For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత బౌలర్లు ఆ వ్యూహం అనుసరిస్తే స్టీవ్ స్మిత్‌ను అడ్డుకోవచ్చు: సచిన్ టెండూల్కర్

Sachin Tendulkar Urges Indian Pacers To Target The Fifth Stump Against Steve Smith

న్యూఢిల్లీ: వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఎదుర్కోవడం ఎంత పెద్ద బౌలర్‌కైనా సవాలే. ఎణందుకంటే అతని టెక్నిక్ చాలా విభిన్నంగా ఉంటుంది. క్రీజులో అటూ ఇటూ కదులుతూ ఉండే అతనికి ఎక్కడ బంతి వేయాలో బౌలర్లకు అర్థం కాదు. అయితే రాబోయే సిరీస్‌లో ఫిఫ్త్ స్టంప్ లైన్‌పై బంతులు వేసి స్మిత్‌ను అడ్డుకోవాలని భారత పేసర్లకు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సూచించాడు.

టెక్నిక్ తగ్గట్లు..

టెక్నిక్ తగ్గట్లు..

‘స్మిత్ టెక్నిక్ అసాధారణంగా ఉంటుంది. సాధారణంగా అయితే టెస్ట్ మ్యాచ్‌ల్లో అరౌండ్ ఆఫ్ స్టంప్ లేదా ఫోర్త్ స్టంప్ లైన్‌పై బంతులు వేయాలని బౌలర్లకు చెబుతుంటాం. కానీ స్మిత్ క్రీజులో అటు ఇటు కదులుతూ ఉంటాడు. కాబట్టి ఆ లైన్‌ను మరో నాలుగైదు అంగుళాల దూరం జరపాల్సి ఉంటుంది. దాని కోసం బౌలర్లు ఫోర్త్-ఫిప్త్ స్టంప్ మధ్య ఓ లైన్‌ను ఊహించుకొని దాన్నే టార్గెట్ చేయాలి. బౌలర్లు తమ మనసులో ఆ లైన్‌ను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది.

ఆఫ్ స్టంప్ ఏరియాలో..

ఆఫ్ స్టంప్ ఏరియాలో..

ఈ సిరీస్‌లో భారత బౌలర్లు తపపై దూకుడుగా ఉంటారని స్మిత్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. అలాగే, షార్ట్ పిచ్ బాల్స్ సవాల్‌కు రెడీ ఉన్నానని తను చెప్పినట్లు చదివా. నేనైతే ఆఫ్ స్టంప్ ఏరియాలో అతడిని పరీక్ష పెట్టాలని అంటున్నా. అతడిని బ్యాక్‌ఫుట్‌పైనే ఆడేలా.. స్టార్టింగ్‌లోనే మిస్టేక్ చేసేలా బౌలింగ్ చేయాలి. తరచూ లెగ్ స్టంప్ నుంచి ఆఫ్ స్టంప్‌కు వచ్చే స్మిత్ కోసం ఇన్‌స్వింగింగ్ యార్కర్ కూడా ఎఫెక్టివ్‌గానే ఉంటుంది. కానీ, అది ఫలితం ఇవ్వాలంటే చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ముందుగా బంతి ఏ మేరకు స్వింగ్ అవుతుందో చూడాలి. పైగా ఈసారి సలైవా వాడలేం.

ఇంగ్లండ్‌లో స్వింగ్ అవ్వలేదు..

ఇంగ్లండ్‌లో స్వింగ్ అవ్వలేదు..

ఇంగ్లండ్‌లో టెస్టు‌ల్లో డ్యూక్ బాల్ కొన్నిసార్లు స్వింగ్ అవ్వలేదు. మరి ఇక్కడ కొంచెం అయినా స్వింగ్ లభించేందుకు గ్రీనిష్ వికెట్లను ఇస్తారో లేదో తెలియదు. ఒకవేళ బాల్ స్వింగ్ అవ్వకపోతే అసలు స్వింగింగ్ యార్క్‌ర్‌నే మనం చూడలేం'అని సచిన్ చెప్పుకొచ్చాడు. బాల్ ట్యాంపరింగ్ నిషేధం కారణంగా రెండేళ్ల కింద భారత్-ఆసీస్ సిరీస్‌కు దూరమైన స్మిత్ ఈసారి తన మార్క్ చూపాలని పట్టుదలగా ఉన్నాడు. దాంతో, ఈ టూర్‌లో స్మిత్ వికెట్ కీలకం కానున్న నేపథ్యంలో సచిన్ ఇచ్చిన సలహాను మన పేసర్లు ఎంత వరకు పాటిస్తారో చూడాలి.

డిఫెన్సివ్ బౌలర్ కావాలి..

డిఫెన్సివ్ బౌలర్ కావాలి..

జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలతో కూడిన భారత పేస్ బౌలింగ్ అటాక్ సమర్థవంతంగా ఉన్నప్పటికీ టీమ్‌మేనేజ్‌మెంట్ ఓ డిఫెన్సివ్ బౌలర్‌ను వెతికితే బాగుంటుందని సచిన్ అభిప్రాయపడ్డాడు. ‘మన బౌలింగ్‌ యూనిట్ బెస్ట్ అని, చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉందనిన నేనెప్పుడూ చెబుతుంటా.. టెస్ట్ మ్యాచ్‌లు నెగ్గాలంటే మనకు20 వికెట్లు కావాల్సిందే. అయితే వాటి కోసం భారీగా పరుగులు ఇచ్చుకోకూడదు. అందువల్ల అటాకింగ్ బౌలర్లకు తోడు డిఫెన్సివ్ బౌలర్లు ఉండాలి. అంతగా సహకారం లభించని పిచ్‌లపై వాళ్లు కంటిన్యూగా మెయిడిన్ ఓవర్లు వేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచితే ప్రయోజనం ఉంటుంది'అని మాస్టర్ బ్లాస్టర్ అభిప్రాయపడ్డాడు.

India vs Australia: రోహిత్ శర్మ గాయం విషయంలో బీసీసీఐ నిర్లక్ష్యమే కొంపముంచిందా?

Story first published: Wednesday, November 25, 2020, 12:32 [IST]
Other articles published on Nov 25, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+