Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోచ్‌గా మళ్లీ రవిశాస్త్రి: అభిమానులు అసంతృప్తి, ట్వీట్స్ మీరే చూడండి

See tweets: Fans unhappy with Ravi Shastris reappointment as Team Indias head coach

హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని తిరిగి ఎంపిక చేయడంపై భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా హెడ్ కోచ్‌ నియామక ప్రక్రియలో భాగంగా కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ శుక్రవారం ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో ఐదుగురిని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

చివరి అంచె మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ ఓటమి

ఇంటర్వ్యూ అనంతరం రవిశాస్త్రికే తిరిగి పట్టం కట్టింది. దీంతో శాస్త్రి నాలుగోసారి టీమ్‌ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2017 నుంచి జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న శాస్త్రి మరో రెండేళ్ల పాటు ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ నేపథ్యంలో తదుపరి కోచ్‌గా అతడినే ఎంపిక చేయాల్సి వస్తే ఇక మిగతావారిని ఇంటర్వ్యూలకు ఎందుకు ఆహ్వానించారని నెటిజన్లు మండిపడుతున్నారు.

2007 బంగ్లాదేశ్‌ పర్యటనకు గాను జట్టు మేనేజర్‌గా వ్యవహరించిన రవి శాస్త్రి ఆ తర్వాత 2014-2016 మధ్య కాలంలో జట్టు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. 2017లో కోహ్లీతో విభేదాల కారణంగా కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన అనంతరం రవిశాస్త్రి కోచ్‌గా ఎంపికయ్యాడు. రవి శాస్త్రి కోచింగ్‌లోనే టీమిండియా తొలిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుచుకుంది.

బీసీసీఐ లెటర్‌లో తప్పుగా హెసన్ పేరు: ట్విట్టర్‌లో పేలుతోన్న జోకులు

రవిశాస్త్రి కోచ్‌గా ఎంపికైనప్పటి నుంచి (జులై 2017) భారత్‌ 21 టెస్టులు ఆడితే 13 గెలిచింది. వన్డేల్లో 60 మ్యాచ్‌లలో 43 గెలవగా, టి20ల్లో 36 మ్యాచ్‌లలో 25 సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా మళ్లీ రవిశాస్త్రినే కోచ్‌గా ఎంపికవ్వడంతో నాలుగోసారి తన సేవలను కొనసాగించనున్నాడు. కోచ్‌గా రవిశాస్త్రి పేరుని వెల్లడించగానే నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

Story first published: Saturday, August 17, 2019, 13:20 [IST]
Other articles published on Aug 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+