MI vs KKR: కెప్టెన్సీ మార్పుతో కోల్‌కతా రాత మారెనా? ముంబై జోరుకు బ్రేక్‌లు వేసెనా? తుది జట్లు ఇవే

అబుదాబి: ఐపీఎల్ 2020 పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం టాప్ -4లో ఉన్న రెండు జట్లు సీజన్‌లో రెండోసారి తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. శుక్రవారం అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం వేదికగా జరిగే లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా నాలుగు విజయాలు సాధించి డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మంచి ఊపుమీదుంది. మరోపక్క బెంగళూరు చేతిలో 82 రన్స్ తేడాతో చిత్తుగా ఓడిన కోల్‌కతా కాస్త ఒత్తిడిలో ఉంది.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన తమ ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో కేకేఆర్ 49 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. దాంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి రోహిత్ సేనపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ప్లే ఆప్ బెర్త్ కు మార్గం సుగుమం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఫలితం ఎలా ఉన్నా.. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు మాత్రం అభిమానులకు మంచి కిక్ ఇవ్వనుంది.
పేపర్‌పై ఇరు జట్లు సమతూకంగా ఉండటంతో పాటు విధ్వంసకర వీరుల కొదవలేకున్నా.. ఫామ్ పరంగా ముంబై హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ఇక ఈ మ్యాచ్‌కు ముందు కెప్టెన్సీ బాధ్యతలను దినేశ్ కార్తీక్ వదులుకోగా.. ఇయాన్ మోర్గాన్ జట్టును నడిపించనున్నాడు. సారథ్యం మార్పుతో కోల్‌కతా రాత మారుతుందా? ముంబై జోరుకు బ్రేక్ వేస్తుందో చూడాలి!

పటిష్టంగా ముంబై..
టాప్ క్లాస్ బ్యాటింగ్ లైనప్, డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్‌లతో ముంబై ఇండియన్స్ బలంగా ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా రెండు హాఫ్ సెంచరీలు చేసిన రోహిత్..వాటిని అబుదాబిలోనే సాధించాడు. పైగా కోల్‌కతాతో ఆడిన లాస్ట్ మ్యాచ్‌లో 54 బాల్స్‌లో 80 రన్స్ చేయడంతో అతనిపై మళ్లీ భారీ అంచనాలున్నాయి. అతనికి తోడు డికాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌తో ముంబై లైనప్ అంతా ఫామ్‌లో ఉంది. హార్దిక్, పోలార్డ్ నుంచి జట్టు మరింత ఆశిస్తోంది. బౌలింగ్‌లోనూ ముంబై బలంగా ఉంది. బుమ్రా, ప్యాటిన్సన్ తమ పేస్‌తో చెలరేగుతుంటే, క్రునాల్, రాహుల్ చహర్ స్పిన్‌తో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు.

ఒత్తిడిలో కోల్‌కతా..
కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం బ్యాటింగ్‌లో నిలకడ లేమితో ఇబ్బంది పడుతోంది. దానికి తోడు బౌలింగ్ యాక్షన్ వార్నింగ్ ఎదుర్కొన్న సునీల్ నరైన్ వ్యవహారం ఆ జట్టుకు కాస్త తలనొప్పిగా మారింది. ఈ మ్యాచ్‌లో కూడా అతను బరిలోకి దిగడం కష్టమే. ఇక రాహుల్ త్రిపాఠి, టామ్ బ్యాంటన్ మరోసారి ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నారు. శుభ్‌మన్ గిల్, ఇయాన్ మోర్గాన్, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్ రాణిస్తున్నా టీమ్ విన్నింగ్ పెర్ఫామెన్స్‌లు చేయలేకపోతున్నారు. మురీ ముఖ్యంగా ఆండ్రీ రసెల్ అంచనాలు అందుకోవడంలో పూర్తిగా ఫెయిలవుతున్నాడు. కేకేఆర్ పేసర్లు ఫర్వాలేదనిపిస్తున్నా.. బెంగళూరుతో జరిగిన లాస్ట్ మ్యాచ్‌లో భారీగా రన్స్ ఇచ్చారు. వరుణ్ చక్రవర్తికి తోడు కుల్దీప్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే చాన్సుంది.

ముఖా ముఖి
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 26 సార్లు తలపడగా 20-6తో ముంబై ఇండియన్స్ లీడ్‌లో ఉంది. గత సీజన్‌లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవగా.. గత నాలుగు మ్యాచ్‌లో మాత్రం ముంబైనే మూడింటిలో గెలుపొందింది. అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తోంది.

తుది జట్లు..
ముంబై: రోహిత్‌శర్మ(కెప్టెన్), క్వింటన్ డికాక్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, పాటిన్సన్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, రాహుల్ చాహర్
కోల్‌కతా: దినేశ్ కార్తీక్( కీపర్), టామ్ బాంటన్, శుభ్‌మన్‌గిల్, నితీశ్ రాణా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), ఆండ్రీ రసెల్, కమిన్స్, కుల్దీప్‌యాదవ్/ కమలేశ్ నాగర్ కోటి, ఫెర్గూసన్,
వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ కృష్ణ

పిచ్ రిపోర్ట్
అబుదాబి వేదికగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్ లు జరగ్గా.. 6 మ్యాచ్ ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. పైగా సీజన్ సెకండాఫ్ లో పిచ్ లన్నీ నెమ్మదిగా మారాయి. స్పిన్ కు అనుకూలిస్తున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగే ఎంచుకోవచ్చు. అయితే ఈ మైదానంలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ మూడింటిలో గెలిచింది. ఆ ఒక్కటి కూడా ముంబై చేతిలోనే ఓడింది. ఇక ముంబై 5 మ్యాచ్‌లు ఆడి నాలుగు గెలిచింది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న దినేశ్ కార్తీక్.. తప్పించారా? తప్పుకున్నాడా?
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications