Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాతో ఆడిన అబ్బాయిలకు థ్యాంక్స్ : లేడీ సెహ్వాగ్

Shafali Verma Says Want to thank my father and all the boys I practiced with

మెల్‌బోర్న్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జైత్రయాత్ర కొనసాగుతోంది. గురువారం పటిష్ట న్యూజిలాండ్‌ను మట్టికరిపించి హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈ మూడు విజయాల్లో ఓపెనర్ షెఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ లేడీ వర్షన్‌గా.. బౌలర్లపై విరుచుకుపడుతున్న ఈ 16 ఏళ్ల సంచలనం.. వరుస మ్యాచ్‌ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షెఫాలీ వ‌ర్మ (34 బంతుల్లో 46) విధ్వంసకర బ్యాటింగ్‌తో సెహ్వాగ్‌ను గుర్తు చేసింది.

ఈ క్రెడిట్ మా నాన్నేదే..

పవర్‌ప్లేలో మెరుపు షాట్లతో టీమిండియాకు అద్భుతమైన శుభారంభాలు అందిస్తున్నందుకు షెఫాలీ వర్మ తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసింది. మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఈ ముంబై సెన్సేషన్.. ఈ క్రెడిట్ అంతా తన తండ్రిదేనని చెప్పుకొచ్చింది.

‘పవర్ ప్లే‌లో మెరుపులు మెరిపిస్తూ శుభారంభం అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొదట చెత్త బంతుల కోసం వేచిచూశాను. అలాంటి బంతుల్ని చితకబాదడం నా బలం. ఈ రోజు అదే జరిగింది. నేను ఎక్కువగా అబ్బాయిలతో సాధన చేసేదాన్ని. అందుకే మా నాన్న, నాతో సాధన చేసిన అబ్బాయిలకు ధన్యవాదాలు. వాళ్ల వల్లే నేను బాగా ట్రైన్ అయ్యా. చక్కగా బ్యాటింగ్‌ చేస్తున్నా' అని షెఫాలీ చెప్పుకొచ్చింది.

తండ్రి కల..

తండ్రి కల..

షెఫాలీ నాన్న సంజీవ్ వర్మ కూడా క్రికెటరే. కానీ అతను ఎదగలేకపోయాడు. తన కూతురు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తే చూడాలనేది ఆయన కల. చిన్నప్పటి నుంచే షెఫాలీ నాన్న ఆలోచనలకు తగ్గట్టు ఎదిగింది. మిగిలిన మహిళా క్రికెటర్ల కన్నా భిన్నంగా తన కూతురు ఉండాలని సంజీవ్ వర్మ కోరుకున్నాడు. ఇప్పుడున్న మహిళా క్రికెట్లో హార్డ్ హిట్టర్లు చాలా తక్కువ. హర్మన్ ప్రీత్ కౌర్, మంధాన, వేద కృష్ణమూర్తి లాంటి కొంతమంది తప్ప భారత క్రికెట్‌లో బంతిని బలంగా బాదేవారు కనిపించరు. అందుకే షెఫాలిని ఈ దిశగా నడిపించాడు సంజీవ్. అబ్బాయిల్లా జుట్టు కత్తిరించాడు. చిన్నప్పటి నుంచి వారితోనే క్రికెట్ ఆడించేవాడు. షెఫాలికి జిమ్, ప్రత్యేక డైట్ ఏం తెలియదు. అంత సహసిద్దంగానే ఆమె ఫిట్‌నెస్ పెంచుకుంది. ట్రాక్టర్ టైర్లకు తాడు కట్టి లాగేది. పొలాల్లోనే పరుగులెత్తేది. ఇవే ఆమె బలంగా, భయం లేకుండా తయారు చేశాయి.

సన్‌రైజర్స్ అనూహ్య నిర్ణయం.. కెప్టెన్‌గా మళ్లీ వార్నరే

సచిన్ స్పూర్తి..

సచిన్ స్పూర్తి..

తన విధ్వంసకర ఆటతో లేడీ సెహ్వాగ్‌గా గుర్తింపు పొందినా.. ఆమె క్రికెట్‌లోకి రావడానికి మాత్రం సచినే స్పూర్తి. అతనిలా బౌలర్లపై ఆధిపత్యం చలాయించడం ఈ టీనేజ్ సెన్సేషన్‌కు చాలా ఇష్టం. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో భారత మహిళలు 4 పరుగులతో గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు.

అత్యధిక స్ట్రైక్‌రేట్‌

విశ్వ టోర్నీలో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్న షెఫాలీ వర్మ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. అమ్మాయిల టీ20ల్లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ ఉన్న బ్యాటర్‌గా చరిత్రకెక్కింది. ఇప్పటి వరకు ఆమె 147.97 స్ట్రైక్‌రేట్‌తో 438 పరుగులు చేసింది. క్లోయి ట్రయాన్‌ 138.31 (722 పరుగులు), అలిసా హేలీ 129.66 (1,875) స్ట్రైక్‌రేట్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కనీసం 200 పరుగులను ఈ గణాంకాలకు ఆధారంగా చేసుకున్నారు. ఒకే టీ20 ప్రపంచకప్‌లో ఆమె కన్నా ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో మరెవ్వరూ పరుగులు చేయకపోవడం విశేషం. ఈ మెగాటోర్నీలో ఆమె 172.72 స్ట్రైక్‌రేట్‌తో 114 పరుగులతో అదరగొట్టింది.

Story first published: Thursday, February 27, 2020, 16:03 [IST]
Other articles published on Feb 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+