Onam 2020: మలయాళంలో సచిన్ ట్వీట్.. ట్రాన్స్‌లేషన్‌లో తప్పులతడకలు!

ముంబై: మలయాళీలకు అత్యంత ముఖ్యమైన పండుగ 'ఓనమ్'. రైతులు తాము పండించిన పంట కోతకు రావడంతో అందుకు ఆనందపడుతూ చేసుకునే పండగ ఇది. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని ఎలా చేసుకుంటామో అంతే సందడిగా అక్కడ ఓనమ్ చేసుకుంటారు. మొత్తం పది రోజుల పాటు జరిగే ఈ పండుగ.. అథమ్‌తో తొలి రోజు వేడుకలు ప్రారంభమై చిత్తిర, చోతి, విశాగం, అనిళ, థ్రికెత్త, మూలం, పూరాడం, ఉత్రాడం అంటూ చివరిగా తిరుఓనమ్ తో ఈ సంబరాలు ముగుస్తాయి. మలయాళీలకు ముఖ్యమైన ఈ పండుగ సందర్భంగా క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఓనమ్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా మలయాళీలకు మలయాళంలో ట్వీట్ చేసి ఓనమ్ విషెస్ చెప్పాడు. 'చింగమ్(మళయాళం నెల పేరు) శుభ ఉదయం సందర్భంగా మీ అందరికి నా హృదయపూర్వక ఓనమ్ శుభాకాంక్షలు'అని మళయాళంలో సచిన్ రాసుకొచ్చాడు. అయితే ఇది ట్విటర్ ట్రాన్స్‌లేషన్‌లో తప్పుగా చూపిస్తుంది. ఇదే విషయాన్ని అభిమానులు ప్రస్తావిస్తున్నారు. అనువాదంలో సరైన వ్యాఖ్యలు పెట్టాలని సూచిస్తున్నారు.

ఇంకొంత మంది మళయాళం రాక సచినే తప్పులో కాలేసాడని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ట్రాన్స్‌లేషన్ స్క్రీన్ షాట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇక సచిన్‌తో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సైనా నెహ్వాల్, పీటీ ఉష ఇతర క్రీడాకారులు మలయాళీలకు ఓనమ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ రోజున మలయాళీలు నిర్వహించే ఓనసద్యా అనే విందు చాలా ముఖ్యమైనది. ఇందులో తప్పకుండా పాల్గొనాలనే ఆచారం వారికి ఉంది. పేదవాళ్లు, ధనవంతులు అని భేదం లేకుండా అందరూ తప్పనిసరిగా పండుగ వేడుకలను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా కేరళలో ఎక్కడ చూసినా... ఏనుగుల స్వారీలు, అందమైన తెల్లచీరలతో మగువలు, రంగురంగుల రంగవల్లులతో రకరకాల పూలతో అంత్యంత సుందరంగా చేసిన అలంకరణలు అందరిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. పండుగ అంతా కోలాహలంగా ఉంటుంది. ఓనమ్ పండుగ సందర్భంగా ఇంటిని పేడనీళ్లతో అలికి రంగురంగుల పువ్వులతో అందంగా అలంకరిస్తారు. దీనిని వల్లమ్‌కలి అని అంటారు.
రైనాకు విజయ గర్వం తలకెక్కింది.. అతని నిష్క్రమణతో మాకు వచ్చే నష్టమేం లేదు: శ్రీనివాసన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications