నా బ్యాట్‌తో అండర్సన్ తల పగలగొట్టాలనుకున్నా: పాక్ మాజీ క్రికెటర్

ఇస్లామాబాద్: ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ తల పగలగొట్టాలనుకున్నానని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సయీద్ అజ్మల్ తెలిపాడు.
2010 ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా బర్మింగ్ హోం వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ బౌలర్లు తనను టార్గెట్ చేశారని ఈ పాక్ ఆఫ్ స్పిన్నర్ గుర్తు చేసుకున్నాడు.
ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టెయిలండర్ అయిన అజ్మల్ ఇంగ్లీష్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచి హాఫ్ సెంచరీ సాధించాడు. తాజాగా క్రికెట్ పాకిస్థాన్ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన సయీద్ అజ్మల్ నాటి మ్యాచ్ క్షణాలను నెమరవేసుకున్నాడు.

జోక్ చేస్తున్నాడుకున్నా..
‘ఇంగ్లండ్ ప్లేయర్లు కొత్త బంతిని అందుకోగానే.. అండర్సన్ నా దగ్గరకు వచ్చి బౌన్సర్లు ఎదుర్కోవడానికి సిద్ధమేనా? అని ప్రశ్నించాడు. నేను ఇంగ్లిష్ రాదని చెప్పాను. నేనో టెయిలెండరని అతడలా జోక్ చేసి ఉంటాడనుకున్నా. నన్ను త్వరగా ఔట్ చేయడానికి నేరుగా బంతులు వేస్తాడునుకున్నా.'అని అజ్మల్ చెప్పుకొచ్చాడు.

బౌన్సర్లు తట్టుకోలేక..
‘నాపై వారు వరుస బౌన్సర్లతో దాడికి దిగారు. ఆరేడు బంతుల తర్వాత.. సహచర పాక్ ప్లేయర్ జుల్కర్నైన్ హైదర్‌ను పిలిచి అండర్సన్ తలను నా బ్యాట్‌తో పగులగొట్టేస్తానని చెప్పాను. ఆ తర్వాత భారీ షాట్లు ఆడాలని డిసైడయ్యా. క్రీజు వదిలి ముందుకొచ్చి రెండు బౌన్సర్లు బాదేశాను. ఇక అప్పటి నుంచి బంతి నా బ్యాట్ మీదకు రావడం మొదలెట్టింది. అలా 50 పరుగులు పూర్తి చేశా'అని అజ్మల్ పేర్కొన్నాడు. తన కెరీర్‌లో అజ్మల్‌కు ఇదే తొలి, ఆఖరి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.
ఆ మహిళా క్రికెటర్‌తో డిన్నర్ చేయాలనుంది: భారత క్రికెటర్

చిత్తుగా ఓడిన పాక్..
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 72 పరుగులకే కుప్పకూలగా.. ఇంగ్లండ్ 251 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కాస్త మెరుగ్గా రాణించిన పాక్ 296 పరుగులు సాధించి పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. కానీ ఇంగ్లండ్ కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి పాక్‌ను మట్టికరిపించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్ గ్రేమ్ స్వాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఈ నాలుగు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-1 తేడాతో గెలుపొందింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications