
స్పందించిన సోనూ సూద్
అష్రఫ్ తీవ్ర అనారోగ్యంతో ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడు. రెండు రోజుల క్రితమే ఈ బ్యాట్ రిపేరర్ విపత్కర పరిస్థితిని మీడియా ప్రపంచానికి తెలియజేయగా.. కళియుగ కర్ణుడు, బాలీవుడ్ విలన్ సోనూ సూద్ స్పందించాడు. అష్రఫ్ సేవలను వినియోగించుకొని కోట్లు సంపాదించిన ఆటగాళ్లు ముందుకు రావడం లేదని, సాయం చేయాలని ఓ నెటిజన్ సోనూ సూద్ దృష్టికి తీసుకువెళ్లగా వివరాలు తెలియజేయాలని ఈ బాలీవుడ్ విలన్ కోరాడు. సోనూ సూద్ స్పందనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురవగా.. క్రికెటర్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

సచిన్ ఆర్థిక సాయం..
ఇక అష్రఫ్ దీన పరిస్థితిని తెలుసుకున్న సచిన్ అతనికి కావాల్సిన సాయం చేశాడని, అష్రఫ్ మిత్రుడు ప్రశాంత్ జెఠ్మాలని మీడియాకు తెలిపాడు. ‘అఫ్రఫ్ అనారోగ్యం గురించి తెలుసుకున్న సచిన్ టెండూల్కర్ సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. అష్రఫ్‌తో కూడా మాట్లాడాడు. ఆర్థికంగా సాయం అందిస్తానని భరోసా ఇచ్చాడు.'అని ప్రశాంత్ జెఠ్మాలని తెలిపాడు.

బ్యాట్ రిపేరర్ అష్రఫ్ చాచా..
బ్యాట్ రిపేరర్.. అష్రఫ్ చాచాగా వాంఖడే పరిసరాల్లో అందరికి సుపరిచితమే. ఆ మైదానంలో ఆడిన ప్రతీ ఒక్క ఆటగాడి బ్యాట్‌కు ఏ సమస్య వచ్చినా రిపేర్ చేసేది అష్రఫ్ చాచానే. భారత ఆటగాళ్లే కాదు.. ఇతర దేశాల ప్లేయర్ల బ్యాట్లకు రిపేర్ చేశాడు. అష్రఫ్ బ్రోస్ అనే బ్యాట్ల కంపెనీని కూడా అతను నడిపిస్తున్నాడు. విండీస్ బోర్డు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ జట్టుకు 16 బ్యాట్లు ఉచితంగా అందజేశాడు.

కరోనాతో ఆగం..
ఇక కరోనాతో క్రికెట్ ఆగిపోవడంతో అతను ఆర్థికంగా చితికిపోయాడు. మ్యాచ్‌ల్లేక బ్యాట్‌లను ఫిక్స్ చేయించుకోవడానకి, కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. దానికితోడు ఐపీఎల్ కూడా యూఏఈ తరలివెళ్లడంతో అతనికి పనిలేకుండా పోయింది. ఇంతలోనే అష్రఫ్ భాయ్ కిడ్నీ ఆపరేషన్‌కు డబ్బులు అవసరమయ్యాయి. అతని శ్రేయోభిలాషి మిత్రుడు ప్రశాంత్ జెఠ్మాలానీ రూ.2 లక్షలు ఏర్పాట్లు చేసిన అతని ఆఫరేషన్‌కు సరిపోలేదు. దీంతో దాతలు ముందుకు రావాలని జెఠ్మాలాని విజ్ఞప్తి చేశాడు.
England vs Pakistan: అదృష్టమంటే పాక్‌దే.. ఓటమి నుంచి గట్టెక్కించిన వరణుడు.. ఇంగ్లండ్‌దే సిరీస్!


Click it and Unblock the Notifications












