మాలిక్.. పాకిస్థాన్ మొత్తానికి సానియా మీర్జా వదిననే!

కరాచీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్థాన్ మొత్తానికి వదిననే అని ఆ దేశ నటి మహిర ఖాన్ తెలిపింది. కరోనా కారణంగా క్రీడాకారులతో పాటు నటినటులు ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతూ.. సోషల్ మీడియా వేదికగా కాలక్షేపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాక్ బ్యూటీ మహిర ఖాన్.. సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో ఇన్‌స్టాలైవ్ సెషన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా చాలా సరదాగా మాట్లాడుకున్న ఈ ఇద్దరూ.. సానియా మీర్జా పేరును ప్రస్తావిస్తూ నవ్వులు పూయించారు.

బాబీ చూడటం లేదా..?
ఈ లైవ్ సెషన్‌లో మహిర మాట్లాడుతూ.. ‘ఇద్దరి వయసు మీదపడుతున్నందుకు కావొచ్చు.. ఇన్ స్టా లైవ్‌లో కనెక్ట్ కావడం కష్టమైంది.'అని తెలిపింది. దీనికి మాలిక్ స్పందిస్తూ.. ‘నా వయసు అయిపోవచ్చు.. కానీ నీ అందం.. వయసు ఏ మాత్రం తగ్గలేదు.'అని మాలిక్.. తన మాటలతో మహిరను ఫ్లట్ చేసే ప్రయత్నం చేశాడు. మాలిక్ పొగడ్తలకు ఉబ్బితబ్బిబ్బైన పాక్ బ్యూటీ.. బాబీ(సానియా) ఈ లైవ్ సెషన్ చూడటం లేదా? అని చిలిపిగా ప్రశ్నించింది.

అన్ని చూస్తున్నా..
సానియా చూస్తుందని చెప్పిన మాలిక్.. ఆమె తన బాబీ కాదని, సతీమణి అని వ్యంగ్యంగా బదులిచ్చాడు. ఇక నవ్వు ఆపుకోలేకపోయిన మహిర.. ‘నా ఉద్దేశం.. సానియా నీకు వదినా అని కాదు మాలిక్.. ఆమె పాకిస్థాన్ మొత్తానికి వదిననే.'అని బుదులిచ్చింది. ఇక ఈ మాటలు విన్న సానియా..‘చూస్తున్నా.. మీరేం మాట్లాడుకుంటున్నారో అన్ని వింటున్నా'అని కామెంట్ చేసింది.

మహిర అది నిజమేనా..?
ఇక మహిరా అని గూగుల్ చేస్తే ఎవరితోనో డేటింగ్ చేస్తున్నట్లు వచ్చింది నిజమేనా? అని మాలిక్ అడిగాడు. దీనికి మహిర చాలా తెలివిగా సమాధానమిచ్చింది. ‘మాలిక్ మీలా.. సానియా మీర్జా వంటి వ్యక్తులతో డేటింగ్ చేయలేదు.'అని బదులిచ్చింది. దీనికి మాలిక్ నవ్వు ఆపుకోలేకపోయాడు.
కరోనా లాక్‌డౌన్ కారణంగా సానియా-మాలిక్ ఐదు నెలలు విడిగా ఉన్నారు. ఇక లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో సానియాను కలిసేందుకు ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికైన మాలిక్ ఆదేశ క్రికెట్ బోర్డు పర్మీషన్ తీసుకున్నాడు.

నెల రోజులు గడిపిన తర్వాత..
పాకిస్తాన్ జట్టు ఈ నెల 28న మాంచెస్టర్ బయలుదేరనుంది. భార్య, కుమారుడితో దాదాపు నెల రోజులు గడిపిన తర్వాత వచ్చే నెల 24న షోయాబ్ మాలిక్ ఇంగ్లండ్‌లో ఉన్న జట్టుతో చేరుతాడు. ఇంగ్లండ్‌తో పాక్ మూడు టెస్టులు, మూడు టీ20 మ్యాచులు ఆడనుంది. ఇక సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌ల వివాహం 2010 ఏప్రిల్ 12న హైదరాబాద్‌లోనే సంప్రదాయ పద్దతిలో జరిగింది. వీరికి 2018లో కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ జన్మించాడు.
క్రికెట్‌లో నెపోటిజమ్ లేదా? సచిన్ కొడుకనే అర్జున్ టెండూల్కర్‌ను ఎంపిక చేయలేదా?
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications