Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ మ్యాచ్‌లను కాదబ్బా.. మా ఆయనను మిస్సవుతున్నా: సాక్షి

Sakshi Dhoni says I don’t miss attending IPL games but I’m missing my husband

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి సింగ్.. ఐపీఎల్ మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా.. అక్కడ ప్రత్యక్షమయ్యేది. తన భర్త టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌కు మద్దతు తెలిపేది. ప్రేక్షకుల గ్యాలరీలో తెగ సందడి చేసింది. టీవీ కెమెరాలు పదేపదే సాక్షిని చూపించేవి. కానీ కరోనా పుణ్యమా ఈ సీజన్ ఐపీఎల్ దుబాయ్‌కు తరలడంతో ఈ ధోనీ సతీమణి భారత్‌లోనే ఉండిపోయింది. వ్యాపారపరంగా తనముందున్న కమిట్‌మెంట్స్ కారణంగానే దుబాయ్ వెళ్లలేదని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ల కన్నా తన భర్త ధోనీనే ఎక్కువ మిస్సవుతున్నానని సాక్షి చెప్పుకొచ్చింది.

వినోద రంగంలో..

వినోద రంగంలో..

ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా త్వరలో ఒక సైన్స్‌ ఫిక్షన్‌ వెబ్‌ సిరీస్‌ను రూపొందించనున్నట్లు ఇటీవల సాక్షి సింగ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందు కోసం ఒక పురాణ గాథను కథగా ఎంచుకున్నట్లు ఆమె చెప్పింది. ‘రాబోయే సిరీస్‌ ఒక అద్భుత అనుభవాన్ని అందిస్తుంది. ఇంకా ప్రచురితం కాని ఒక పౌరాణిక సైన్స్‌ ఫిక్షన్‌ పుస్తకం హక్కులను మేం రచయిత నుంచి తీసుకున్నాం. ఒక అఘోరి ప్రయాణాన్ని అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో చూపిస్తాం. అఘోరి చెప్పే విషయాల్లో భూత, వర్తమాన, భవిష్యత్‌ గురించిన అంశాలు ఉంటాయి. విశ్వానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ఇందులో చూపిస్తాం. ఒక సినిమా తీయడంకంటే వెబ్‌ సిరీస్‌ మా ఆలోచనలకు దగ్గరగా ఉంటుందని ఇందులోకి అడుగు పెడుతున్నాం' అని సాక్షి వివరించింది.

ఐపీఎల్ మ్యాచ్‌లను కాదు..

ఐపీఎల్ మ్యాచ్‌లను కాదు..

ఈ సందర్భంగానే ధోనీని తానెంతో మిస్సవతున్నానని చెప్పుకొచ్చింది. ‘ఐపీఎల్ మ్యాచ్‌లను నేనేం మిస్సవ్వడం లేదు. టీవీలో ఫాలో అవుతున్నాను. కానీ నా భర్తనే తెగ మిస్సవుతున్నా. రెండు నెలలపాటు ధోనీ దూరంగా ఉండటం నాకు, జీవాకు కష్టంగా ఉంది.'అని సాక్షి పేర్కొంది. లాక్‌డౌన్ కారణంగా జీవాతో మరింత దగ్గరగా గడిపానని, దగ్గరుండి ఆన్‌లైన్ క్లాస్‌లకు హాజరవ్వడం, హోమ్ వర్క్స్ చేయించానని సాక్షి చెప్పుకొచ్చింది.

త్వరలోనే నటీనటులు..

త్వరలోనే నటీనటులు..

ఐపీఎల్‌లో రెండేళ్లు నిషేధానికి గురైన తర్వాత పునరాగమనం చేసిన 2018లో టైటిల్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స ప్రయాణాన్ని చూపిస్తూ ‘రోర్‌ ఆఫ్‌ లయన్‌' పేరుతో గత ఏడాదే ధోని బ్యానర్‌ నుంచి డాక్యుమెంటరీ వచ్చింది. అయితే పూర్తి స్థాయిలో వినోద రంగంలో అడుగు పెట్టడం మాత్రం దీంతోనే మొదలు కానుంది. కొత్త సిరీస్‌కు సంబంధించి త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంచుకోనున్నారు.

ఓ ఐసీసీ.. ఇదేం డీఆర్‌ఎస్ రూల్? ఎట్టెట్టా.. ఆ సింగిల్ కౌంట్ కాదు? ఇంత అన్యాయమా?

Story first published: Friday, October 2, 2020, 18:12 [IST]
Other articles published on Oct 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+