న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

See pics: ధోనీని చూసిన ఆ క్షణంలో జీవా భావోద్వేగం

See pics: MS Dhoni returns after completing his stint with Indian Army, reunites with daughter Ziva

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన 15 రోజుల సైనిక విధులను విజయవంతంగా నిర్వర్తించి శనివారం కశ్మీర్ లోయ నుంచి న్యూఢిల్లీకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. 38 ఏళ్ల ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రెండు నెలలు విరామం ప్రకటించి 106 టెరిటోరియల్ ఆర్మీకి చెందిన పారా బెటాలియన్‌తో కలిసి విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఆర్చర్ మామూలోడు కాదు, అదొక భయంకరమైన క్షణమన్న రూట్

జూలై 30వ తేదీ నుంచి ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ తీసుకోవడంతో పాటు అక్కడ గార్డ్ విధుల్లో ధోని పాల్గొన్నాడు. సుమారు రెండు వారాల పాటు ధోని భారత ఆర్మీకి సేవలందించాడు. భారత ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని ఆగస్టు 15తో తన కాల పరిమితి ముగియడంతో ఇంటికి చేరుకునేందు తిరుగు ప్రయాణం అయ్యాడు.

ఈ క్రమంలో ధోనీకి ఘన స్వాగతం పలికేందుకు గాను అతడి భార్య సాక్షితో పాటు కుమార్తె జీవా సైతం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ధోనీని చూడగానే అమాంతం డాడీ అంటూ జీవా పరిగెత్తుకుంటూ వెళ్లింది. వెంటనే జీవాను ధోని పైకెత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలోనూ కోహ్లీ హవా.. సచిన్, ధోనీలను మించి ఫాలోవర్లు

అంతకముందు ధోని ఇంటికి తిరుగు పయనమైన క్రమంలో లేహ్ విమానాశ్రయంలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు వారాల పాటు కశ్మీర్‌ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్‌, గార్డ్‌, పోస్ట్‌ గార్డ్‌ డ్యూటీలను ధోని నిర్వర్తించాడు. ఇందులో భాగంగా విక్టర్‌ ఫోర్స్‌లో ధోని పనిచేశాడు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన జెండా వందనం కార్యక్రమంలో సైతం పాల్గొన్నాడు.

సైనికులతో కలసి వాలీబాల్ కూడా ఆడాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్ పంచుకున్నాడు. లేహ్ నగరంలోని ఓ బాస్కెట్ బాల్ కోర్టును క్రికెట్ ఫీల్డ్ గా మార్చి అక్కడి పిల్లలతో కలసి ధోనీ క్రికెట్ ఆడిన సంగతి తెలిసిందే. కశ్మీర్ లోయలో ధోని విధుల్లో ఉన్నప్పుడు యురి, అనంత‌నాగ్‌లను సైతం సందర్శించాడు.

కాగా, ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను తనంతట తానుగా వెస్టిండిస్ పర్యటనకు దూరమయ్యాడు. సెప్టెంబర్ 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టీ20ల సిరిస్‌ ధోని తిరిగి పాల్గొనే అవకాశం ఉంది.

Story first published: Monday, August 19, 2019, 15:43 [IST]
Other articles published on Aug 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X