ్ విధ్వంసం అత్యద్భుతం. అతనో పరిపూర్ణమైన ఆటగాడు.'అంటూ అఫ్రిది ప్రశంసల జల్లు కురిపించాడు.

నా ఫేవరేట్ హీరో ప్రభాస్: స్టార్ క్రికెటర్

సేవ కార్యక్రమాల్లో..

సేవ కార్యక్రమాల్లో..

కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన అఫ్రిది.. తన ఫౌండేషన్ ద్వారా పేదలకు సాయం చేస్తున్నాడు. లాక్‌డౌన్‌తో ఉపాది కోల్పోయి ఆహారం లేక అల్లాడుతున్న అభాగ్యులకు రేషన్, నిత్యవసర వస్తువులను అందజేస్తున్నాడు. తన ఫౌండేషన్‌కు సాయం చేయాలని ఆయా బ్రాండ్లకు ఈ పాక్ మాజీ కెప్టెన్ విజ్ఞప్తి చేశాడు. ఈ సాయానికి బదులుగా వారి ఉత్పత్తులకు ఫ్రీగా ప్రచారకర్తగా పనిచేస్తానన్నాడు. తన ఫౌండేషన్‌కు బియ్యం, నిధులు ఇస్తే సరిపోతుందన్నాడు.

Story first published: Wednesday, April 22, 2020, 14:31 [IST]
Other articles published on Apr 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+