Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెస్టిండీస్ బౌలర్ల ఆధిపత్యం ఓర్వలేకనే బౌన్సర్ రూల్ తెచ్చారు: డారెన్ సామీ

Daren Sammy says bouncer rule was introduced to limit success of West Indies team

జమైకా: జాతి వివక్షపై గత కొద్ది రోజులుగా తన గళాన్ని గట్టిగా వినిపిస్తున్న వెస్టిండీస్ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ డారెన్ సామీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. విండీస్ పేసర్ల ఆధిపత్యాన్ని ఓర్వలేకనే అప్పట్లో బౌన్సర్ రూల్ తీసుకొచ్చారని ఆరోపించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు బౌన్సర్లు సంధించే సమయంలో తీసుకురాని రూల్.. వెస్టిండీస్ పేసర్లు ఆధిపత్యాన్ని చలాయిస్తున్నప్పుడే అమల్లోకి తెచ్చారని అసహనం వ్యక్తం చేశాడు. 1970-80 విండీస్ జట్టు జైత్రయాత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఫైర్ ఇన్ బాబిలాన్'డాక్యుమెంటరీ గురించి ఐసీసీ 'ఇన్‌సైడ్ ఔట్'షోలో మాట్లాడుతూ సామీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

నాకు అనిపించింది అదే..

నాకు అనిపించింది అదే..

ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్లు డెన్నిస్ లిల్లీ, జెఫ్స్ థామ్సన్ తమ బౌన్సర్లతో బ్యాట్స్‌మెన్‌ను గాయపర్చినప్పుడు ఈ బౌన్సర్ రూల్ తీసుకు రాలేదని ఈ విండీస్ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ఆరోపించాడు. ‘ఫైర్ ఇన్ బాబిలాన్ డాక్యుమెంటరీ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఆ డాక్యుమెంటరీలో లిల్లీ, థామ్సన్ భయంకరమైన బౌన్సర్లు సంధించడం, బ్యాట్స్‌మెన్‌ను గాయపర్చడం కనిపిస్తుంది. కానీ అప్పుడు బౌన్సర్ రూల్ ప్రవేశ పెట్టలేదు. ఎప్పుడైతే వెస్టిండీస్ బౌన్సర్లు తమ ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించారో అప్పుడు ఈ బౌన్సర్ రూల్‌ను తీసుకొచ్చారు. బహుషా.. నేను చెప్పేది తప్పు కావోచ్చు. కానీ నాకు ఈ డాక్యుమెంటరీ చూస్తే ఇలానే అర్థమైంది.

అది చాలా తప్పు..

అది చాలా తప్పు..

వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేయడం కంటే అతడ్ని గాయపర్చడంలో ఎక్కువగా ఆనందాన్ని వెతుక్కునేవారనే ఓ వాదనను తెరపైకి తెచ్చారు. కానీ.. అందులో ఏమాత్రం నిజం లేదు. బౌన్సర్ అనేది ఫాస్ట్ బౌలర్ అమ్ములపొదిలో దాగిన ప్రధాన అస్త్రం. బౌన్సర్ల కారణంగా బ్యాట్స్‌మెన్ వేగంగా క్రీజులో కుదురుకోలేడు. కాబట్టి.. అతడ్ని ఔట్ చేయచ్చు. 'అని సామీ పేర్కొన్నాడు. తాను చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్‌ను ఐసీసీ ట్వీట్ చేసింది.

ఇక ఐపీఎల్ ఆడే సమయంలో సహచర ఆటగాళ్లు తనను నల్లోడా (కాలూ) అని పిలిచారని సామీ ఆరోపించిన విషయం తెలిసిందే. అప్పట్లో దాన్ని అర్థం తెలియకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదని, కానీ దాని మీనింగ్ తెలుసుకొని బాధపడ్డానని పేర్కొన్నాడు. అలా పిలవడంపై సదరు ఆటగాడు తనకు వివరణ కూడా ఇచ్చాడన్నాడు.

ఒక ఓవర్‌కు రెండు మాత్రమే..

ఒక ఓవర్‌కు రెండు మాత్రమే..

ఇక 1991లో బౌన్సర్ల కారణంగా బ్యాట్స్‌మెన్‌ గాయపడుతుండటంతో ఐసీసీ ఒక్క ఓవర్‌కి ఒక్క బౌన్సర్‌ మాత్రమే అనే నిబంధనను తీసుకొచ్చింది. ఆ తర్వాత టెస్టులు, వన్డేలు, టీ20లకు అనుగుణంగా ఆ రూల్‌ను మార్చింది. ప్రస్తుతం మాత్రం ఏ ఫార్మాట్‌లోనైనా ఒక ఓవర్‌‌లో రెండుకు మించి బౌన్సర్స్ వేయడానికి వీల్లేదు. అంతకన్నా ఎక్కువ వేస్తే ఎక్స్‌ట్రాగా పరిగణిస్తారు.

6 బంతులకు 6 బౌన్సర్లు..

6 బంతులకు 6 బౌన్సర్లు..

నిజానికి అప్పట్లో వెస్టిండీస్ బౌలర్లు అరవీర భయంకరంగా బౌన్సర్లు సంధించేవారు. సహజంగా ఎత్తు, బలిష్టమైన శరీరాకృతి కలిగిన కరీబియన్లు ఓవర్‌‌కు వరుసగా ఆరు బౌన్సర్లు సంధించిన సందర్భాలూ కూడా ఉన్నాయి. వారి ధాటికి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలిచేందుకు జంకేవారు. ఓవర్ మెయిడిన్ సంగతి అటుంచితే.. శరీరంపైకి దూసుకొచ్చే బంతులకి గాయపడకుండా తప్పించుకోవడం ఎలా? అని బెంబేలెత్తిపోయేవారు.

కోహ్లీ కన్నా రోహిత్ శర్మనే బెస్ట్ కెప్టెన్: కృష్ణప్ప గౌతమ్

Story first published: Friday, June 26, 2020, 15:31 [IST]
Other articles published on Jun 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+