భవిష్యత్తులో బౌలింగ్ మెషీన్స్ పెడతారేమో.. సచిన్ సెటైర్స్

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో బంతి మెరుపు కోసం, రివర్స్ స్వింగ్ కోసం బౌలర్లు ఉమ్మి వాడరాదని, దానికి బదులు చెమట వాడవచ్చని ఐసీసీ సూచించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని తొలి నుంచి తప్పుబడుతున్న క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో బౌలర్లకు బదులు బౌలింగ్ మెషీన్స్ తెస్తారెమోనని తన స్నేహితులు తనతో అన్నారని తెలిపాడు. శనివారం జరిగిన ఇండియా టుడే క్రికెట్ సలాం కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ క్రికెట్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఉమ్మి నిషేధించిన క్రమంలో బౌలర్లకు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని మాస్టర్ ఐసీసీకి సూచించాడు.

కావాల్సినట్లు బాల్ వేయవచ్చు..
సలైవా నిషేధంపై సచిన్ మాట్లాడుతూ.. ‘ఇంకొన్ని రోజులు పోతే బౌలర్ల ప్లేస్‌లో రెండు ఎండ్స్‌లో బౌలింగ్ మెషీన్స్ చూస్తాం అనుకుంటా. వాటితో బ్యాట్స్‌మన్‌కు కావాల్సినట్టు బాల్స్ వేయవచ్చు. క్రికెట్ అలా మారిపోతుందేమోనని నా ఫ్రెండ్స్ (బౌలర్లు) కొందరు అన్న మాటలివి. ఆట కచ్చితంగా మారబోతుంది అనేది నిజం. సలైవా వాడడాన్ని ఐసీసీ బ్యాన్ చేసింది. దీంతో మిడిల్ ఓవర్స్‌లో ఓ బౌలర్ బాల్‌ను ఎలా స్వింగ్ చేస్తాడు ? చెమట వాడమని అంటున్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని దేశాల్లో ప్లేయర్లకు చెమట పట్టదు. అలాంటప్పుడు బాల్‌ను ఎలా షైన్ చేస్తారు. అలాంటి పరిస్థితుల కోసమైనా ఓ మైనం బాక్స్‌ను అంపైర్స్‌కు ఇవ్వాలి. అది ఎంత ఇవ్వాలో, ఎలా వాడాలో అన్నింటిని ఐసీసీనే తేల్చాలి. ఇన్నింగ్స్‌కు ఇన్నిసార్లు అని కోటా పెట్టాలి.

బంతిని మార్చాలి..
అలా కాదనుకుంటే 45-50 ఓవర్ల తర్వాత బంతిని కచ్చితంగా మార్చాలి. కానీ ఉమ్మి నిషేధం అనేది బౌలర్లకు వందశాతం ఎదురుదెబ్బే. అయితే టెస్ట్‌లకు బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్లు తయారు చేస్తే బౌలర్లకు కాస్త ఉపశమనం కలుగుతుంది. బౌలింగ్ పిచ్‌లు అయితే ఒక్క బాల్ సరిపోతుంది. లేదంటే బాల్‌ను మార్చాల్సిందే. బాల్ మార్పు విషయంలో ప్రత్యర్థి జట్టు అభిప్రాయానికి అనుగుణంగా వెళ్లాలి' అని మాస్టర్ వ్యాఖ్యానించాడు.

ఆస్ట్రేలియాది గొప్ప నిర్ణయం..
ఆస్ట్రేలియాలో క్రీడాటోర్నీలకు, సాంస్కృతిక వేదికలకు 25 శాతం మందిని అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయంపై సచిన్ హర్షం వ్యక్తం చేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టేడియాల్లోకి అభిమానులను అనుమతిస్తే అంతకంటే గొప్ప విషయం మరోటి లేదన్నాడు. ‘జన సమూహంతో కూడిన స్టేడియంలో మ్యాచ్ ఆడితే వచ్చే మజానే వేరు. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు ఆడటం ద్వారా ఆ కిక్కు మిస్ అవుతాం. ప్లేయర్లకు ఇది మైనస్ పాయింట్. గ్రౌండ్‌లో ఫ్యాన్స్ క్రియేట్ చేసే ఎనర్జీ ఏం చేసినా రాదు. కాబట్టి కనీసం 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతించినా బాగుంటుంది. ఈ విషయంలో ఆసీస్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది' అని సచిన్ పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచకప్ నిర్ణయం సీఏదే
స్టేడియాల్లోకి ఫ్యాన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్ ఉంటుందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో మాస్టర్ భిన్నంగా స్పందించాడు. మెగా ఈవెంట్‌ను నిర్వహించగలమో లేదో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్ణయించుకోవాలన్నాడు. దీనిపై వెంటనే నిర్ణయానికి రావడం కూడా కొద్దిగా కష్టమేనని చెప్పాడు. అయితే వచ్చే నెలలో ఇంగ్లండ్, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ ద్వారా క్రికెట్ మళ్లీ మొదలవుతుండటం చాలా ఆనందాన్నిస్తోందన్నాడు. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో తాను పూర్తిగా ఇంటికే పరిమితమయ్యానని సచిన్ తెలిపాడు. ఇంటి నుంచి బయటకు రాక మూడు నెలలు దాటిందని, మార్చి 15 నుంచి బయటి వారిని కలవలేదన్నాడు. హెల్త్ మినిస్ట్రీ సూచనలను పాటిస్తున్నానని మాస్టర్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
కోహ్లీసేనకు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం లేదు: గంభీర్